స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-134

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ మనిషీ! నా మాట విను
ఆశ్రుత్కర్ణ శ్రుధీ హవం నూ చిద్ద్ధిష్వ మే గిరః
ఇంద్ర స్తోమ మిమం మమ కృష్వా యుజశ్చిదంతరమ్‌॥ ఋ.1-10-9॥
భావం:- అన్నివైపులనుండి అన్నింటిని వినగల ఓ నరుడా! నా ఉపదేశాన్ని విను. నా మాటలను తప్పక ఆచరణలో పెట్టు. జ్ఞాన సంపన్నుడవైన ఓ మానవుడా! నా రుూ జ్ఞానోపదేశాన్ని శ్రద్ధ్భాక్తులతో నీవు మనస్ఫూర్తిగా స్వీకరించు.
వివరణ:- ప్రపంచంలోనికి వచ్చిన ప్రతి జీవి ప్రమత్తుడై దైవాన్ని మరచిపోతాడు. మోహజనకమైన వస్తుజాలాన్ని చూచి మనిషి తననుతానే మరచిపోతాడు. నానా కష్టాలననుభవిస్తూ ఉంటాడు. మనిషి ఎంతగా సంసార విషయాలపై ఆసక్తుడై మైమరచిపోతాడంటే హృదయంలో ఉండి అహరహమూ వినిపించే భగవానుని సదుపదేశాన్ని కూడ విననే వినడు.
విన్నా విననట్లుగా ఆ ప్రబోధాన్ని పెడచెవిని పెడతాడు. అట్టి మానవ లోకాన్ని సావధానపరుస్తూ దైవం ‘ఆశ్రుత్కర్ణ శ్రుధీహవమ్’ అన్ని వైపులనుండి శబ్దాలను వినగల ఓ మానవుడా! ‘‘నా మాట విను’’అని ప్రేమ పూర్వకంగా దగ్గరకు పిలుస్తూంది. భగవంతుని సృష్టిరచన చాల విచిత్రమైనది. కళ్లు ఎదురుగా ఉన్న వస్తువులను మాత్రమే చూడగలవు. కాని చెవులో!! అన్ని వైపులనుండి వినవచ్చే శబ్దాలను స్పష్టంగా వినగలవు. అందుకే దైవం మానవుణ్ణి ‘ఆశ్రుత్కర్ణ’అని వ్యవహరించింది. అలా సంబోధించి అంతటితో తృప్తిపడలేదు పరమాత్మ. ‘నూ చిత్ దధిష్వ మే గిరః’ చెప్పిన నా మాటలను కూడ ఆచరణలో పెట్టు. మరువకు అంటూ లాలనగా ప్రబోధించాడు. అంటే ఆచరణకు ముందుగా వేద వచనాలను శ్రద్ధగా వినాలి. మనసులో వానిని గూర్చి చింతన చేయాలి అని తెలిపే ఈ వేదోపదేశానే్న పలు సందర్భాలలో పునరుక్తిగా ఋషులు చెప్పిన ఈ విషయాన్ని చూడండి.
శ్రోతవ్యః శ్రుతివాక్యేభ్యో మంతవ్యశ్చోపపత్త్భిః
మత్వ వై సతతం ధ్యేయ ఏ తే దర్శనహేతవః॥
‘‘శ్రుతి వాక్యాల ద్వారా తత్త్వవిచారణ చేయాలి. తార్కిక బుద్ధితో సహేతుకంగా మనస్సులో విచారణ చేయాలి. విచారణ తరువాత విన్న విషయాలను తరచుగా స్మరించాలి. భగవత్తత్త్వ దర్శనానికిదే సాధనం.’’
ఆ సర్వేశ్వరుడే స్వయంగా ధర్మాచరణను గూర్చి ‘ఇంద్ర స్తోమ మిమం మమ కృష్వా యుజశ్చిదంతరమ్’ అజ్ఞానాన్ని తొలగించుకొన కోరిక గలవాడా! నా ఉపదేశాన్ని సావధానమైన యోగసమాధి ద్వారా హృదయగతం చేసికొని ఆత్మగతం చేసుకో’’అని ఉపాయాన్ని గూడ నిర్దేశించాడు. ఆత్మగతం చేసుకోమంటె- కల్యాణాత్మకమైన తన ఉపదేశాన్ని ఏదో చర్చలకో వాదాలకో పరిమితం చేయకుండా నిత్యజీవితంలో వస్త్రంలోని పడుగు పేకల దారాల్లా అల్లుకుపోవాలని భావం. అంతేకాక వేదోపదేశం మనిషికి కరతలామలకమై సులభంగా అవగాహనకు రావాలంటే కేవలం ఒక యోగ సమాధి మాత్రమే తరుణోపాయమని విశ్వవిభుడే రుూ మంత్రం ద్వారా సూచించాడు. ఎందుకు? గహనమైన తాత్త్విక విషయం ఆత్మగతం కావాలంటె యోగసమాధి తప్ప మరొక సమర్థవంతమైన ఉత్తమ సాధనం లేదు కాబట్టి.
మానవుని జీవిత అంతిమ మరియు వాస్తవిక లక్ష్యాన్ని పొందింపచేసే సాధనాలను మరల మరల బోధించే విషయంలో వేదమెప్పుడూ అలసిపోదు. తల్లి తన సంతానానికి మేలు కలిగించే మాటలు చెప్పడానికి ఎప్పుడూ అలసిపోదు కదా. అందుకే వేదం మాతగా వ్యవహరింపబడింది.
***
ఆత్మా! నీవు ప్రాణాలకు ఋషివి
త్య్రర్యమా మనుషో దేవతాతా త్రీ రోచనా దివ్యా ధారయంత
అర్చంతి త్వా మరుతః పూతదక్షాస్త్వమేషామృషిరింద్రాసి ధీరః

భావం:- ఓ ఇంద్రా! మనిషి దివ్యగుణాలను పొందేందుకు శ్రవణ, మనన, నిదిధ్యాసనం అనే కార్యాలలో ధర్మమార్గాన్ని లేదా ధర్మస్వరూపుడైన దైవాన్ని అనుసరిస్తాడు. దానివలన ఆ మానవుడు మనఃప్రకాశం, ఆత్మప్రకాశం మరియు పరమాత్మ ప్రకాశం అనే మహత్తరమైన జ్ఞానప్రకాశాన్ని పొందుతాడు. పవిత్రీకరించే ప్రాణాలు నిన్ను పూజిస్తాయి. అత్యంత ధ్యాన తత్పరుడవైన నీవు ఋషివయితివి.
వివరణ:- పరమాత్మ పరమ కల్యాణగుణధాముడు. మానవుడు సద్గుణ సంపన్నుడు కావాలని కోరుకొంటే- ‘త్య్రర్యమా మనుషో... ధారయంత’ శ్రవణం, మననం, నిదిధ్యాసనం (మననం వలన ఆత్మను తెలిసికొన్న పిమ్మట కలిగెడు అవిచ్ఛిన్నమైన ధ్యానం) ఈ మూడు పద్ధతుల ద్వారా అర్యమా= ధర్మస్వరూపుడైన భగవానుని ఆదర్శంగా గ్రహించాలి.

ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు