స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-140

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మనస్సు లేకపోతే ఏ పని నిర్వహింపబడదు.’’ ఈ దృష్ట్యా పరిశీలిస్తే కళ్లు చూస్తాయి. మనస్సుతో కూడినప్పుడే చెవులు వింటాయి. ఇలా మనస్సుతో సహయోగం లేకుంటే ఏ ఇంద్రియమూ పనిచేయదు. కాబట్టి అట్టి బలసంపన్నమైన మనస్సును చంచలంగా వదిలివేయకుండా దానిని నిగ్రహించాలి. మనస్సే నిగ్రహింపబడి వశవర్తి అయితే అజ్ఞానశిల బ్రద్దలైపోతుంది.
ఈ అభిప్రాయానే్న ప్రస్తుత వేదమంత్రం ‘అశ్మానం చిచ్ఛవసా దిద్యుతః’ రాతిని కూడ విద్యుత్తువంటి తన కాంతులచే మనస్సు తన బలంచేత ప్రకాశింప చేయగలదని కవితా సుందరంగా చెప్పింది. ఇక్కడ రాతిని అంటె అజ్ఞానిని అని అర్థం. అజ్ఞానిని కూడ జ్ఞానశక్తిచేత ప్రకాశింపచేయగలదని భావం. స్థిరపడిన మనస్సుకల జ్ఞాని జ్ఞాన ప్రతిబంధకాలేవో గ్రహించుకోగలడు. అతడు ధారణం, ధ్యానం మరియు సమాధి స్థితుల ద్వారా మనోనియంత్రణ సాధించగలుగుతాడు. పై ధారణ, ధ్యాస, సమాధులు సాధననే సంయమనమని వ్యవహరిస్తారు. యోగదర్శనంలో వీని ప్రాశస్త్యం సవివరంగా వర్ణింపబడింది. ‘తజ్ఞయా త్ప్రజ్ఞాలోకః’ (యోగ దర్శనం. 3-5) సంయమనాన్ని సాధిస్తే బుద్ధిప్రకాశిస్తుంది. ఆ ప్రకాశంవలన జ్ఞానావిష్కరణను నిరోధించే ప్రతిబంధకాల ప్రత్యక్ష జ్ఞానం కలుగుతుంది. తద్వారా మనస్సు జ్ఞానప్రకాశితమై ఏకాగ్రస్థితి పొందుతుంది.
**
ఆత్మ సర్వోత్కృష్టం. ఇంద్రియాలు దానికి భయపడతాయి
పరో యత్వం పరమ ఆజనిష్ఠాః పరావతి శ్రుత్యం నామ బిభ్రత్‌
అత శ్చిదింద్రాదభయంత దేవా విశ్వా అపో అజయద్దాసపత్నీః ॥

భావం:- దేశంలో ప్రఖ్యాతుడవై యుంటున్న నీవు ఉత్తములలో ఉత్కృష్టుడవైయున్నా నీకు ఇంద్రుని వలన దేవతలవలె ఆత్మకు ఇంద్రియాలు భయపడుతూ ఉంటాయి. ఎందుకంటె ఇంద్రియాలు పాపకర్మలకు వశమైనవి. అందుచే ఆత్మవలన అవి పరాజితమగుచున్నవి.
వివరణ:- శరీరమూ మరియు ఇంద్రియాలు రెండూ ఆత్మకొఱకు మాత్రమే ఉన్నాయన్న విషయాన్ని అందరూ సమ్మతిస్తారు. శరీరం ఆత్మ సుఖ-దుఃఖానుభవాలకు నివాస స్థానం. అందుచేత ఇంద్రియాలు ఆత్మకు కేవలముపకరణాలు మాత్రమే. కాబట్టి ఇంద్రియాలకంటె ఆత్మ శ్రేష్ఠం. ఈ విషయాన్ని కఠోపనిషత్తు ఈ క్రింది విధంగా వివరించింది.
ఇంద్రియేభ్యః పరం మనో మనసః సత్వముత్తమమ్‌
సత్వాదధి మహానాత్మా మహతో- వ్యక్తముత్తమమ్‌॥ 6-7॥
అవ్యక్తాత్తు పరః పురుషో వ్యాపకో- లింగ ఏవ చ
యం జ్ఞాత్వా ముచ్యతే జంతురమృతత్వం చ గచ్ఛతి॥ 6-8॥
భావం:- ‘‘ఇంద్రియాలకంటె మనస్సు, దాని కంటె బుద్ధి, దాని కంటె అహంకారం. అహంకారం కంటె మహత్తత్త్వం, దానికంటె అవ్యక్తప్రకృతి, దానికంటె పురుషుడు శ్రేష్ఠుడు. అతడు వ్యాపకుడు. అంటే సర్వసమర్థత గలవాడు మరియు అలింగుడు= అంటే- ఉపాదాన కారణం అనగా ముఖ్య కారణం కానివాడు. అంటె ప్రత్యేక లక్షణాలేవీ లేనివాడు.’’ ప్రకృతి వికృతి దశను పొందుతూ ఉంది. ఆ వికృతి రూపమే దాని ప్రకృతి రూపానికి అనుమాపకం అంటే జ్ఞప్తికి తెచ్చేది. కాని ఆత్మకు ఇటువంటి వికృతి వికార స్వభావం గాని, కార్యరూపంగాని లేదు. అందుకే ఉపనిషన్మహర్షి ఆత్మను అలింగంగా అంటే ప్రత్యేక వికారాలు, రూపాలు లేని దానిగా నానీకరణం చేసాడు. ఆత్మశక్తులన్ని సమస్త శరీరంలో అనేక కార్యాలను నిర్వహిస్తున్నాయి. కాబట్టి ఆత్మను వ్యాపకంగా వ్యవహరించడం జరిగింది.
ఈ విధంగా ఉత్కృష్టమైన ఆత్మ శరీరంతో నిర్వహించే అనేక సత్కర్మల కారణంగా, సుప్రతిష్ఠతను పొందిన కారణంగా, ఉత్కృష్టతనే కాదు పరమోత్కృష్టత వహిస్తున్నది.
ఆ విధంగా పరమోత్కృష్టతను పొందిన ఆత్మను చూచిన మనోబుద్ధ్యాది ఇంద్రియాలు భయాన్ని వహిస్తున్నాయి. ఆత్మ దేహంలో ఉన్న కారణంగానే ఇంద్రియాలమైన మేమీ దేహంలో ఉండగల్గుతున్నాం. ఆ ఆత్మే దేహంనుండి నిష్క్రమిస్తే మేము కూడ శరీరంనుండి నిష్క్రమించవలసినదే. ఆ విధంగా ఆత్మ నిష్క్రమణతో మేమూ (ఇంద్రియాలు) నిరాశ్రయులం కావలసి యుందన్నది ఇంద్రియాల భయం.మాలో (ఇంద్రియాలలో) ఉన్న శక్తి అంతా ఆత్మదే అన్న భావంతో ఇంద్రియాలన్ని ఆత్మను ఈ క్రింది విధంగా స్తుతిస్తాయి.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు