స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం--123

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
-------------------------------------------------------------------------------

ఇక్కడ అగ్ని అంటె కేవలమగ్నికాదు. తేజస్సు, ఓజస్సు అని అర్థం. వీర్యాగ్ని, బ్రహ్మచర్యాగ్ని, జ్ఞానాగ్ని ఇట్టివన్ని ఆ అగ్ని శబ్దంచేత చెప్పబడుతున్నాయి. సత్కర్మలకు ప్రతిఫలం శాంతి లబ్ధి. శాంతి లబ్ధి చేతనే చేసిన సత్కర్మలు సూచింపబడతాయి. కాబట్టి సత్కర్మానుష్ఠానం చేతనే వీర్య- బ్రహ్మచర్య, జ్ఞానాద్యగ్నులు జాజ్వల్యమానంగా రగిలి మనిషిని తేజోవంతుణ్ణి చేస్తాయి.
ఇక మంత్ర ద్వితీయార్థంలో సత్కర్మాచరణవలన కలిగే ఫలం వివరింపబడింది. సమ్సత సత్కర్మాచరణ మనిషిని సచ్చరిత్రుణ్ణి చేస్తుంది. ఈ శ్రుత్యర్థానే్న విపులీకరిస్తూ మనువు క్రింది విధంగా సూత్రీకరించాడు.
ఆచారాల్లభతే హ్యాయురాచారా దీప్సితాః ప్రజాః
ఆచారాద్ధనమక్షయ్యమాచారోహంత్యలక్షణమ్‌॥ మనుస్మృతి. 4-156॥
భావం:- సదాచారాచరణ వలన దీర్ఘాయువు దానివలన అభీష్టసిద్ధి- సత్సంతానం ఆ అన్నింటివలన అక్షయ ధనసమృద్ధి సిద్ధిస్తాయి.
మహర్షి దయానందులు ఆచార శబ్దానికర్థం బ్రహ్మచర్యం మరియు జితేంద్రియత్వంగా సత్యార్థప్రకాశంలో వివరించారు. సదాచారాన్ని ఆచరించని వాని దుర్దశ ఎట్లుంటుందో మనుస్మృతిక క్రింది విధంగా వివరించాడు.
దురాచారో హి పురుషో లోకే భవతి నిందితః
దుఃఖభాగీ చ సతతం వ్యాధితో - ల్పాయురేవ చ॥ (మనుస్మృతి 4-157)
భావం:- దురాచారిని లోకం నిందిస్తుంది. అతడు సదా దుఃఖాన్ని పొందుతాడు. రోగిగా ఉంటాడు. ఆయువు కూడ క్షీణిస్తుంది. అందుచేత జీవితారంభమైన బాల్యంనుండి మనిషి సదాచారుడై ఉండాలి. అప్పుడే జీవన ఫలమైన శాంతిని పొందగలడు.
**
ప్రభూ! మా బుద్ధులకు శిక్షణ నిమ్ము
సనాదేవ తవ రాయో గభస్తౌ న క్షీయంతే నోప దస్యంతి దస్మ
ద్యుమాన్ అసి క్రతుమాన్ ఇంద్రదీరః శిక్షా శచీవస్తవ నః శచీభిః
॥ ఋ.1-62-12॥
భావం:- ఓ ఇంద్రా! అనాదికాలం నుండి ధనం నీ అధీనంలోనే ఉంది. లేకుంటే ధనమే తరిగిపోయేది లేదా నశించిపోయేది కాదు. ఓ దేవా! నీవు జ్ఞానవంతుడవు. క్రియావంతుడవు. ధీరుడవు. నీవు నీ బుద్ధి శక్తులచేత మాకు శిక్షణనిమ్ము.
వివరణ:- సనాతనుడైన భగవంతుని భగదైశ్వర్యం కూడ అనాదియే. అది అనాదిగా ఆయన అధీనంలోనే ఉంది. లోకంలోని ప్రాణుల ఐశ్వర్యం తరుగుతూ పెరుగుతూ ఉంటుంది. కారణమేమిటో ఋగ్వేద మీ విధంగా వివరించింది.
తృణీయా దిన్నాథమానాయ తవ్యాన్ ద్రాఘీయాం సమనుపశే్యత పంథామ్‌
ఓ హి వర్తంతే రథ్యేవ చక్రా- న్య మన్యముప తిష్ఠంత రాయః
॥ ఋ.10-117-5॥
భావం:- ‘‘రథ చక్రాలు పైకి క్రిందికి తిరిగే విధంగా ధనమెప్పుడూ ఒకరి వద్దనే ఉండక ఒకరి నుండి మరొకరి వద్దకు వెళ్లిపోతూ ఉంటుంది. కాబట్టి ధనాన్ని ఒకచోట ఉండే విధంగా చేయడమొక కళ. ఆ కళ తెలియని వాడిని ధనలక్ష్మి విడిచి వెళ్లిపోతుంది. భగవంతుడు ప్రణీతిః = సర్వోత్కృష్టుడైన నీతివంతుడు కాబట్టి ధనలక్ష్మి సదా ఆయన అధీనంలోనే ఉంటున్నది. తరుగుదల గాని వినాశనం గాని ఆ సర్వేశ్వరుని ధనసంపత్తికి సంభవించనే సంభవించదు. ఎందుకంటె ఆయన తన ధనాన్ని జీవులందరికి దానంచేసే గొప్ప వితరణశీలి ‘్భరి దాహ్యసి శ్రుతః’ (ఋ.4-32-21) అని ఋగ్వేదం ప్రశంసించి ‘ఉతో రయిః పృణతో నోప దస్యతి’ (ఋ.10-117-1) దాత ధనమెన్నడూ నశించదని వివరణ యిచ్చింది.
వేదమంతటితో మిన్నకుండలేదు. అమేయాత్ముని వితరణ మహత్వాన్ని వివరిస్తూ ‘్భయ ఇన్నుతే దానం దేవస్య’ దైవమిచ్చే దానం నిజంగా చాలా మహత్వమైనదని పేర్కొంది. మరి ఆ మహత్వస్థితి ఎలావచ్చిందో కూడ ‘నహి తే శూర రాధసో- తం విందామిసత్రా’(ఋ.8-46-11) ఓ పరమేశ్వర! నీవద్దగల ధన గరిష్ఠత ఎంతో నేను తెలిసుకొనజాలనని వేదం ప్రార్థనా పూర్వకంగా ప్రణమిల్లింది.
అంతటి ధనపారమ్య మా దైవానికెలా సిద్ధించిందో వివరిస్తూ ‘్ధ్యమాన్ అసి క్రతుమాం ఇంద్ర ధీరః’ ఓ ఇంద్రా! నీవు ద్యుతిమంతుడవు. యజ్ఞక్రియావంతుడవు, ధీరుడవు అంటూ స్తుతిపూర్వకంగా కారణాలను ఋగ్వేదం వివరించింది. అందులో మొదటిది ‘ద్యుమాన్’అంటే ఐశ్వర్య స్వభావం తెలిసినవాడని అర్థం. ధర్మబద్ధమైన ఆర్జన- రక్షణలే ఐశ్వర్యాభివృద్ధికి సహజ ధర్మాలు. ఈ ధర్మాలు పాటింపబడని వాని ధనం వినాశనమవుతుంది. సిద్ధసంకల్పుడైన పరమేశ్వరుని ధనమీ ధర్మాల కతీతం. ఎందుకంటె అమృతకల్పుడైన దైవమే ధర్మం. అట్టి ధర్మస్వరూపుడగు పరమాత్ముని ధనం సదా ధర్మార్జితంకాక ఏమవుతుంది? ఇక ధన సంరక్షణ, ధనలక్ష్మి సదాదైవానికి అనపాయిని= ఎన్నడూ విడిచి యుండనిది. దైవసన్నిధిలోని ధనలక్ష్మికి రక్షణకేమి కొదువ? చివరగా క్రతుమాన్= యజ్ఞక్రియాశీలత. యజ్ఞం పరోపకార లక్ష్యమైనది. అందుకొఱకు వినియోగింపబడే ధనానికి వృద్ధియేగాని నాశనమెక్కడ?

-- ఇంకావుంది...