స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-135

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని కోరుకొనేవాడు ముందుగా తనకు తానై తన జీవిత వ్యవహార సరళిని పరిశుద్ధం చేసుకోవాలని భావం. భగవద్గీత (6-17) ‘యుక్తాహార విహారస్య...యోగో భవతి దుఃఖహో’ ‘‘యుక్తియుక్తమైన ఆహార విహారాలు కలవానికే యోగం దుఃఖ నాశనకారకమవుతుంది’’అని ఈ విషయానే్న సమర్థించింది.
అందుచేత మనిషి తన జీవన వ్యవహారాన్ని ధర్మయుక్తంగా చేసికోవడం చాలా ముఖ్యం. అందుకొరకై యోగీశ్వరులు ముందుగా యమ, నియమ ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే అష్టాంగాలను ఆచరించాలని ఉపదేశించారు. ఎవరు అష్టాంగయోగ పద్ధతుల ద్వారా జీవన విధానాన్ని పరిశుద్ధం చేసుకొని శ్రవణ, మనన, నిదిధ్యాసనం చేస్తారో వారు ‘త్రీ రోచనా దివ్యాధారయంత’ మూడు దివ్యజ్ఞానాలను పొందుతారు. అవి ‘మనోజ్ఞానం, ఆత్మజ్ఞానం మరియు పరమాత్మజ్ఞానం’. ఈ మూడింటిని పొందిన జీవాత్మ పరమ పూజ్యమవుతుంది. ఎందుకంటే జ్ఞానాన్ని అందరూ పూజిస్తారు. కాబట్టి అట్టి జీవునుద్దేశించి భగవానుడు ఓ ఇంద్రా! (జీవా) నీవు ఆరాధనీయుడవయ్యావు. అందుచేత ‘అర్చంతి త్వ మరుతః పూతదక్షాః’ పవిత్ర కర్మకలాపకమైన ప్రాణాలు నిన్ను అర్చిస్తాయి అని శుభాశంసన చేసాడు. జీవులందరను పవిత్రంగాచేసే ప్రాణాల వ్యవహారం చాల మహోన్నతమైనది మరియు పవిత్రమైనది. అది ఎలాగో మనువు ఈ క్రింది విధంగా వివరిస్తున్నాడు.
దహ్యంతే ధ్మాయమానానాం ధాతూనాం హి యథా మలాః
తథేంద్రియాణాం దహ్యంతే దోషాః ప్రాణస్య నిగ్రహాత్‌॥ (మనుస్మృతి. 6-71)
‘‘సర్వాది లోహాలను మూసయందుంచి అగ్నితప్తం చేస్తే వాటిలోని మురికి ఎట్లు తొలగిపోతుందో అట్లే ప్రాణాయామంవలన మనస్సు మొ.ఇంద్రియ దోషాలన్నీ తొలగిపోతాయి. దయానంద మహర్షి ఈ విషయాన్ని మరింతగ వివరిస్తూ ఇలా వ్రాసారు.
‘‘మనిషి ప్రాణాయామ మెప్పుడారంభించి చేస్తాడో అప్పటినుండి ప్రతిక్షణమూ ఇంద్రియగతమైన మాలిన్యం తొలగి జ్ఞాన ప్రకాశం చేత ప్రకాశిస్తాడు. అంతేకాదు ముక్తస్థితికి చేరేవరకు ఆతడి జ్ఞానం వృద్ధి పొందుతూనే ఉంటుంది.’’
సత్యర్థ ప్రకాశం- 3వ సముల్లాసం
ప్రాణాయామం ద్వారా ప్రాణాలు వశమైనంతనే ఇంద్రియాలు స్వాధీనంలోనికి వస్తాయి. ప్రాణశక్తి పెరిగినంతనే బుద్ధిబలం పెరిగి కుశలతను వహిస్తుంది. దానివలన ఎంత కఠినమైన లేదా సూక్ష్మమైన విషయాన్ని అయినా శీఘ్రంగా గ్రహించగల కౌశల్యం సిద్ధిస్తుంది. అంతేగాక ప్రాణశక్తి వృద్ధి పొందటంవలన మనిషి శరీరంలో వీర్యవృద్ధి కలిగి స్థిరమైన బల-పరాక్రమాలు, జితేంద్రియత అనతికాలంలోనే సర్వ శాస్త్ర గ్రహణ పారీణత ప్రాప్తిస్తాయి.
సత్యార్థ ప్రకాశం- 3వ సముల్లాసం
‘పూత దక్షా స్త్వమేషా మర్చంతి’ ‘‘పవిత్రమైన (ప్రాణాయామం ద్వారా) ప్రాణాలు ఇంద్ర= జీవుణ్ణి అర్చంతి= పూజిస్తాయి.’’ ఈ విధంగా చెప్పడంవలన తాను పవిత్రుడు కానివాడు ఎవరిని పూజింపరాదు. ఆ విధంగా పవిత్రమైన ప్రాణాలు జీవుణ్ణి ఆరాధిస్తున్నాయన్న సూచన కూడ ఈ మంత్ర ప్రస్తావనవలన స్పష్టపడుతుంది.
ఓ ఆత్మా! నీ మహత్వం మరొకటి కూడ ఉంది. ‘త్వమేషామృషిరింద్రాసి ధీరః’ నీవు ప్రాణాయామం ద్వారా ధ్యానతత్పరుడవైనంతనే ఇంద్రియాలకు ఋషివిగా అగుచున్నావు. ఆత్మ లేకుంటే ప్రాణాల సంచారమే ఆగిపోతుంది. ఆత్మశరీరంలో ఉన్నంతవరకే ప్రాణసంచారం జరుగుతుంది. రాణి తేనెటీగను కూలి తేనెటీగలు అనుసరించి వెళ్లేవిధంగా ప్రాణాలు ఆత్మను వెన్నంటియే సంచరిస్తాయి. సామాన్య జనులకు ప్రాణాల రాకపోకల గురించి ఎట్టి జ్ఞానమూ ఉండదు. కాని ధ్యాన తత్పరుడికి మాత్రం ప్రాణసంచార జ్ఞానమేకాదు. వాటి క్షణ క్షణ క్రియా- వ్యవహార జ్ఞానం హస్తామలకమై (చేతిలో ఉసిరిలా) ప్రత్యక్షంగా ఉంటుంది. కాబట్టి అందరు దీనిని గుర్తుపెట్టుకోవలసి యుంది.
**
నినె్నలా పూజించను?

కథో ను తే పరి చరాణి విద్వాన్వీర్యా మఘువన్యా చకర్థ
యా చో ను నవ్యా కృణవః శవిష్ఠ ప్రేదు తా తే విదథేషు బ్రవామ ॥

భావం:- ఓ దేవా! విద్వాంసుడు నీకొఱకై ఏ ఘనకార్యాలను చేసాడో- ఏ నూతన విషయాలనావిష్కరించాడో వానిని మేము మా జీవితమంతా స్తుతిస్తాము
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు