స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-127

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
గృహస్థాశ్రమ జీవితం సుఖమయంగా సాగేందుకవసరమైన సాధన సంపత్తి వివరింపబడింది.
రై:- ధనం. గార్హస్థ్యజీవితం శాస్ర్తియంగా, సుఖమయంగా గడిచేందుకు పుష్కలమైన ధనసంపత్తి అవసరం.
ఇట్:- అన్నం, ధనార్జన లక్ష్యం జీవించేందుకు ప్రధానమైన అన్న సంపాదనమే కదా. కాబట్టి ధనం తరువాత అన్నం అత్యంతావశ్యకమైనది.
వాజ:- బలం. బలం అన్నంనుండి జీవులకు లభిస్తూంది. ‘అన్నం వై ప్రాణినాం ప్రాణః’- ‘‘జీవులకన్నమే ప్రాణం’’అన్న వచనానుసారం జీవులన్ని అన్నంతోనే ప్రాణవంతమై జీవిస్తూ బలం కలిగియుంటున్నాయి. వేదమిచ్చట బలమన్న పదాన్నికాక వాజ శబ్దాన్ని విశేషార్థంలో ప్రయోగించింది. అదేమంటే గమన సాధకమైన బలమూ మరియు జ్ఞానమూ అనికూడ విశేషార్థాలు కలిగిందాపదం. రై (రాయా) ఇట్ (ఇషా) పదాలు ఏక వచనంలో ప్రయోగింపబడినచోట వాజశబ్దం బహువచనాంతంగా మాత్రమే (వాజేభిః) ప్రయోగింపబడుతుంది. (ఇది వ్యాకరణ నియమం) దీని ప్రకారం వాజశబ్దానికనేక బలార్థకాల నిచట గ్రహించాలి. వీనిలో శారీరక, మానసిక, ఇంద్రియ, హృదయ, బుద్ధి, ఆత్మ, ఆధ్యాత్మ, జ్ఞాన, ధ్యాన, కర్మ, ధర్మ, రాజ్య, సమాజ, రాష్ట్ర, బలాదులెన్నో ఇందులోనికి వస్తాయి. ఇలాంటి బలాలు లేనివాడు గృహస్థాశ్రమ ధర్మాలను నిర్వహింపలేడు.
పురుఃచంద్ర ద్యుః:- అత్యంత సంతోషదాయకమైన కీర్తి సంపద. గృహస్థుకు కీర్తిసంపద అభిలషణీయం. ఇది సంతోషదాయకమైనదంటే సత్కీర్తిప్రదమైనదని అర్థం.
ప్రమతిః:- ఉత్తమ బుద్ధి. గృహస్థాశ్రమ ధర్మనిర్వహణ జరుగవలసినది ఉత్తమ బుద్ధితోడనే.
వీరశుష్మా:- బలయుతులైన సంతానం కలిగియుండుట. సంసారులు తమ సంతాన మావిధంగా ఉండేందుకు సుజ్ఞానంతో తీర్చిదిద్దుకోవాలి.
గో అగ్రా:- గృహస్థులు నిర్వహించే యజ్ఞయాగాది క్రతువులకు, ఆహారానికి గోసంపద అత్యంతావశ్యకం.
అశ్వావతీ:- ప్రయాణాల నిమిత్తం- భారవాహనానికి గృహస్థులకు అశ్వసంపద ముఖ్యం.
దేవీ:- గృహస్థుడుప్రమతీదేవీ= సద్ణువంతుడు, దివ్యస్వభావం కలవాడు కావాలి. రాక్షస స్వభావం కలవాడు గృహస్థుడుగా సఫలుడు కాలేడు.
ప్రధానమైన ఈ వస్తు, గుణ, స్వభావాలు లేకుండా గార్హస్థ్య జీవితం ఆరంభమే కాదు. ఆరంభమైనా సఫలం కాదు.
పరమేశ్వరుడు తేజస్సంపన్నుడు
త్వమస్య పారే రజసో వ్యోమనః స్వభూత్యోజా అవసే ధృషన్మన?
చకృషే భూమిం ప్రతిమాన మోజసో- పః స్వః పరిభూరేష్యా దివమ్‌॥
ఋ.1-52-12॥
భావం:- సర్వజీవుల మనస్సును జయించిన ఓ దేవాధిదేవా! నీవు ఈ లోకాలు మరియు ఆకాశానికి కూడ ఆవలవైపున సర్వశక్తియుతమైన ఓజస్సుతో స్వకార్యనిర్వహణలో ఇతరుల సహాయ సహకారాలు అవసరం లేనివాడవై చరాచర జగద్రక్షణను నిర్వహిస్తున్నావు. నీ శక్తి సామర్థ్యాలు అనుమాన ప్రమాణంచేత తెలిసే విధంగా ఈ భూమండలాన్ని సృష్టించావు. సమస్త జలాలలో, అంతరిక్షంలో, ప్రకాశమయమైన ఆకాశంలో సర్వవ్యాపకుడవై విరాజిల్లుచున్నావు.
వివరణ:- భగవచ్ఛక్తి ఎంత అపారమైనదో ఈ మంత్రంలోని ‘ఘృషన్మనః’ అన్న పదం తెలుపుతూంది. మానవుని మనస్సు చాల బలవత్తరమైనది మరియు ‘వాత ఇవ ధ్రజీమాన్’-(ఋ.1-79-1) వాయువువలె చాల వేగవంతమైనది. కాని భగవానుడో! మనిషి మనస్సుకంటె మహాబలవంతుడు. ఆయనముందు మనిషి మనస్సు పరాజితమైపోతుంది. అందుకే వేదమిచ్చట పరమాత్మను ‘ఘృషన్మనః’అని పేర్కొంది. ఆ స్వయంభువుని మహత్వాన్ని-
పాదో- స్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి (శు.య.వే.31-2)
అని వర్ణించిన శుక్లయజుర్వేద వచనానుసారం సమస్త బ్రహ్మాండ మండలమంతా సర్వభూతాంతరాత్ముడైన భగవానునిలోని నాలుగింట ఏకైకమైన అంశం మాత్రమే. తక్కినదంతా స్వప్రకాశుడైన ఆయనయందే గుప్తంగా ఉంది. దీనినిబట్టి ఈ సమస్త బ్రహ్మాండానికావల కూడ ఆ పరబ్రహ్మమే సుస్థిరమైయుందని స్పష్టపడుతూ ఉంది. అక్కడ ఒక్కడుగానున్న ఆయనకు సంరక్షకులెవరు?? అన్న కొంటె ప్రశ్న ఎవరూ అడగకుండ వేదం-
‘త్వమస్య పారే..... అవసే’ ‘‘ఈ బ్రహ్మాండాలకావల ఒక్కడవై యుండి కూడ నీవే అందరకు రక్షకుడవు’’అని అపార భగవచ్ఛక్తిని కీర్తించింది. ఎలాగు? అన్నదానికి కూడ వేదం ‘స్వభూత్యోజాః’ ‘‘స్వకార్య నిర్వహణలో నిరపేక్షకుడు’’ అంది.
ఇంకావుంది...