స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-119

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్ఞాని నీ పరమశక్తి సామర్థ్యాలను తెలుసుకొంటున్నాడు
తత్త ఇంద్రియం పరమం పరాచైరధారయంత కవయః పురేదమ్‌
క్షమేదమన్యద్దివ్యన్యదస్య సమీ పృచ్యతే సమనేవ కేతుః ॥ ఋ.1-103-1॥
భావం:- ఓ దైవమా! దివ్యదర్శన శక్తిగల కవులు లేదా మహర్షులు మహోన్నతమైన నీ శక్తి-సామర్థ్యాలను ప్రత్యక్ష ప్రమాణాల ద్వారానే తెలుసుకొంటున్నారు. నీ శక్తి-సామర్థ్యాలు భూమిపై ఒక విధంగాను ఆకాశంలో మరొక విధంగాను ఉన్నాయి. అవి భిన్నంగా కనబడుతున్నా రెండింట నీ బుద్ధి వైభవం ఒకే విధంగా వ్యాప్తమై కార్య నిర్వాహకమవుతున్నది.
వివరణ:- విశ్వాధారుని మహిమను ఎవరు వర్ణించగలరు? దయతో ఆయనే సృష్ట్యారంభంలో మహామనీషులకు తన మహిమను తెలిపియుండకపోతే మానవులు సహితం భగవన్మహిమ తెలియక పశువులవలెనే ఉండేవారు. అందుకే ‘జంతూనాం నరజన్మ దుర్లభం’ప్రాణులలో మానవజన్మ దుర్లభమన్న మాట అక్షర సత్యం. మనుష్య జన్మ అయితే పొందవచ్చునేమో కాని ఆ జన్మలో భగవద్విజ్ఞానాన్ని పొందగలగడం మాత్రమొక అద్భుతవరమే. ఆ విధంగా పొందినవారిని వేదం కవులు లేదా మహర్షులు అని ప్రశంసించివారు ప్రత్యక్ష ప్రమాణం చేతనే భగవద్విజ్ఞానాన్ని పొందుతున్నారు. ‘తత్త ఇంద్రియం పరమం పరాచైర ధారయంత కవయః పురేదమ్’ అని వివరించింది.
భగవద్విజ్ఞానాన్ని అంటే భగవంతుని శక్తిసామర్థ్యాలను తెలుసుకోవడమొక ఉపాసన. ఉపాసన అంటె దగ్గరగా ఉండటమని అర్థం. అగ్నికి దగ్గరగా ఉంటే కాంతి- వేడి ఎలా సంక్రమిస్తాయో దైవానికి సన్నిహితంగా ఉండేవానికి కూడ దైవశక్తులు లభిస్తాయి. కవులు లేదా మహర్షులు దైవశక్తులను పొందినది ఆ ఉపాసనా విధానమార్గంలోనే. భగవచ్ఛక్తి వివిధ రీతులుగా ఉంటుందని శే్వతాశ్వతర మహర్షి-
‘పరాస్య శక్తి ర్వివిధైవ శ్రూయతే’(శే్వతాశ్వతరోపనిషత్తు 6-8)
శే్వతాశ్వతరోపనిషత్తులో పేర్కొన్నది యథార్థమే. అయినా శ్రుతి అవగాహనా సౌలభ్యంకోసం ‘క్షమేదమన్యత్ దివ్యన్యదస్య’ భూమిపై ఒక విధంగా ఆకాశంలో మరొక విధంగా రెండు విధాలుగా ఉంటుందని విభాగించి చెప్పింది. ఆలోచించి చూస్తే ఈ విభాగమెంతో యుక్తియుక్తంగా కనబడుతుంది. భూమిమీద ఉండే పర్వతాలు, వృక్షాలు, నదులు మొదలైన వానిలో వేనిని పరిశీలించినా అన్నింటికి భూమి ఆధారంగా ఉన్నట్టు స్పష్టపడుతుంది. కాని దీనికి భిన్నంగా సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాలు ఆకాశంలో నిరాలంబనంగా ఉంటాయే. తప్ప వానికి ఆకాశం భూమివలె ఆధారభూతంగా ఉన్నట్లు కనబడదు. స్థూలంగా చెప్పబడిన ఈ రెండు విధాలయిన దైవీశక్తులను గమనిస్తే వైవిధ్యమెంతో, శే్వతాశ్వతర మహర్షి భగవచ్ఛక్తి వివిధాత్మకమని చెప్పింది ఈ వైవిధ్యానే్న.
భగవచ్ఛక్తి సామర్థ్యాలు రెండు విధాలని చెప్పిన ఋగ్వేదమే మరొక సందర్భంలో
యో విశ్వస్య ప్రతిమానం బభూవ యో అచ్యుతచ్యుత్ (ఋ.2-12-9)
కూలిపోని వానిని గూడ కూలగొట్టగల శక్తిసామర్థ్యాలు కలవాడే పరిపూర్ణుడైన సృష్టి నిర్మాణకర్త అని దైవ ఘటనాఘటన సామర్థ్యాన్ని శ్లాఘించింది. మరో సందర్భంలో ఋగ్వేదమే ఆ అమేయాత్ముని అద్భుత బల సామర్థ్యాలను స్మరించి ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ ఒక భక్తుని నోట-
‘ఇంద్రస్య ను వీర్యాణి ప్ర వోచం యాని చకార ప్రథమాని వజ్రీ’ (ఋ.1-32-1)
ఓ ఇంద్రా! నీ అద్భుత బల సామర్థ్యాల నేమని స్తుతింపను. వానిని నీవు నీ సృష్టి రచనలో సమ్మిళితం చేసావు అంటూ పలికించింది.
ఈ విధంగా ఋగ్వేదం సృష్టి సర్వవ్యాప్తమై యున్న దైవబల సామర్థ్యాలను పలు సందర్భాలలో బహుధా శ్లాఘించింది.
**
దైవమందరకు మార్గం చూపుతాడు
ఓ త్యే నర ఇంద్రమూతయే గుర్నూ చిత్తాన్ త్సద్యో అధ్వనో జగమ్యాత్‌
దేవాసో మన్యుం దాసస్య శ్చమ్నంతే న ఆ వక్షన్ త్సునితాయ వర్ణమ్ ॥
భావం:- అరె! మనుష్యులు తమ రక్షణకొరకు ఇంద్రుని వద్దకు వెళ్ళారు. అతడు వారిని మంచిమార్గానికి చేర్చాడు. నిష్కామకర్మిష్ఠుడైన ఆ ఇంద్రుడు దుర్భలులైనవారిని, వారి కోపాన్ని అనగా పాపాలను క్షమించాడు. వారికి మేలు కలిగించేందుకు మనసులో క్రోధావేశాన్ని వహింపలేదు.
వివరణ:- మంచి ఆధ్యాత్మిక మార్గమేదో తెలియక మనుషులు పలుచోట్లకు తిరుగుతున్నారు. ఎవరో విశిష్టవ్యక్తులు తాము కనుగొన్న తమతమ నూతన మార్గాలను ప్రశంసిస్తూ వారికి బోధిస్తున్నారు. - ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు