స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-139

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదమావిధంగా చెప్పడం ద్వారా రెండు ముఖ్య విషయాలు గ్రహించాలి. చదువురానివాడు విద్వాంసులు చేసే పనుల్ని, చేష్టలను మొ.చూచి వానిననుసరించి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇది మొదటిది. విద్వాంసులు వచ్చి వినిపించే విషయాలను శ్రద్ధగావినాలి. ఇది రెండవది. చదవడం వినడంలోనే అంతర్భవిస్తుంది. గురువు చెబుతాడు. శిష్యుడు వింటాడు. దీని పేరే చదవడం- చదివించడం. వినకుండ చదవడం సంభవం కాదుకదా. ఋగ్వేదమొక సందర్భంలో-
అక్షేత్రవిత్ క్షేత్ర విదం హ్యప్రాట్ (ఋ.10-32-7) అజ్ఞాని జ్ఞానిని ప్రశ్నిస్తాడు అని చెప్పిన మాటనుబట్టి అడగటం లేదా ప్రశ్నించడం వినడానికి మూలం అని ఋజువవుతూంది. కాబట్టి విద్వాంసుడు విధిగా ‘విద్వాన్ వహతే’ విద్యను ఇతరుల కందించాలని వేదం విద్వాంసులకు వారి కర్తవ్యాన్ని హెచ్చరిస్తూంది. అంటె విద్యనందరకు నేర్పుట విద్వాంసుల పరమధర్మమని వేద ఆంతర్యం. ఈ సందర్భంగా దయానంద సరస్వతి కూడ ఇదే అభిప్రాయాన్ని ప్రకటించారు.
‘‘ఉపదేశం లేదా రచనల రూపంగా మానవులందరకు సత్యాసత్య విషయ స్వరూపాన్ని తెలపడం విద్వాంసుల ముఖ్య కర్తవ్యం.
(సత్యార్థ ప్రకాశం. భూమిక)
ఎందుకంటె సర్వసేనః= వారు తమవద్ద దానికి తగిన సాధన సంపత్తి కలిగి యుంటారుకదా!. వేదమా బోధనాసంపత్తి ఏమిటో మంత్రంలోని ‘ప్ర ను వయం.... జుజోష!’= ‘‘ఓ ఇంద్రా! ఈ విశ్వానికి మరియు మా ప్రీతికొరకు ఏఏ మహత్తర కార్యాలను నీవుచేసియున్నావో వాని నన్నింటిని నోరారా తెలిసినవారికి మరియు తెలియనివారికి కూడ బోధిస్తాం. దానిని వారందరు వినాలి’’అన్న ఒక విద్వాంసుని అనుగ్రహభాషణ వాక్యంగా వివరించింది. మనం తెలిసిన వారమో తెలియని వారమో ఎవరైననేమి ఆ విద్వాంసుని దైవకృపామహత్తర కార్యవిశేష ప్రబోదాన్ని చెవులొగ్గి విందాం. రండి!
మనస్సును స్థిరంగా ఉంచుకో
స్థిరం మనశ్చకృషే జాత ఇంద్ర వేషీదేకో యుధయే భూయసశ్చిత్‌
అశ్మానం చిచ్ఛవసా దిద్యుతో వి విదో గవామూర్వముస్రియాణామ్‌॥
ఋ.5-30-4॥
భావం:- ఓ ఇంద్ర! యోగమనే ఐశ్వర్యాన్ని కోరుకొనేవాడా! నీవు నీ మనస్సును స్థిరంగా చేసికోగలిగితే ఎందరెందరో నీ శత్రువులను జయించగలవు. రాతిని కూడ నీ బలంచేత ప్రకాశింపచేయగలవు. ఆత్మకు సుఖాన్ని, ఆనందాన్ని కలిగించే ఇంద్రియాలను నాశనంచేసి ప్రతిబంధకంగా నిలిచేవానిని తెలుసుకో.
వివరణ:- మనస్సు చాల చంచలమైనది. దానిని స్వాధీనపరచుకొనుట చాల కష్టమైన పని. భగవద్గీత మనస్సు చాంచల్య స్వభావాన్ని తెలుపుతూ ఇలా వివరించింది.
చంచలం హి మనః కృష్ణ ప్రమాథి మలవద్ దృఢమ్‌
తస్యాహం నిగ్రహం మనే్య వాయోరివ సుదుష్కరమ్‌॥ (్భ.గీ.6-34)
ఓ కృష్ణ! మనస్సు చాల చంచలమైనది. అది ఎప్పుడూ చింతను, దీర్ఘాలోచనను చేస్తూ ఉంటుంది. అది చాలా బలీయమైనది. అది వాయువువలె నిగ్రహించుటకు వీలుకానిది.
శుక్ల యజుర్వేదం మనస్సు చాంచల్యాన్ని మనోహరంగా ఇలా వర్ణించింది.
యజ్ఞాగ్రతో దూరముదైతి దైవం తదు సుప్తస్య తథైవైతి (శు.యజు.వే.34-1)
భావం:- ‘జాగృతమై (మెలకువ) యున్న మనస్సు చెప్పలేనంత దూరం పోతుంది. అట్లే నిద్రిస్తున్న మనస్సుకూడ ఎంతో దూరంపోతుంది.’’ అంటె అది మెలకువగా ఉన్నా నిద్రిస్తూఉన్నా విశ్రాంతిగా ఉండదని భావం. ఆ విధంగా మనస్సు నిరంతరం చంచలంగా, వికలంగా ఉంటుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, అహంకార, ఈర్ష్యా- ద్వేష- ఆది నానావిధమైన శత్రువులు ఆత్మమీద దాడిచేస్తూ ఉంటాయి. ఆత్మ ఒంటరిది మరి. దాని శత్రువులో!! అనేకం. ఈ సందర్భంలో వేదం ‘‘స్థిరం మనః... .... భూయసశ్చిత్.’
‘‘ఓ ఇంద్రా! మనస్సును నీవు స్వాధీనపరచుకొంటే నీ వొక్కడవే అనేక శత్రు సమూహాలతో పోరాడి విజయాన్ని పొందగలవు’’అని జీవిత విజయ సాఫల్యోపాయాన్ని సూచిస్తూంది. మనస్సు స్థిరంగా ఉన్నప్పుడే చేసే యుద్ధంలో మనస్సు విజయాన్ని సాధిస్తుంది. కాబట్టి ముందుగా మనస్సును స్థిరంగా ఉంచుకొనేందుకు ప్రయత్నించు. లోక వ్యవహారాలను చక్కబెట్టుకొనేందుకు కూడ మనస్సు స్థిరంగా పెట్టుకోవలసిన అవసరముంది. మనస్సు ఎంత శక్తివంతమో యజుర్వేదమిలా చెబుతూంది.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు