స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-132

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోమరసపాన ఫలం
ఇమే సోమాస ఇందవః సుతాసో అధి బర్హిషి
తా ఇంద్ర సహసే పిబ॥ ఋ.1-16-6॥
భావం:- ఓ ఇంద్రా! ఆనందదాయకమైన సోమరసాన్ని దర్భాసనం మీద కూర్చుని పిండి ఉంచుతారు. దానిని బలంకోసం త్రాగుము.
వివరణ:- సోమ మన్నది ఒక ఓషధీలత. దీనిని సేవించడంవలస శరీరం కాయకల్పమై పోతుందని సుశ్రుతమనే ఆయుర్వేద గ్రంథంలో వ్రాయబడింది. వృద్ధత్వంపోయి వనశక్తి శరీరంలో ఏర్పడటవే కాయకల్ప చికిత్సకు అర్థం. వేదంలో ఈ సోమలత కాక మరో సోమలత చర్చ కనబడుతుంది. దీనిని గురించి వేదంలో-
సోమం యం బ్రహ్మాణో విదుర్న తస్యాస్నాతి కశ్చన (ఋ.10-85-3) ‘బ్రాహ్మణులకు తెలిసిన సోమలతను సామాన్యులెవరూ రుచి చూడలేదు’ అని దాని అలభ్యతను పేర్కొని-
అపాను సోమ మమృతా అభూమ (ఋ.8-48-3)
‘‘మేము సోమలతాపానంచేసి అమరులపై పునర్జీవితులమయ్యాము’’ అని దాని మహిమను శ్లాఘించింది. సామాన్య జనులెవరూ కూడ ఈ సోమలతా రసాన్ని పానం చేయజాలరు.
‘న తే అశ్నాతి పార్థివః’ (ఋ.10-85-4) అని ఋగ్వేదం వచిస్తూంది. సోమలత ఒక ఓషధి అని పైన పేర్కొనబడింది గదా. దానిని వేదంలో చర్చ చేయబడింది.
సోమం మన్యతే పసివాన్ యత్సంపిషన్‌త్యోషధిమ్ (ఋ.10-85-3) సోమలతౌషధిని బాగాకొట్టి దంచి పానయోగ్యంగా తయారుచేస్తారు.
ఈ మంత్రంలో రెండురకాల సోమలతాపానం గురించిన ఆదేశమీయబడింది.
ఓషధి రూపమైన సోమలత బహిరంగంగా ఆసనంమీద ముఖ్యంగా దర్భాసనం మీద కూర్చుని కొట్టి, దంచి, వస్తక్ష్రాళితం చేయబడుతుంది. ఇది మొదటి సోమలత విషయం. ఇక రెండవ సోమలత ఆధ్యాత్మికమైనది. అది విప్రుల హృదయాలలో మాత్రమే దంచి వస్తక్ష్రాళితం చేయబడుతుంది. శుశ్రుత గ్రంథంలో వివరింపబడిన సోమలతా రసం చాల శ్రమపూర్వకంగా తయారుచేయబడుతుందని అర్థమవుతుంది. ఇక బ్రాహ్మణులకు మాత్రమే తెలిసిన సోమలత చాల దుస్సాధ్యమైనదని వేదమే (ఋ.10-85-3) వివరించింది. దీనిని వైద్యగ్రంథంలో చెప్పబడిన సోమలతా రసంవలె సామాన్యులు మాత్రం పానం చేయలేరు.
శుశ్రుత గ్రంథం 29వ అధ్యాయంలో సోమలత 24విధాలుగా చెప్పబడింది. అదే విధంగా జీవుని శక్తికూడ 24 విధాలుగా ఉంటుంది. చూడండి.
1. బలం. 2.పరాక్రమం. 3.ఆకర్షణ. 4.ప్రేరణ. 5.గతి. 6.్భషణ. 7.వివేచన. 8.క్రియ. 9.ఉత్సాసం 10.స్మరణం. 11.నిశ్చయం. 12.ఇచ్ఛ. 13. ప్రేమ. 14. ద్వేషం. 15. సంయోగం. 16. వియోగం. 17. సంయోజకం. 18. విభాజకం. 19. శ్రవణం. 20. స్పర్శనం. 21. దర్శనం. 22. స్వాదన. 23. గంధగ్రహణ. 24. జ్ఞానం. ఈ ఇరవై నాలుగు శక్తులు కలవాడు సామర్థ్యంగల జీవుడు. వీని వలననే ముక్తస్థితిలోని ఆనందాన్ని అనుభవించగల సామర్థ్యం సిద్ధిస్తుంది.
లోకంలోని సర్వ పదార్థాలు వేద పరిభాషలో సోమశబ్దవాచకాలే. సుఖప్రదాయకమైన సోమా న్ని ఈ లోకంలో సిద్ధంచేసానని భగవానుడే చెప్పాడు. ఆనంద సంపన్నుడైన విశ్వవిభుడు లోకంలో దుఃఖదాయకమైన పదార్థాలనేల తయారుచేస్తాడు? చేయలేడు. కాబట్టి నీవు ‘తాన్ ఇంద్ర సహసే పిబ’ వానిని బలంకోసం త్రాగు. వృద్ధుణ్ణి యువకునిగా చేసే ఆ సోమలతా పానీయం నిశ్చయంగా బలదాయకమే.
**
వేదాధ్యయనానంతరం
సంసారసుఖాన్ని పొందు
అయం తే స్తోమో అగ్రియో హృదిస్పృగస్తు శంతమః
అథా సోమం సుతం పిబ॥ ఋ.1-16-7॥
భావం:- జ్ఞానానికి ప్రప్రథమైనది భగవత్ సన్నుతి రూపపైన వేద విజ్ఞానం. అది నీ హృదయాన్ని తాకుతూ నీకు అత్యంత శాంతిప్రదాయక మగుగాక! ఆ విధంగా నీవు పొందిన వేద విజ్ఞానం చేత ముందుగానే నీకు సిద్ధమైన సంసార సంబంధైశ్వర్యాన్ని తనివితీరా అనుభవించు.
వివరణ:- ప్రపంచ సాహిత్య చరిత్రలోనే వేదం మొట్టమొదటి గ్రంథమని నిష్పక్షపాతంగా పండితులందరూ అంగీకరిస్తున్నారు. అందుకే వేదాన్ని ప్రప్రథమ విజ్ఞాన గ్రంథమని చెబుతున్నారు. భగవంతునినుండి మానవ లోకానికి మొదటగా లభించిన విజ్ఞానమే వేదం. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు