స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-121

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
అందుకే ఋగ్వేదమీ ప్రస్తుత వేద ప్రతిపాదనకు బలకరంగా తదుపరి మంత్రంలో ‘‘తదింద్ర ప్రేవ వీర్యం చకర్థ యత్ససంతం వజ్రేణా బోధయో- హిమ్ (ఋ.1-103-7)’’ ఓ ఇంద్రా! నీవు మహాబలసాధ్యమైన కార్యాలను చేస్తున్నావు. నివారణాబల సామర్థ్యంతో నిద్రించే పాపులను సహితం మేల్కొల్పి పాపవిముక్తులను చేస్తున్నావు’అని దైవఘటనా ఘటన సామర్థ్యాన్ని కొనియాడింది.
అర్చంతి నారీరపసో న విష్ట్భిః సమానేన యోజనేనా పరావతః
ఇషం వహంతీః సుకృతే సుదానవే విశే్వదహ యజమానాయ సున్వతే
భావం:లోకంలో సాధారణంగా ఎవరు సత్కర్యాలను చేసేవారిని అన్నప్రదాన మర్యాదలచేత గౌరవిస్తూ ఉంటారో అట్లే ఎవరు సత్కర్మానుష్టాన పరాయణులు, దానశీలురు, యజ్ఞ- యాగ కర్మిష్ఠులు, సోమరస సంపాదనాభిలాషులో అట్టి పురుషుల కొరకు అన్న జలాది సంభారాలను సిద్ధపరచగల, దూర ప్రదేశాలనుండి గొనిరాబడిన సమాన గుణ - కర్మ - స్వభావాలు గల స్ర్తిలతో వివాహం జరిపించడం ద్వారా వారిని గౌరవిస్తూ ఉంటారు.
వివరణ:ఈ మంత్రంలో వివాహ సంబంధమైన కొన్ని ముఖ్యంశాలు ప్రస్తావించబడ్డాయి.
అర్చంతి నారీః- గృహాలలో స్ర్తిలు విధిగా గౌరవింపబడుదు. ఈ విషయాన్ని గూర్చి మనుధర్మశాస్తక్రర్త ఈ క్రింది విధంగా పేర్కొన్నాడు.
జీవితంలో శ్రేయస్సు పొందాలని కోరుకునే తండ్రి, సోదరుడు, భర్త, మరిది మొదలగువారు స్ర్తిలను వస్తభ్రూషణాది ప్రధాన సత్కారాల చేత గౌరవించాలి. ఎక్కడ స్ర్తిలు గౌరవింపబడతారో అచట సర్వశుభాలు కలుగుతాయి. స్ర్తిలు గౌరవింపబడనిచో అక్కడుండేవారి సర్వకార్యాలు విఫలవౌతాయి. స్ర్తిలు శోకించే వంశం శీఘ్రంగా నశిస్తుంది. స్ర్తి ప్రసన్నంగా ఉన్న వంశం దినదినాభివృద్ధి పొందుతుంది. అందుచేత వస్త్ర- అభూషణ- బహుమానాది ప్రధాన సత్క్రియల ద్వారా శుభ సందర్భాలలో, వేడుకల సమయాలలో స్ర్తిలను పురుషులందరూ ప్రీతితో గౌరవించాలి. ఈ విధంగా అర్చంతి నారీః అన్న వేదవచనాన్ని వివరించిన మనువు వివరణ ద్వారా స్ర్తిలను నిరాదరించుట, బాధించుట వేద మరియు ధర్మశాస్త్ర విరుద్ధమని స్పష్టపడుతూ ఉంది. సమానేన యోజనేనాః- వివాహ సమయంలో సమానమైన గుణ కర్మ స్వభావాలు గల వధూవరులనే ఎంచి ఎంచి పెండ్లి జరిపించాలి. ఈ వేదావాక్యాన్ని కూడా మనువు క్రింది విధంగా వివరించాడు.
శ్రేష్టుడు, సుందరుడు మరియు సమాన గుణ కర్మ స్వభావాలు కల వరునితో మాత్రమే వధువునకు వివాహం జరిపించాలి. గుణహీనుడికి కన్యనీయరాదు. సమాన సుస్వభావం కలవానితోనే కన్యకు వివాహం జరిపించాలి. అలా కాకుంటే కాపురం కలహాల కాపురమైపోతుంది.
నారీ పరావతః- కన్యను వేదం దుహితగా వ్యవహరించింది. దుహి శబ్దాన్ని నిర్వచిస్తూ వేద శబ్ద నిఘంటుకారుడు ‘దుహితా దుర్హితా దూరే హితా వా’-
దూర ప్రదేశంలో ఉండటం చేత హితాన్ని (మేలును) పొందునది అని వివరించాడు. ఇదే భావంతో దూరంలో ఉండేవారితో జరిగే వివాహాలవలన కలిగే లాభాలను గురించి దయానంద సరస్వతి సత్యార్థప్రకాశం నాల్గవ సముల్లాసంలో విపులంగా వివరించారు.
సమానేన నారీః- సమానలైన స్ర్తిలతో అన్న మంత్రంలోని ఈ మాట చాలా గంభీరమైనది. మంత్రంలో పేర్కొనబడిన ‘సుకృతే- సు దానవే- యజమానాయ - సున్వతే’ అనే లక్షణాలు గల పురుషులకు సమానులైన స్ర్తిలతో వివాహం జరుపమనడంలో వేదాభిప్రాయం సమానమైన గుణ - కర్మ - స్వభావాలు గల స్ర్తీలనే ఎంచి వివాహం జరుపుమనియే. అంటే స్ర్తి పురుషులమధ్య గుణ - కర్మ స్వభావాల సమానత్వముండాలని వేద హృదయంగా గ్రహించాలి. ఎన్నో వేల ఎండ్లనాటి ఈ వేదభావన ఏ కాలానికైనా, ఏ దేశానికైనా అనువర్తించేదే. దురదృష్టవశాత్తు ఈ వేద సందేశం నేడు ప్రజలలో గూడుకట్టుకొనిపోయిన కుల - మత - సామాజిక- ఆర్థిక- రాజకీయాది వివిధ స్వార్థ ప్రయోజనాల విషవలయంలో చిక్కుకొని విస్మరింపబడట శోచనీయం.
ఇషం వహంతీః- పురుషుడికి యజ్ఞ కర్మానుష్టానమే పరమధర్మం. ఆ ధర్మ నిర్వహణార్థంగా స్ర్తి తన పతికి యజ్ఞార్థమైన అన్న పానాది సమస్త పదార్థాలను సిద్ధం చేయడం పరమ ధర్మం. ఈ దృష్టితోనే భార్యను కామపత్నిగాగాక ధర్మపత్నిగా వేదం వ్యవహరించింది. ఈ విషయంలో మనువు-
అపత్యం ధర్మకార్యాణి శుశ్రూషా రతి రుత్తమా దారాధీన స్త్థా స్వర్గః పితృణా మాత్మనశ్చ హ సంతానాన్ని కనడం, ధర్మకార్యాలలో సహకరించడం, భర్తపై అనురాగం కలిగియుండటం, తనకు తన ద్వారా పితృదేవతలకు స్వర్గలోక సౌఖ్యం కల్గడం- ఇవన్నీ స్ర్తిలకే సాధ్యం అని మరింతగా విపులీకరించాడు. వివాహిత స్ర్తిని పత్ని అంటారు. యజ్ఞ సహకార లక్షణం చేతనే ఆమెకాపేరు సార్థకమవుతుంది.

- ఇంకావుంది...