స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-143

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చివరగా మరియొక ప్రార్థన. ‘తేషు ధేహ్యోజో జనేషు యేషు తే స్యామ.’ నీవు వారికి అపారమైన తేజస్సును మరియు శక్తిని అనుగ్రహించు. ఆ శక్తి వలయంలోనికి చేరిన మేముకూడ నీవారమే అయ్యెదము. ఓ జీవనాధారా! అమృత స్వరూపా! నేను నీవాడను కావాలన్నదే నా వాంఛ. నినే్న ధ్యానిస్తాను. నీ కీర్తినే గానంచేస్తాను. ఓ దేవా! నన్ను నీ వాడిగాచేసే భక్తునకు నీవు తప్పక శక్తి నిమ్ము. శరణాగతులను ఆశీర్వదించుట నీ వ్రతం కదా.
***
సోమరసాస్వాదకుడే తేజశ్శాలి
యో అస్మై ఘ్రంస ఉత వా య ఊధని సోమం సునోతి
భవతి ద్యుమా అహ అపాప శక్రస్తతనుష్టిమూహతి తనూశుభ్రం
మఘవా యఃకవాసఖః॥ ఋ.5-34-3॥
భావం:- ఎవడు రాత్రి గాని పగలు గాని సోమరస పానీయాన్ని ఆత్మకొఱకు సిద్ధపరచుకొని ఉంటాడో ఆ మనిషి తేజోవంతుడు కాగలడు. బలవంతుడు, ధనవంతుడు, జ్ఞానులు మిత్రులుగా కలవాడు జనన మరణ రూపమైన సంసార విస్తరణ మరియు దేహసంరక్షణలకు సంబంధించిన ఆలోచనలకు దూరంగా ఉంటాడు.
వివరణ:- రాత్రిగాని పగలు గాని సోమరస పానీయాన్ని అధికంగా సిద్ధం చేసుకోవడంవలన సిద్ధించే మాహాత్మ్యమేమిటో ఈ మంత్రంలో వర్ణింపబడింది. ఎవడు పగలురాత్రి ‘సోమం సునోతి భవతి ద్యుమాన్ అహ’ ‘‘సోమరసాన్ని సిద్ధపరచుకొంటాడో ఆతడు తేజోవంతుడవుతాడు’’అని వేదం స్పష్టంగా వచించింది. సోమరసం శాంతికి ప్రతీక. కాబట్టి ఈ వాక్యాన్ని అనుసరించి ఆత్మకు శాంతి కలగాలని తగిన మార్గాలను అనే్వషించేవాడు తేజోవంతుడవుతాడు.
అశాంతుడి మనస్సు చంచలంగా ఉంటుంది. దానివలన అతని శక్తి క్షీణిస్తుంది. మనసు ఏ ఒక్క విషయం మీద కేంద్రీకరింపబడకపోవడం చేత ఆతడి శక్తిఅంతా క్షీణించిపోతుంది. ఒక విషయంమీద మనస్సు ఏకాగ్రత కుదిరిన వాని ముఖం తేజస్సుతో వెలిగిపోతుంది. గాలివలె సదా చంచలమైన మనస్సును వశపరచుకోవడానికి బలం అనల్పమైనది కావాలి. అట్టి బలవంతుని వేదం ‘శక్రః’అని వ్యవహరిస్తూంది. సోమపానం చేయడంవలన ఆతడి ఆత్మ, శరీరం సంసారాల ఎడల విముఖత పొందుతుంది. అట్టివాడు ‘అపాప శక్రస్తతనుష్టిమూహతి తనూశుభ్రమ్’ ‘‘సంసార బంధనాలను పెంచుకొనేందుకు మరియు శరీర పరిపోషణకు చెందిన ఆలోచనలనుండి దూరంగా పారిపోతాడు’’అని రుూ శ్రుతి ప్రబోధిస్తుంది.
ఉదయాన లేచి మాలిన్యం పోయేలాగ శరీరాన్ని రుద్దిస్నానం చేస్తాడు. కాని అతడి శరీరంమీద కొద్దిసేపటికే మలినం తయారవుతుంది. అట్టి స్థితిని చూచి వేదం పేర్కొన్న శక్రుడు కేవలం శరీర శుద్ధతను అధమంగా భావిస్తాడు. బిజ్జూ అను పేరుగల జంతువు తానున్నచోటును చాలా పరిశుభ్రంగా ఉంచుకొంటుంది. ఎవరైనాగాని అది ఉండేచోటున మలమూత్రాలను విడిస్తే వెంటనే ఆ ప్రదేశంనుండి అది వెళ్లిపోతుంది. బహిరంగంగా ఇంత శుభ్రత పాటించే ఆ జంతువు తినేదేమిటో తెలుసా? శవం. మరి దీని బాహ్యశుద్ధి ఏమైనట్టు? కాబట్టి జ్ఞాని శరీరశుద్ధి మీద అధిక ధ్యాసపెట్టడు. అతడి దృష్టి ఉన్నత లక్ష్యం మీదనే ఉంటుంది. జీవితంలో శాంతిని కోరుకొనే శక్రుని దృష్టి రాత్రింబవళ్లు సోమరస సంపాదనాపరుడు తేజోవంతుడవుతాడన్న వేద వచన ప్రబోధంమీదే నిలిచి యుంటుంది. ఈ వచనం మీద ఆతడికెంతో నమ్మకం. ఎందుకంటె ఋగ్వేదమే మరొక సందర్భంలో సోమపానం చేసిన వాని అనుభవాన్ని ఇలా వర్ణించింది.
‘అపాప సోమమమృతా అభూమాగన్మ జ్యోతిరవిదామ దేవాన్’ ఋ.8-48-3॥
‘‘మేము సోమరస పానం చేసి అమృతత్వ సిద్ధిని పొందాం. దానివలన తేజస్సు, దివ్యగుణ సంపత్తి ప్రాప్తించింది.’’ తేజస్సును, జీవన్ముక్తిని అభిలషించేవాడికి క్షణభంగురమైన శారీరక చింత ఉంటుందా?
**
పురుషార్థ ప్రయత్నశూన్యుడు హానిని పొందుతాడు
న పంచభి ర్దశభి ర్వష్ట్వారభం నాసున్వతా సచతే పుష్యతా చన
జినాతి వేదముయా హంతి వా ధునిరా దేవయుం భజతి గోమతి వ్రజే॥
ఋ.5-34-5॥
భావం:- ధర్మార్థ కామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను అనుసరించి సత్కార్యాలనుచేస్తూ జీవించేవాడు భాగ్యవంతుడవుతాడు.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు