స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-118

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుర్బలులైన మనుష్యులు తమకు ఆపదలు సంభవించినంతనే భయభ్రాంతులవుతూ ఉంటారు. పరమేశ్వరుడే వారి ఆ భయభ్రాంతులను తొలగిస్తాడు. లోకేశుని ఆ కృపానుభవాన్ని పొందినవారు ‘‘విశ్వాహేంద్రో అధివక్తానోఅస్తు’ (ఋ.1-102-11) ‘‘సర్వజ్ఞుడైన జగత్ప్రభువే మాకు ప్రబోధకుడు కావాలి. ‘‘మేము ‘అపరిహ్వృతా సనుయామ వాజమ్’ (ఋ.1-102-11) ‘‘సద్బుద్ధితో ఆయన ఉపదేశాన్ని ఆచరిస్తాము’’ అని వేడుకొంటారు.
ఈ విధంగా భగవత్కృపా పాత్రులు కావడానికి ఏదో ఒక నిమిత్తం చేసికొని కృతజ్ఞతలు చెప్పి సామాన్యులు ప్రయత్నిస్తూ ఉంటారు. కాని దైవం మీద సంపూర్ణ విశ్వాసంగల ఆస్తికులు మాత్రం ‘అను త్వేంద్రా రభామహే స్యామ సుమతౌ తవ’ (అథర్వ. 5-8-9) ఓ ప్రభూ! నినే్న ధ్యానించి- లక్ష్మించి కార్యారంభాన్ని చేస్తాం. కాన మమ్ము నీ కృపా దృష్టిలో నిలుపుకో అని ప్రార్థిస్తూ ఉంటారు.
**
సృష్టికి మూలం వేద శబ్ద రాశియే
స పూర్వయా నివిదా కవ్యతాయోరిమాః ప్రజా అజనయన్మనూనామ్‌
వివస్వతా చక్షసా ద్యామపశ్చ దేవా అగ్నిం ధారయన్ ద్రవిణోదామ్ ॥
భావం:- సృష్టికి అనాదికాలం నుండి ఉన్న వేద స్వరూపుడగు పరమాత్మ తన సృష్టి రచనాసామర్థ్యం చేత మరియు అనాది కారణం చేత మానవుల కొఱకు సూర్యునితో సహా ద్యావాపృథువులను, అంతరిక్షాన్ని, దృశ్యమానమైన, సమస్త వస్తుజాతాన్ని సృష్టించాడు. దేవతలు ధనదాతయైన ఆ పరబ్రహ్మనే ఆశ్రయించి సేవిస్తున్నారు.
వివరణ:- జీవులకు శ్రేయోదాయకం కావాలనే పరమాత్మ ఈ సృష్టిని సృజించాడని వేదంలో పలుమారులు చెప్పబడింది. ప్రస్తుత మంత్రంలో కూడ ‘ఇమాఃప్రజాః అజనయ- న్మనూనామ్’కనబడుతున్న ఈ వస్తుజాతమంతా మానవులకొఱకే సృజించాడని పునరుక్తం చేయబడింది. సృష్టించిన వస్తు-పదార్థ జాతానికి పేర్లను కూడ వేద వచనానుసారంగా పెట్టబడినాయని ‘నివిదా’శబ్దం చేత ఈ మంత్రం సూచించింది.
ఈ వేద వచనానే్న మనుస్మృతి శాస్తక్రర్త ఇలా వివరించాడు.
సర్వేషాం తు నామాని కర్మాణి చ పృథక్ పృథక్‌
వేద శబ్ద్భే్య ఏవాదౌ పృథక్ సంస్థాశ్చ నిర్మమే॥ మను.స్మృ.1-21॥
సమస్త నామాలు, కర్మలు, సమస్త సృష్టి ఆరంభంలో వేదశబ్దానుసారంగా నిర్మింపబడ్డాయి.
మరి నిర్మాణమెలా జరిగింది? అన్నదానికి సమాధానంగా ఈ శ్రుతి ‘పూర్వయా నివిదా’అనాదిగా ఉన్న విధానానే్న అనుసరించి సృష్టి నిర్మాణం జరిగిందని స్పష్టపరచింది. ఋగ్వేదమే ఈ విషయాన్ని సూర్యా చంద్రమసౌ ధాతా యథాపూర్వ మకల్పయత్....॥
సూర్య- చంద్రాదులను జగద్విధాత పూర్వకల్పానుసారంగా (యథాపూర్వం) సృష్టిని నిర్మించాడని ధృవీకరించింది. పై వేదమంత్రాలు రెండింటిలోని ‘పూర్వయా, నివిదా’మరియు ‘యథాపూర్వ’ శబ్దాలు ఈ సృష్టి పూర్వం లేనిదికాదని (అపూర్వం) ముందు ముందు ఉండగలదని (అనుత్తరం) విశదపరుస్తున్నాయి.
సృష్టి చక్రంలా సదా భ్రమణ కార్యాన్ని నిర్వహిస్తూనే ఉంటుంది. సృష్టికి ముందు ప్రళయం, ప్రళయానికి ముందు సృష్టి ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. సృష్టి చక్రం అనాది. కాబట్టి సృష్టికర్త నివిత్= సృష్టి నిర్మాణ విజ్ఞానం కూడ అనాదియే. జ్ఞానసాఫల్యం నిర్మాణంలో అంటే ఆచరణలో మాత్రమే ఉంటుంది. ఈ సిద్ధాంతం మీద వేదానికి మంచి నిష్ఠ ఉంది.
నిరంతర సృష్టిరచనా నిపుణుడైన భగవానుడు-
నూ చ పురా చ సదనం రారుూణామ్‌॥ ఋ.1-96-7॥
భూత, వర్తమానాలలో సమస్త ధన నిధులకు పరమాత్మయే పెన్నిధి. మరియు రాయోః బుధ్నః సంగమనో వసూనాం యజ్ఞస్య కేతుర్మన్మసాధనో వేః (ఋ.1-96-6)
ధనవన్ధనుడు- ధనప్రాపకుడు యజ్ఞస్వరూపుడు ఆత్మజ్ఞానమూ మరియు సంస్మరణకు సాధనమూ ఆ పరమేశ్వరుడే. మనిషి సదా ధనాభిలాషి, దైవం ధన నిధి. కేవలం నిధియే కాదు. ధనప్రవర్ధకుడు కూడ, అన్నింటిని మించి ఆత్మకు మూలధనం అంటే జ్ఞాన సాధనం కూడ ఆ సర్వేశ్వరుడే. అందుకే ‘దేవా అగ్నిం ధారయన్ ద్రవిణోదామ్.’ దేవతలు ఆ ధనదాతనే సేవిస్తున్నారు.
సమస్త ధనాలకు పరమాత్మయే పెన్నిధి అయితే ఆయననే సేవించుట యోగ్యము అయితే విద్వాంసులు సహితం ధనవాంఛకు లోనయి ప్రధాన లక్ష్యమైన ముక్త్ధినాన్ని విస్మరిస్తున్నారని రుూ సందర్భంగా గమనించాలి.
అమృతత్వం రక్షమాణాసః ॥
‘అమృతత్వం’ అనగా మోక్షసిద్ధికొఱకు మాత్రమే జీవనాన్ని పరిరక్షించుకొంటూ జీవిత గమనంకోసం లౌకిక ధనాన్ని తగుమాత్రంగా వాంఛిస్తారు. - ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు