స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం -- 25

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు

పరమేశ్వరుడీ సృష్టినెందుకు సృష్టించాడు? జీవులన్ని తమ కర్మానుగుణంగా భోగభాగ్యాలను మరియు ముక్తిని పొందేందుకే విధాత ఈ సృష్టి నిర్మాణం చేసాడని వేదమొక సందర్భంలో దీనికి సమాధానమిచ్చింది. అంటే ఈ సృష్టినిర్మాణంలో సృష్టికర్తకు స్వప్రయోజనమేమీ లేదనే కదా అర్థం. అందుచేత విశ్వవిభుడు చేసిన సృష్టికార్యం నిష్కామకర్మ. అట్టి కర్మారంభుడు కాబట్టే జ్ఞానబల క్రియాశక్తులు సహజశీలంగాకల భగవానుని కర్మసుకర్మయే అని ‘‘స్వాభావికీ జ్ఞానబలక్రియా చ’’ అని శే్వతాశ్వతరోపనిషత్తు (7-8) బలపరిచింది.
ఆ విధంగా దేవతా సార్వభౌముడు తన జ్ఞానబల క్రియా స్వభావంచేత సకల జీవులకు ఉపకారాన్ని చేస్తున్నాడు. భగవద్భక్తుడైనవాడు ఆరాధ్యదైవమైన భగవంతునే అనుసరించి నిష్కామకర్తనే ఆచరించాలి. అప్పుడే ఈ జగన్నియామకునకు చెలికాడు కాగలడు.
ఆ విధంగా నిష్కామబుద్ధితో సృష్టిజాలాన్ని నిర్మించడంచేత సృష్టికర్త స్వపా= సత్కర్మాచరణుడయ్యాడు. మానవుడు తాను కూడ స్వపా= సత్కర్మాచరణుడు కాదలంచితే సరిపోదు. తప్పక సత్కార్యాచరణకు పూనుకోవాలి. అంటే ఆరాధ్యరూపమైన భగవానుని ఆదర్శంగా గ్రహించి లోకోపకారకమైన కార్యాన్ని చేసేందుకు దీక్ష వహించాలి.
మంత్రంలోని రెండవ వాక్యం గంభీరమైన వైజ్ఞానిక రహస్యాన్ని తెలుపుతూ ఉంది. విశాలమైన ద్యావాపృథువులను సృజించి అవి ఏ ఆధారంలేకుండా తిరిగే విధంగా అపూర్వవిధానాన్ని కల్పించాడు. కనీసమొక గడ్డిపోచ కూడ ఆధారం లేకనే విశాల బ్రహ్మాండ లోకాలు తమతమ పరిధులలో తిరుగుతూ ఉండటమే ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. సూర్యుడు భూమికి ఎన్నో లక్షల రెట్లు దూరంలో ఏ ఆధారం లేకనే నిరంతరం సంచరిస్తూ ఉన్నాడు. తారలు, చంద్రుడు ఇలానే సంచారం చేస్తున్నాయి. ఇది ఎలా సాధ్యం? సమాధానమీ మంత్రం సమైరత్= అన్న మాటలో చెప్పింది. అంటే- వాటివాటికి తగినట్టి గతిని= సంచార వేగాన్ని సమతుల్యంగా కల్పించాడని అర్థం. ఆ విధంగా వాటికి కల్పింపబడిన గతిచేతనే అవి ఆధార రహితంగా కూడ తమతమ కక్ష్యలలో సంచారం చేస్తున్నాయి. దీనినే ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం ఆకర్షణశక్తిగా పేర్కొంది. ఈ శక్తి అన్నింటికి ఒకే రీతిగాగాక వాటి ద్రవ్యరాశి భిన్నభిన్నంగా ఉంచిన కారణంగా ఆ ఆకర్షణ శక్తి సమతుల్యమై ఒకదానిచేనొకటి ఆకర్షింపబడుతూ సంచారం చేస్తున్నాయి. వైజ్ఞానిక శాస్త్రం ఆకర్షణ శక్తి అని, వేదం గతి అనగా పొందడం అని వ్యవహరించింది.
ఈ గతి స్వభావమేమిటి? చూడండి- మనం ఒక బంతిని పైకి విసిరాం. అది కొంత వేగంతో పైకి వెళ్లింది. అలా బంతికి పైకివెళ్లే ‘గతి’ఎలా వచ్చింది? మనముపయోగించిన శక్తివలననే కదా! ఆ శక్తి పరిమితిననుసరించి బంతికి పైకి వెళ్లే గతి నిర్థారణ అయింది. కాని మన శక్తి పరిమితమైనది. ఆ శక్తిని కూడ సంపూర్ణంగా వినియోగించలేము. అందుచేత మన ముపయోగించిన శక్తి పరిమాణాన్నిబట్టి బంతి కొంతవరకు పైకివెళ్లి ఆగి తిరిగి క్రిందపడిపోతుంది.
ఇదే విధంగా భగవంతుడు కూడ సూర్యాదుల మధ్య- బ్రహ్మాండాల మధ్య తన శక్తిని నిక్షేపించి వానిలో గతిని కల్పించాడు. ఆ గతి పరిమాణాన్నిబట్టి సూర్యాదులు, బ్రహ్మాండాలు సంచరిస్తూ ఉంటాయి. ఆ శక్తి ఉపసంహరింపబడినంతనే మనం విసిరిన బంతివలె అవికూడ రాలిపోతాయి. ఈ విధంగా నిరాధారంగా బ్రహ్మాండాలు సంచరించేందుకు ప్రధాన హేతువు భగవంతుని శక్తిసామర్థ్యమే. దీనినే వైజ్ఞానిక శాస్త్రం ఆకర్షణశక్తిగా చెప్పినా అందులో నామభేదమే తప్ప స్వభావభేదం లేదు.
--ఇంకావుంది...