స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం -- 114

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512

పుట్టుక పూర్వకర్మ ఫలమే
================

అహం సో అస్మి యః పురా సుతే వదామి కాని చిత్‌
తం మాం వ్యంత్యాధ్యో వృకో న తృష్ణజం మృగం విత్తం మే అస్య రోదసీ

భావం:- పూర్వజన్మలో ఎవడో ఆతడే నేను. దాహంతో బాధపడుతున్న జంతువు తోడేలుకేవిధంగా దొరికిపోతున్నదో అదే రీతిగా ఈ జన్మలో నాకు దుఃఖాలు కలుగుతున్నాయి.
వివరణ:- మృగం దాహంతో బాధపడుతూ పరుగిడసాగింది. మిలమిల మెరిసిపోయే ఇసుక మీద పడ్డ సూర్యకిరణాలు జలభ్రాంతిని సృష్టించాయి. ఆ ఎండమావిని చూచి మృగం జలమని భావించింది. మృగం ఆశతో పరుగుపెట్టింది. పరుగుపెట్టినకొలది నీరు దూరమైపోసాగింది. జంతువు పరుగుపెట్టిపెట్టి అలసిపోయింది.
చివరకు దాహార్తితో మృగం నేలకొరిగింది. నాలుక బయటకు వచ్చింది. అయినా జీవితం మీద ఆశ వదల లేదు. ఆ ఆశ, నిరాశలమధ్య కొట్టుమిట్టాడుతున్న సమయంలో మృగం వద్దకు తోడేలువచ్చి దానిని పట్టి భక్షించింది. పాపం చివరకామృగం దాహం తీరకనే చనిపోయింది. నాలుగు ప్రక్కల నీరుకాని ఎండమావి నీరు కనిపిస్తూంది. కాని అది దాని దాహార్తిని తీర్చనే లేదు.
జీవుడు కూడ మరణించిన ఆ మృగావస్థలో ఉన్నాడు. మృగానికి నీటి మీదవలె జీవుడికి భోగాపేక్షయే దాహం. ఐహిక విషయ లాలసయే దాహం. దీనిచేతనే జీవుడు సదా ఆర్తిపొందుతున్నాడు. ఈ భోగ- విషయవాంఛలను సంపూర్ణం చేసుకొనేందుకే జీవుడు లోకమంతటా పరుగుపెడుతున్నాడు. ఎక్కడో ఏదోవస్తువు అందిన వెంటనే దీనితో నా భోగ- విషయ పిపాస తీరిపోగలదని సంతోషపడి పోతున్నాడు జీవుడు. కాని ఆ పిపాస తీరదు సరికదా! మరింత పెరిగిపోసాగింది. జీవుని ఇట్టి దుఃస్థితిని చూచియే కాబోలు ‘్భగాభ్యాసాత్ వివర్థంతే రాగాః’ (రోగాః) భోగాల ననుభవించేకొద్దీ రాగాలు (రోగాలు) వృద్ధిపొందగలవని వేదవ్యాసుడు హితవు పలికాడు.
భోగాల ఎడల అత్యంతమైన ఆతురతగల ప్రాణులన్ని ఎండమావుల వెంట పడే మృగాలవలె భోగజలాలకోసం పరుగులు పెడుతూ ఉన్నాయి. కాని వాటికి భోగజలాలు లభించక పిపాసతోనే మరణిస్తున్నాయి. విచారింపదగిన విషయమేమంటే అనాది కాలంగా మృత్యువనే తోడేలు ప్రాణులను ఇదే రీతిగా కబళించివేస్తున్నది. సుందరమైన ఈ వృత్తాంతాన్ని శ్రుతి ‘తం మాం వ్యంత్యాధ్యో....మృగమ్’ దప్పికగొన్న మృగాన్ని తోడేలువలె నన్ను ఆధివ్యాధులు వచ్చి మీదపడి మ్రింగివేస్తాయి అని సంగ్రహంగా విపులీకరించింది. ఇంతకు ఆ జీవినైన నేనెటువంటి వాడిని?
ఈ విచికిత్సకు సమాధానం ‘అహం సో అస్మి పురాసుతే’ పూర్వజన్మలో చేసిన పాప పుణ్యకర్మల కనుగుణమైన జన్మను ఇప్పుడు పొందిన ఆ ఆత్మకలవాడనే అని వేదం జ్ఞప్తికి తెచ్చింది. పూర్వజన్మ సంస్కారాలు బాగా అంటిన ఆత్మగల నేను ఆ కర్మబంధాలలో చిక్కుకొని నేనెవరినో అన్న ఆలోచన కూడ చేయక ప్రవర్తిస్తూ ఉండటంవలన ఇంతవరకు భగవంతుని ఎడల అభిముఖ్యమే ఏర్పడలేదు.నేను ప్రత్యక్ష వాదిని. హేతువాదిని. ఆ విశ్వకారుడు ఈ చర్మచక్షువులకు ఎలాగూకానరాడు. ఆయనపై నెపంపెట్టక మాతాపితలను పోలిన ‘విత్తం మే అస్య రోదసీ’. భూమ్యాకాశములారా! నా దురవస్థను మీరే గ్రహించండి! అని ప్రార్థించమని శ్రుతి హితవు పలుకుతూంది. ఔను. నీ దురవస్థను ద్యావాపృథువులే ఎరుగును. నీవు ఊర్ధ్వగతి పొందుటకు కనీన ప్రయత్నం కూడ చేయనే లేదు. అందుకే నీకీ దురవస్థ. విచారము.

-- ఇంకావుంది...