స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-116

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగత్తు భగవంతుని ప్రత్యక్ష శరీరమే
అస్య శ్రవో నద్యః సప్త బిభ్రతి ద్వావా క్షమా పృథివీ దర్శతం వపుః
అస్మే సూర్యాచంద్రమాసాభిచక్షే శ్రద్ధే కమింద్ర చరతో వితర్తురమ్‌॥
ఋ.1-102-2॥
భావం:- ఓ ఇంద్రా! భగవంతుడవైన నీ కీర్తిని సప్తనదులు గానం చేస్తూ నిత్యమూ ప్రవహిస్తున్నాయి. భూమ్యాకాశ అంతరిక్షాలు నీ శరీరాకృతిగా ధరిస్తున్నాయి. సూర్యచంద్రులు నిన్ను దర్శింప చేసేందుకు నీపై శ్రద్ధ్భాక్తులు చూపి మేము జీవించేందుకు నింగిలో వారు విరుద్ధ దిశలలో (తూర్పు-పడమర) ఉదయించి సంచారం చేస్తున్నారు.
వివరణ:- జన్మస్థానం నుండి సముద్ర సంగమం చేసే పర్యంతమూ నదులు ప్రవహిస్తూ నిరంతరమూ భగవానుని యశోగానాన్ని గలగల ధ్వనుల రూపంగా గానంచేస్తూ ఉన్నాయి. భూమ్యాకాశ అంతరిక్షాలు స్వయంగా శరీరాకృతి వహించి ఆ దైవానే్న కనులముందు నిలుపుతున్నాయి. ఈ విషయాన్ని అథర్వ వేదమిలా స్తుతించింది.
యస్య భూమిః ప్రమాంతరిక్షముతోదరమ్‌
దివం యశ్చక్రే మూర్థానం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః॥
యస్య సూర్య శ్చక్షు శ్చంద్రమాశ్చ పునర్ణవః
అగ్నిం యశ్చక్ర ఆస్యం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః॥
యస్య వాతః ప్రాణాపానౌ చక్షు రంగిరసో- భవన్‌
దిశో యశ్చక్రే ప్రజ్ఞానీస్తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః॥
॥ అథర్వవేదం 10-8-32 నుండి 34॥
భావం:- భూమి పాద తలమై, అంతరిక్ష ముదరమై, ద్యులోకం శిరమై వెలుగొందు విశ్వాకారునకు నమస్కారం. సూర్యచంద్రులు చక్షువులుగా అగ్నిముఖంగా ప్రకాశించే అమేయాత్ముడికి నమస్కారం. వాయువు ప్రాణాపానాలుగా, కిరణాలు చక్షువులుగా, దిక్కులు శ్రవణాలుగా విరాజిల్లే సర్వోన్నతుడగు బ్రాహ్మణ్యునకు వందనము.
భగవద్రూపంగా - భాసిల్లే ఈ విశాల అనంత విశ్వాన్ని చూచి దానిముందు ఎవని శిరస్సు వంగదు? సూర్యుడు తూర్పున, చంద్రుడు పశ్చిమాన (శుక్లపక్షారంభంలో) వ్యతిరేక దిశలలో ఉదయిస్తారు. అయినా ఇరువురు జీవులకు సుఖ- సంతోషాలే కలిగిస్తూ ఉంటారు. స్వయంగా వారావిధంగా ప్రవర్తిస్తున్నారా? లేదు ఎవరో ఒక మహాశక్తివంతుని ఆదేశంమేరకే అలా నడుచుకొంటూ ఆయన ఉనికిని- యశస్సును లోకానికి చాటుతున్నారని వినికిడి.
‘అస్మే సూర్యాచంద్రమసా.... వితర్తురమ్’’ అని సత్యపరాక్రముడైన సర్వేశ్వరుని జగన్నియామకత్వ వైభవాన్ని వర్ణించింది. వారలా జగత్ప్రభువు నియామకత్వాన్ని తలదాల్చి నడుచుకోవడం ద్వారా ఆయన ఎడల జీవులన్ని చూపవలసిన శ్రద్ధ్భాక్తులను నేర్పేందుకే. కంటికి కానవచ్చే కార్యం దాని కర్తను ప్రకటిస్తుంది. నియమబద్ధంగా ప్రవర్తించే సూర్యచంద్రులే నియామకుడైన భగవన్మహిమను స్పష్టంచేస్తూ ఉన్నారు. మహామహిమాన్వితుడైన ఆదిదేవుని యశస్సు మహోన్నతమైనదిగా-
ఉత్తే శతాన్మఘవన్నుచ్చ భూయస ఉత్సహస్రాద్రిరిచే కృష్టిషు శ్రవః
॥ ఋ.1-102-7॥
‘‘ఓ ప్రభూ! నీ యశస్సు జనులలో శతాధికంగా - సహస్రాధికంగా- సర్వోన్నతంగా వ్యాప్తమై యుంది’’ అని ఋగ్వేదం బహుధా కీర్తించింది. జగత్తు కార్యమా? కార్యమేనని ఈ జగత్తు నిత్యమూ పొందుతున్న వికారాల ద్వారా, పరిణామం (మార్పు) ద్వారా, వృద్ధి క్షయాల ద్వారా, ఉత్పత్తి-వినాశాల ద్వారా సూచిస్తూంది. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు