స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-138

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాణ- అపానాలు లేదా జ్ఞాన-కర్మలు అనే రెండు గుఱ్ఱాలచేత నడుపబడుతున్న ఆత్మను చూచినవాడెవడు? లోకంలో అట్టి వీరుడున్నాడా? సిద్ధమైన - సిద్ధంచేయబడిన ప్రసిద్ధమైన ఐశ్వర్యాన్ని కోరుతూ వజ్రబల సంపన్నమైన ఆత్మప్రీతిపూర్వకంగా సంరక్షణాభావంతో శరీరమనే గృహానికి వెళ్లుతున్నది?
వివరణ:- ప్రపంచంలో ‘నేను- నేను’అని అందరూ అంటారు. మరి ఆ ‘నేను’ను ఎందరు చూసారు? ఇదే ఈ వేదమంత్రంలోని సూటి ప్రశ్న ‘క్వస్య వీరః’ ఆ వీరుడెక్కడ? ‘కఃఅపశ్యదింద్రమ్’ ఆత్మనెవడు చూసాడు? వాస్తవానికి ఆత్మదర్శనం చాల దుర్లభం. అట్టి ఆత్మబాహ్యస్వరూపాన్ని గురించి ఈ మంత్రం సంక్షిప్తంగా ప్రతిబింబింప చేసింది. అది ‘ఆత్మ’ ఎట్లయింది? దీనికి సమాధానంగా ఈ మంత్రం ‘సుఖరథమీయమానం హరిభ్యామ్’ దేనిసుఖంకోసం ఈ శరీరం పొందబడిందో, ఏది రెండు గుఱ్ఱాల (జ్ఞాన- కర్మలు)తో కూడి వస్తూ-పోతూ ఉంటుందో అది ఆత్మ అని నిర్వచించింది. ఈ రెండు గుఱ్ఱాలను గురించి వివరణ కఠోపనిషత్తులో మరింత విస్తృతంగా ఇలా వివరించబడింది.
‘ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ తు
బుద్ధిం తు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవ చ॥
ఇంద్రియాణి హయాన్యాహు ర్విషయాంస్తేషు గోచరాన్‌
ఆత్మేంద్రియమనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః॥ కఠోపనిషత్తు. 3-3-4
భావం:- శరీరం రథం. బుద్ధిసారథి. మనస్సే కళ్ళెం. ఆత్మ రథారూఢుడైన రథి (యజమాని). ఇంద్రియాలు గుఱ్ఱాలు. లౌకిక విషయాలే అవి పరుగులుతీసే మార్గాలు. శరీరమూ, ఇంద్రియాలూ, మనస్సుతో కూడిన ఆత్మభోక్త (సర్వాన్ని అనుభవించేది)అని ప్రాజ్ఞులు చెబుతారు.
ఉపనిషత్తు చెప్పిన రథి- రథ శబ్దాలకంటె ఈ మంత్రంలోని ‘‘సుఖరథ’’ శబ్దం చాల స్పష్టమైనది. శరీర ప్రధాన ప్రయోజనమేమిటో ఆ ‘సుఖరథ’ శబ్దం స్పష్టం చేస్తూంది. ఇట్లే ఆత్మ ఎందుకు శరీరాన్ని ధరిస్తున్నదో బాగా విపులీకరిస్తూ- ‘సుత సోమ మిచ్ఛన్ తదోకో గంతా’సిద్ధింప చేయబడ్డ ఐశ్వర్యాన్ని కోరుతూ ఆ శరీర గృహానికిపోతూ ఉంది అన్న వాక్యంద్వారా రుూ మంత్రం వివరించింది. ప్రస్తుత మంత్రానికి తదుపరి మంత్రమైన-
అవాచచక్షం పదమస్య సస్వరుగ్రం నిధాతురన్వాయ మిచ్ఛన్‌
అపృచ్ఛమన్యా ఉత తే మ ఆహురింద్రం న రో బుబుధానా అశేమ॥
అన్న దీనిలో మరింత వివరణ కనబడుతుంది.
భావం:- నేను ఈ శరీరధారి రహస్యమయిన, ఉగ్రమైన ఆత్మస్థానాన్ని మాటిమాటికి చూచాను. నేనాజ్ఞానంతో శోధించి, సదాలోచనతో దానినే కోరుతూ అతనివద్దకే వెళ్లాను. నేను ఇతరులైన కొందరిని అడుగగా ‘‘మేము నిరంతర జ్ఞానప్రాప్తిచేత ఇంద్రుని అనగా ఆత్మను దర్శించగలిగాము’’అని వారు (ప్రాజ్ఞులు)చెప్పారు. కాబట్టి నిరంతరం జ్ఞానంచేత ధ్యానంచేస్తే ఆత్మ దర్శనమవుతుంది. తత్సాధనకై మనిషి జీవితంలో వివేకాన్ని అభ్యాసపూర్వకంగా ప్రయత్నించాలి.
**
పామరుడా! విని తెలుసుకో!
ప్ర ను వయం సుతే యా తే కృతానీంద్ర బ్రవామ యాని నో జుజోషః
వేదద విద్వాన్ శృణవచ్చ విద్వాన్ వహతే- యం మఘవా సర్వసేనః॥
ఋ. 5-30-3॥
భావం:- ఓ ఇంద్రా! విశ్వంకోసం నీవుచేసిన కర్మలను, మాకోసం చేసిన కర్మలను మేము వెంటనే వర్ణిస్తాం. వానిని విద్యావంతుడు, అవిద్యావంతుడు వినాలి. విద్యారహితుడు తెలుసుకొనేందుకు ప్రయత్నించాలి మరియు వినాలి కూడ. ఈ విద్యావంతుడు సర్వసాధన సమృద్ధి కలవాడగుటచేత విద్యను పరిపూర్ణంగా పొందగలడు.
వివరణ:- ఆత్మకృతమైన పూర్వజన్మకృతఫలంగా ఈ జన్మ ప్రాప్తించింది. ఏ కర్మల చేత భవిష్యత్కాలంలో శుభాలు సంప్రాప్తమవుతాయి? అన్నది ప్రతి వ్యక్తి స్వయంగా విచారించుకోవాలి. వాని నెవడు చేయగలడు? విద్వాంసునివద్ద మనస్త సాధన సంపత్తి ఉంటుంది. అందుచేత ‘విద్వాన్ వహతే- యం మవా సర్వసేనః’ ‘‘సర్వసాధన సంపత్తికల్గి సమృద్ధమైన విద్యాధనవంతుడే విద్యను ఇతరులకు అందించగలడు.’’ వేదమిక్కడ మరో ముఖ్య విషయాన్నికూడ ప్రతిపాదిస్తూంది. అదేమంటే- ఉన్నవాడే లేనివాడి కేదయినా ఈయగలడు. అలాగే విద్వాంసుడే ఇతరులకు జ్ఞానాన్ని ప్రసాదించగలడు. వేదమీ సందర్భంలో అవిద్వాంసులకు- ‘వేదద విద్వాన్ శృణవచ్చ’ ‘‘చదువురానివాడు విద్యను తెలుసుకొనే ప్రయత్నం చేయాలి. శ్రద్ధగా వినాలి’’అని హితవు చెప్పింది.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు