స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం -- 124

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
---------------------------------------------------------

ఈ రీతిగా అక్షయ, అనంత, వర్ధమాన, అనపాయ ధనస్వరూపుడగు భగవంతుని వేదర్షి తనను ధనసమేతున్ని చేయుమని ఇలా ప్రార్థిస్తున్నాడు.
శిక్షా శచీవస్తవ నఃశచీభిః
బుద్ధి ప్రచోదకా! మేమల్పజ్ఞులం. మా బుద్ధి భ్రమకు లోనవుతూ ఉంటుంది. వికారాలను పొందుతూ ఉంటుంది. కావున నీవు మా బుద్ధులకు మంచి ప్రచోదన మిమ్ము.
**2
ఈ రీతిగా అక్షయ, అనంత, వర్ధమాన, అనపాయ ధనస్వరూపుడగు భగవంతుని వేదర్షి తనను ధనసమేతున్ని చేయుమని ఇలా ప్రార్థిస్తున్నాడు.
శిక్షా శచీవస్తవ నఃశచీభిః
బుద్ధి ప్రచోదకా! మేమల్పజ్ఞులం. మా బుద్ధి భ్రమకు లోనవుతూ ఉంటుంది. వికారాలను పొందుతూ ఉంటుంది. కావున నీవు మా బుద్ధులకు మంచి ప్రచోదన మిమ్ము.
మేము నీ వాళ్లమే
భూరి త ఇంద్ర వీర్యం తవ స్మస్యస్య స్తోతుర్మఘవన్ కామమా పృణ
అను తే ద్యౌర్భృహతీ వీర్యం మమ ఇయం చ తే పృథివీ నేమ ఓజసే॥
ఋ.1-57-5॥
భావం:- మహాపరాక్రమశాలివగు ఓ ఇంద్రా! నీ బలపరాక్రమాలు చాల మహత్తరమైనవి. మేము నీవారమే. ఓ ధనేశ్వరా! నినే్న స్తుతించు ఈ భక్తుని కోరికలను సఫలంచేయి. విశాలమైన ఊర్ధ్వలోకాలన్ని నీ శక్తిసంపన్నతకు తగినట్లుగా నిర్మింపబడినవే. ఇక ఈ భూమండలమంతా నీ శక్తిముందు తలవంచుతున్నది.
వివరణ:- అనేక బ్రహ్మాండాలతో నిండిన ఈ అఖండ విశ్వాన్ని సృష్టించిన భగవంతుని శక్తి ఇంత అని ఎవడు కనుగొనగలడు? దుర్బలుడైన ప్రాణికి బలమైన జడమూ మరియు చేతన ప్రాణులన్నింటినుండి ఎప్పుడు భయమే కలుగుతూ ఉంటుంది. అందుచేత ఆ దుర్బలప్రాణి ఆత్మరక్షకునికై అనే్వషిస్తూ ఉంటుంది. అలా అనే్వషించిన జీవుడు తననే కాదు అందరను సంరక్షింపగల రక్షకుని పొందగలుగుతుంది. ఈ విషయాన్ని భంగ్యంతరంగా అథర్వణవేద మీవిధంగా వివరించింది.
స్వస్తిదా విశాం పతిర్వృత్రహా విమృధో వశీ
వృషేంద్రః పుర ఏతు నః సోమపా అభయంకరః॥ అథ.1-21-1॥
భావం:- శుభప్రదాత, సర్వజన పరిపాలకుడు, వృత్రాసుర సంహారి, శత్రు నాశకుడు, సర్వజీవన శంకరుడు, అభీష్టప్రదాత, సోమరసపాయి అయిన ఇంద్రుడు అభయంకరుడై సంగ్రామాదులలో మా ముందుండి మమ్మురక్షిస్తూ నడిపిస్తాడు.
ఇక్కడ సంగ్రామాదులలో అన్న మాట కేవలం యుద్ధరంగాలలోనే కాదు జీవిత సంగ్రామాలలో కూడ రక్షకుడు ఇంద్రుడేనని భావం. ఈ విధంగా రక్షకునికొఱకై అనే్వషించే జీవుడు ఆ భగవంతుని శరణుజొచ్చి ‘్భరిత ఇంద్ర వీర్యం తవ స్మసి’ ప్రభూ! నీ బలం అపారం. మేము నీ వారమే అని ప్రార్థిస్తాడు. ప్రార్థించి ‘అస్య స్తోతు ర్మఘవన్ కామమా పృణ’ ‘ఓ దేవా! ఈ నీ స్తోతయగు భక్తుని కోరికను ఈడేర్చు’’మని విన్నవించుకొంటాడు. ఈ విధమైన భక్తుల విన్నపాన్ని ఋగ్వేదం మరో సందర్భంలో ఇలా వర్ణించింది.
వయమింద్ర త్వాయవో హవిష్మంతో జరామహే
ఉత త్వమస్మయుర్వసో॥ ఋ.3-41-7॥
ఓ ఇంద్రా! మేము నినే్నకోరి శ్రద్ధ్భాక్తులతో స్తుతిస్తున్నాం. ఓ వసూ! సర్వజన రక్షకా! మావలెనే నీవు కూడ మమ్ము అభిమానిస్తే నిజంగా మేమంతా నీవారమైపోతాం.
ఈ విధంగా శరణాగతుడైన భక్తుడు తన మదిలో కలిగిన అచంచల భక్తివిశ్వాసాలకు కారణమేదో ప్రస్తుత మంత్రంలోని ద్వితీయార్ధంలో ‘అను తే... ఓజసే’ ఈ ఊర్ధ్వ- అధోలోకాలన్ని నీ సృష్టి సామర్థ్య చిహ్నాలే. అవన్ని నీ ముందు తలవంచుతున్నాయి అని స్తుతిపూర్వకంగా ప్రకటించాడు. నీకు శరణాగతుడను కావడానికి నాకింతకు మంచి నిదర్శనమేమి కావాలి? ఓ ధనవతీ! మేము నీవంటి దాత కొరకే జీవిస్తూ ఉన్నాం. మమ్ముపేక్షింపకు. నిన్ను విడిచి మేమెక్కడకు పోగలం?
‘ఇంద్ర! తుభ్యమిన్మఘవన్నభూమ వయం దాత్రే హరివో మా వి వేనః’ (ఋ.6-44-10)
అని అనన్య శరణాగతి చేసిన భక్తుడు సదా ఇలా ప్రార్థిస్తున్నాడు. ‘న త్వదన్యో మఘవన్నస్తి మర్దితేంద్ర బ్రవీమి తే వచః’ (ఋ.1-84-19) ఓ ధనపతీ! నీకంటె మించిన సుఖప్రదాత - తృప్తివిధాత మరొకడు లేడు. కాన ఇక నీవుకాక నాకు మరెవ్వడు రక్షకుడున్నాడు?

- ఇంకావుంది