స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-126

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
మనువు ఈ క్రింది విధంగా పేర్కొన్నాడు.
అకామస్య క్రియా కాచిత్ దృశ్యతే నేహ కర్హిచిత్‌
యద్యద్ధి కురుతే కించిత్తత్తత్కామస్య చేష్టితమ్‌॥ మనుస్మృతి 2-4॥
భావం:- నిష్కాముడు చేసిన పని లోకంలో ఎక్కడ కనబడదు. లోకంలో ఎక్కడ ఏ పని కనబడినా అది కోరిక చేత చేయబడింది.
గృహస్థాశ్రమాభిలాషి ముఖ్యంగా పవిత్రుడై యుండాలి. అపవిత్రుడు, దురాచారి అయినవాడికి గృహస్థాశ్రమ స్వీకార అధికారంలేదు. దీనినే మనువు ‘అధార్యోదుర్బ-లేంద్రియైః’ (మనుస్మృతి 3-79) దుర్బలేంద్రియులకు గృహస్థాశ్రమ గ్రహణాధికారం లేదని మరియు ‘అవిప్లుత బ్రహ్మచర్యో గృహస్థాశ్రమమావసేత్’ (మనుస్మృతి 3-2) అస్ఖలిత- బ్రహ్మచర్యనిష్ఠుడైనవాడే గార్హస్థ్య ధర్మాన్ని స్వీకరింప యోగ్యుడని నొక్కివక్కాణించాడు.
అంతేగాక గృహస్థుడు పుష్కలమైన ధనం కలిగియుండాలి. మరియు నిత్య దాతయై కూడ ఉండాలి అని మను వీవిధంగా ఆదేశించాడు.
యస్మాత్ త్రయో- ప్యాశమిణో దానేనానే్నన చాన్వహమ్‌
గృహస్థేనైవ ధార్యంతే తస్మాత్ జ్యేష్ఠాశ్రమో గృహీ॥ మనుస్మృతి 3-78॥
గృహస్థుడు బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్న్యాసాశ్రమస్థులకు నిత్యాన్న ప్రదానంచేస్తూ వారి అవసరాలకు ధనాన్ని కూడ దానంచేస్తూ, వారిని పోషించాలి కాబట్టి గృహస్థాశ్రమవాసి చాల ఉన్నతుడు. బ్రహ్మచారి, వానప్రస్థ, సన్న్యాసి ఈ మూడాశ్రమవాసులు గృహస్థాశ్రమంనుండి వచ్చినవారే.
ఈ కారణంచేత కూడ గృహస్థాశ్రమం చాల ఉన్నతమైనది. ఈ విషయ బాహుళ్యాన్ని ప్రస్తుత వేదమంత్రం ‘వసుర్మానుషేషు వరేణ్యో హోతా ధాయి విక్షు’ ‘‘ఆశ్రయ మిచ్చేవాడు శ్రేష్ఠుడైన దాత జనులలో శ్రేష్ఠుడిగా పరిగణింపబడుచున్నాడు’’అని వివరించింది. గృహస్థుడు ప్రధానంగా జితేంద్రియుడు కావలసియుంది. కాని లోకంలో చాలామంది గృహస్థుడు కాగానే బ్రహ్మచర్య నిష్ఠను పాటించనవసరం లేదని భావిస్తూ ఉంటారు. మైథునం మీద అత్యంతాసక్తిచేత మనిషి నష్టవీర్యుడు బలహీనేంద్రియం గలవాడవుతాడు. ఇట్టివారు గృహస్థాశ్రమ ధర్మాన్ని సక్రమంగా నిర్వహించలేరు అంటూ మనువు విపులంగా ఇలా వివరించాడు.
స సంధ్యార్యః ప్రయత్నేన స్వర్గమక్షయమిచ్ఛతా సుఖం చేహేచ్ఛతా నిత్యం యో- ధార్యో దుర్బలేంద్రియైః॥ మనుస్మృతి 3=79॥
భావం:- దుర్బలేంద్రియులు గార్హస్థ్య ధర్మాన్ని సక్రమంగా నిర్వహించలేరు. గావున నిత్యసుఖాన్ని- దాంపత్య సుఖాన్ని కోరుకొనేవారు గృహస్థాశ్రమ ధర్మాలను మిక్కిలి శ్రద్ధతో పాటించాలి.
గార్హస్థ్యాశ్రమం ఒక చిన్నపాటి సామ్రాజ్యం వంటిది. దానిని పాటించేందుకు ముఖ్యంగా శక్తి అవసరం. ఈ శక్తి బ్రహ్మచర్యమూ, ఇంద్రియ నిగ్రహం వలన సిద్ధిస్తుంది. అందుచేత ఈ ప్రతిమనిషి ఈ క్రింది విధంగా నడుచుకోవాలని మనువు వివరించాడు.
ఋతు కాలాభిగామీ స్యాత్ స్వదారనిరతః సదా॥ మనుస్మృతి 3-45,
బ్రహ్మచార్యేవ భవతి యత్ర తత్రాశ్రమే వసన్‌॥ మనుస్మృతి 3-59
భావం:- పరస్ర్తిల ఎడల ఆసక్తుడుకాక కేవలం ఋతుమతియైన స్వభార్యను మాత్రమే సంగమించే పురుషుడు ఎక్కడున్నా, ఎలావున్నా బ్రహ్మచారియే కాగలడు.
అటువంటి జితేంద్రియుడైన గృహస్థుడు నిజంగా ‘్భవద్రయి పతీ రరుూణామ్’ ధనవంతులలో ధనవంతుడే. బ్రహ్మచర్యంతో సమానమైన ధనమెక్కడా మరేదీ లేదు. భువద్రయిపతీ...అన్న వాక్యాన్ని పరిశీలిస్తే దరిద్రుడికి వివాహమాడే అధికారమే లేదన్న మరో అర్థం స్ఫురిస్తూంది. అది నిజమే కావచ్చు. ఎందుకంటే కుటుంబాన్ని బ్రహ్మచారీత్యాది ఆశ్రమవాసుల్ని, అతిథి అభ్యాగతులను పోషించగలిగినంత ధనసంపత్తి లేనివాడు అత్యధిక ధన వ్యయమయ్యే గార్హస్థ్యాశ్రమాన్ని ఎలా నిర్వహించగలడు? వివాహ సమయంలో వరుడు వధువును పాణిగ్రహణం చేసి ‘మమేయమస్తు పోష్యా’(అథర్వణవేదం 14-1-52) నీ రక్షణ, పోషణ భారాలను నేనే వహిస్తాను అని ప్రతిజ్ఞచేస్తాడు. దరిద్రుడు ఈ విధంగా మాటలాడితే పరిహాసాస్పదమే కదా.
సమింద్ర రాయా సమిషా రభేమసి సం వాజేభిః పురుశ్చంద్రైరభిద్యుభిః
సం దేవ్యా ప్రమత్యా వీరశుష్మయా గోఅగ్రయావ్వావత్యా రభేమహి॥ ఋ.1-53-5॥
భావం:- ఓ పరమేశ్వర! మేము పుష్కలమైన ధనమూ, అన్నమూ, బుద్ధిబలాదులూ, కీర్తి, సంపద, జ్ఞాన- బలసంపన్నమైన సంతానమూ, గో-అశ్వాది పశుసమృద్ధి కలిగి సద్బుద్ధితో గృహస్థ జీవితాన్ని ఆరంభిస్తాం.

ఇంకావుంది...