స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-115

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ భూమ్యాకాశములారా! నా సంసార బాధలను గ్రహించండి
సం మా తపంత్యభితః సపత్నీ రివ పర్శవః
మూషో న శిశ్నా వ్యదంతి మాధ్యః
స్తోతారం తే శతక్రతో విత్తం మే అస్య రోదసీ॥ ఋ.1-105-8॥
భావం:- సాంసారిక బాధలు నన్ను నాలుగువైపులనుండి చుట్టుముట్టి సవతులు తమ భర్తలను బాధించే విధంగా బాధిస్తున్నాయి. అవి సుఖానుభవంకోసం నన్ను ఎలుకలవలె పీడిస్తూ ఉన్నాయి. ఓ ఇంద్రా! నిన్నారాధించే నన్ను మనోవ్యాధులు కలవరపరుస్తున్నాయి. ఓ భూమ్యాకాశములారా! నా రుూ దురవస్థను మీరైనా గ్రహించండి.
వివరణ:- ఒక పురుషుడికి ఒక భార్య, ఒక స్ర్తికి ఒక భర్త ఉండడమే ధర్మం. ఈ ఏకపత్నీ మరియు ఏకపతీ ధర్మాన్ని పరోక్షంగా ఈ మంత్ర ముపదేశించింది. లోకంలో కొందరు ఒకరికంటె ఎక్కువగా స్ర్తిలను పెండ్లాడి భార్యలుగా పొందుతారు. జీవితంలో వారి జీవితమెంత దుర్భరంగా ఉంటుందో శ్రుతి యిచట వివరిస్తూంది.
సంసార వైముఖ్యభావనతో విరాగియైన ఒక జిజ్ఞాసువునకు సాంసారిక భోగాలు నిస్సారంగా శత్రువులుగా కనబడసాగాయి. విషయాసక్తుడైన సంసారి సాంసారిక విషయ లంపటుడై జీవితంలో భోగాలనే తప్ప ఒక్కసారి కూడ దైవాభిముఖుడు కావడం లేదు. కొంత కాలానికి అతడు భయంకర ఆధి వ్యాధుల చేత పీడింపబడుతున్నాడు. ఇలా విషయాసక్తత వలన కలిగే పరిణామ దుఃఖానికి వ్యాకులుడై సన్నిహితమైన జరామృత్యువులను చూచి భయవిహ్వలు డవుతున్నాడు. అతడికి ఆ చివరి దశలో ప్రపంచమే ఈర్ష్యా- ద్వేష- లోభమయంగా భీతిని గొలుపుతుంది. సామాన్య జీవులను సంసార మా రీతిగా పీడిస్తూ ఉంది. అయినా వారు దానిని పీడనగా తలంచరు. సుఖంగానే ఆనందాన్ని పొందుతూ ఉంటారు. కాని సంస్కారవంతులకీ సాంసారిక దుఃఖాలు దుఃఖాలుగానే కనబడతాయి. నిప్పు, నీరువలె ప్రపంచంలోని ద్వంద్వాల మధ్యగల వైరుధ్యాన్ని గుర్తించి దృశ్యమాన జగతిలోని వస్తుజాలమంతా దుఃఖకారకమని సంస్కారి గ్రహిస్తాడు. యోగదర్శనమా జీవుల దుఃస్థితిని గూర్చి ఇదే విధంగా వర్ణిస్తూంది.
పరిణామ తాప సంస్కార దుఃఖైర్గుణ వృత్తి విరోధాచ్ఛ
దుఃఖమేవ సర్వం వివేకినః॥ యో.ద.2-15॥
భావం:- పరిణామ దుఃఖమూ, తాపత్రయ దుఃఖమూ, సంస్కార (వాసనా) దుఃఖమూ, సత్వ రజ స్తమో గుణాలు పరస్పర విరోధ జనితమైన దుఃఖమూ చూచి వివేకవంతులు సమస్తాన్ని దుఃఖమయంగా చూస్తారు. ఆ రీతిగ భావించిన వివేకి వ్యాకులుడై వానినుండి విరాగుడై యుండడం సహజమే. అట్టివాని వ్యాకులత ఈ మంత్రంలో అందంగా వివరించబడింది. చూడండి. ‘సం మా తపంత్యభిః సపత్నీ రివ పర్శవః’॥ సవతుల వలె సాంసారిక బాధలు నాకు పరితాపాన్ని కలిగిస్తున్నాయి అని వేద వచనం. ఒకే ఒక భార్య ఆదేశాలను- అవసరాలను, కోర్కెలను తీర్చడమే నిజానికి కష్టం. మరి భార్యలు ఎక్కువమంది అయితే? అందునా పరస్పర విరోధులైతే? ఇక భర్త భార్యలతో కలిసి జీవించడం దుర్భరమే. ఫలితంగా ఆ భర్త చింత అనే చితి మీద కాలిపోక తప్పదు. ఈ దుఃస్థితినే వేదం ‘వ్యదంతి మాధ్యః స్తోతారమ్’ నన్ను మనోవ్యథలు తినివేస్తున్నాయి అని వర్ణించింది. అయితే ఈ దుర్భర పరిస్థితిని ఎవరో వివేకి అయినవాడు తప్ప సంసారులందరును సుఖంగానే భావిస్తూ ఉంటారు. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు