స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-144

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ విధంగా చేయక జీవించేవాడు జీవితంలో హానిని పొందడమేగాక లోకంలోని అత్యాచారుల చేతిలో మరణాన్ని కూడ పొందుతాడు. అంతేకాక భగవద్భక్తుడు గోశాలలో చేర్చబడతాడు. అంటే సర్వోన్నత స్థానంలో ఉంచబడి జనులందరిచేత సేవింపబడతాడు.
వివరణ:- ధర్మార్థ కామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలనాచరించి ఇహలోకంలో భోగాన్ని పరలోకంలో మోక్షాన్ని పొందేందుకే భగవానుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. అంతేకాక ఆ పురుషార్థ సాధనకొఱకు మానవులకు జ్ఞానపూర్ణమైన వేదాలను ప్రదానం చేసాడు. ఆ జ్ఞానంతో కార్యాచరణ చేసేందుకు సమర్థవంతమైన శరీరం, ఇంద్రియాలు, ప్రాణం, మనస్సు, బుద్ధి మొదలైన సాధనాలను కూడ ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినా వాని నుపయోగించుకొని పురుషార్థాలను ఆచరించనివాడు ‘న సచతే పుష్కతా చన.’ జీవితంలో సౌభాగ్యాన్ని పొందజాలడు’’అని వేదం నిర్ద్వంద్వంగా చెప్పింది. నిశ్చయమైన ఈ అభిప్రాయాన్ని ఋగ్వేదమే మరొకచోట ‘ఇచ్ఛింతి దేవాః సున్వంతమ్’ (ఋ.8-2-18) దేవ=దేవతలు గాని, విద్వాంసులుగాని, సచ్ఛీలురు గాని చతుర్విధ పురుషార్థాల నాచరించే వానినే ఇష్టపడతారు’’అని ధ్రువీకరించింది. వేదమంతటితో సంతృప్తిచెందక పురుషార్థాచరణ ఎడల అలసభావం (ఉపేక్షాభావం) వహించేవాని దుస్థితి ఏమిటో-
‘జినాతి వేదముయా హంతి వా ధునిః’ ‘‘అలసభావం చేత అత్యాచారుల చేత మరణాన్ని పొందుతాడు’’అని కూడ స్పష్టంచేసింది. జీవితంలో చాల ముఖ్యాంశమైన ఈ విషయాన్ని గురించి పునరుక్తి దోషాన్నికూడ విచారించక వేదం-
‘న స్వప్నాయ స్పృహయంతి’(ఋ.8-2-18) ‘‘నిద్రించేవాడిని దేవతలెన్నడూ మేల్కొల్పరు’’అని హెచ్చరించింది. దీనినిబట్టి దేవతలకు అజాగ్రత్తపరులంటే గిట్టదని స్పష్టమైంది. కాబట్టి ఎవడు జాగృతుడో (మేల్కొనువాడో) అతడే సర్వమూ పొందగలడు. నిద్రించువాడంటే తోటి బాటసారికి కూడ భయమే. కాబట్టి మానవుడు తప్పక పురుషార్థి కావాలి. అతడికే లోకంలోని సమస్త వస్తుసంపద లభిస్తుందని ఈ ఋగ్వేద మంత్రం
‘ దేవయుం భజతి గోమతి వ్రజే’ ‘‘పురుషార్థతత్పరుడైన దైవాభిలాషి గోశాలలోనికి చేర్చబడతాడు అంటే సమస్త వస్తు-పదార్థజాతమూ అతడికి లభిస్తుంది’’ అని హామీనిచ్చింది. పురషార్థాలనాచరించే సమయంలో ఎన్నో కష్టాలెదురవుతాయి. కాని వాని ఫలాలు చాల మధురంగా ఉంటాయి. ఈ విషయానే్న ఋగ్వేదం చమత్కారంగా-
‘యంతి ప్రమాద మతంద్రా?’ (ఋ.8-2-18) ‘‘నిద్రారహితుడు, ప్రయత్నశీలుడు ఆనందాన్ని పొందుతాడు’’అని పేర్కొంది. వేదం చెప్పిన దీనినే హితోపదేశమనే గ్రంథం (కథాముఖం-33)
‘ఉద్యోగినం పురుషసింహముపైతి లక్ష్మీః’ ‘‘ప్రయత్నశీలుడైన నరోత్తముని లక్ష్మీదేవి వరిస్తుంది’’అని రమణీయంగా చెప్పింది. కాబట్టి సాంసారికమైన అధమ ధనంనుండి మోక్షలక్ష్మివరకు సమస్తమూ పురుషార్థ పరాయణునకే చెందుతాయి. అందుకే మానవులారా! అలసత్వాన్ని వీడండి. చతుర్విధ పురుషార్థ ప్రయత్నశీలురు కండి.
**
మానవుడా! నీవు నీ లక్ష్యసిద్ధికే జన్మించావు
వృషా హ్యసి రాధసే జజ్ఞిషే వృష్టి తే శవః
స్వక్షత్రం తే ధృషన్మనః సత్రాహమింద్ర పౌంస్యమ్‌॥ ఋ.5-35-4॥
భావం:- ఐశ్వర్యాన్ని కోరుకొనే ఓ మానవా! నిజంగా నీవు బల- వీర్యసంపన్నుడవు. మరియు సమర్థుడవు. కర్మచేసి సిద్ధిపొందుటకే నీవు జన్మించావు. నీ శక్తిసుఖాలను వర్షిస్తుంది. నీకు ఇతరులను ఆపదలనుండి రక్షించే శక్తి సామర్థ్యాలున్నాయి. నీకు నీ తప్పిదాలను సరిదిద్దుకొనే యుక్తిఉంది. నీ మనస్సు చాల ప్రౌఢమైనది. శక్తివంతమైనది. పుంస్త్వమూ, శౌర్యమూ సత్యాచరణాది సద్గుణవంతమూనైనది.
వివరణ:- జీవులు చాలా దుర్బలమైనవారుగా లోకం సాధారణంగా భావిస్తుంది. కాని వేదమీమంత్రంలోని జీవుని వాస్తవిక బలసంపత్తిని వివరించింది. వాస్తవానికి భగవానుని సృష్టి రచన అందునా జీవుని సృష్టి చాల అద్భుతం. ఆ జీవులుచేసే సృష్టికూడ చాలా అద్భుతం. అగ్ని రగిలించడం- నూతులు త్రవ్వడం- నదుల కానకట్టలు కట్టకాలువల త్రవ్వడం. వ్యవసాయంచేయడం- ఇళ్లు కట్టడం మొదలయినవి నేడు చాల సాధారణమైనవిగా కనబడుతుంటాయి. కాని ఒక్కసారి ఆలోచించండి. మీకే అర్థవౌతుంది. మొట్టమొదటగా ఆ పనులు చేయబడిన కాలంలో అవి మెదడును ఎంత కష్టపెట్టియుంటాయో!!- అవి ఎంత కష్టసాధ్యమై యుంటాయో!!
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు