స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-147

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
లోకంలో కొందరు ‘మేము కర్మ చేస్తున్నాం తదనుగుణమైన ఫలాన్ని దైవమిస్తూంది. ఇందులో దైవ మిచ్చిన దానమేముంది?’’ అని అడుగుతుంటారు. వారికి సమాధానమొక్కటే - నీ కర్మకు తగిన ఫలాన్నీయక వ్యతిరేక ఫలమిస్తే ఏమిచేస్తావు అన్నది. నిజానికి కర్మానుసారమైన ఫలమయడమే సర్వేశ్వరుడు చేసే గొప్ప దానం. ఆయన ఈయడమే గాని ఏమి తీసుకోడు. అసలు నీవు మంచి పని చేస్తే దైవానికేమి లాభం? చెడ్డ పని చేస్తే ఆయన కేమి నష్టం? నీవు చే దుష్కర్మ- సుకర్మలు విశ్వవిభుడికి దూషణ భూషణాలేమీ కావు. నిజమే నీవు భావించినట్టు నీ కర్మాచరణకు తగిన ఫలమీయడం ప్రత్యుపకారం కాదు సరే. పోనీ నీవు చేసిన కర్మాచరణవలన దేవునికి ఉపకారమేమైనా ఉందా? అందుకోసం ఆయన ప్రతి రూపంగా ప్రత్యుపకారం చేస్తున్నాడా? అదేమీ కాదు కదా! దైవం సహజసిద్ధంగా దయాళువు. ఆయన-
‘యః శంసతే స్తువతే శంభవిష్ఠ?’ (ఋ.5-42-7) ‘‘తనను నోరార కీర్తించిన వారికి శుభప్రదుడు’’. అంతేకాదు. ఆయన ‘పురూవసురాగమజ్జోహువానమ్’ (ఋ.5-42-7) ‘‘తనను భక్తితో మాటిమాటికి పిలిచినా ఆతడి వద్దకు ఆయన వేగంగా వస్తాడు’’ అని ఋగ్వేదం భక్తసులభత్వాన్ని కీర్తిస్తూంది. దైవానికి తాను ఐశ్వర్యప్రదాత నన్న గర్వమేమీ లేదు. భక్తితో పిలిచినవాడి దగ్గరకు వస్తాడు. ఓ ధనాభిలాషులారా! ఆయన పురూవసువు. ఆయన్ను పిలవండి. ఆయన గో-అశ్వాది పశుసంపదను, అన్న- వస్త్రాదులను ఇలా జీవితోపయోగకరమైన సంపదలను ప్రదానం చేస్తాడు. అందుకే దైవానికి పురూవసుః అని సార్థక నామధేయం.
అట్టి మహాదానశీలియైన దైవసన్నిధిలో ఉండేవాడే ధన- ఐశ్వర్య సంపన్నుడు. తక్కినవారు కట్టెముక్కలు, మట్టి పెళ్లల వంటివారే.
***
దురాలోచనాపరులను సమాజంనుండి గెంటివేయండి
య ఓహతే రక్షసో దేవవీతావచక్రేభిస్తం మరుతో ని యాత
యో వః శమీం శశమానస్య నిందాత్తుచ్ఛ్యాన్ కామాన్‌కరతే సిష్వదానః॥
ఋ.5.42-10॥
భావం:- భగవత్ప్రాప్తి కొఱకై సాధన చేసే నీకు ఎవడైతే విఘ్నాలను కల్పిస్తూ, దురాలోచనలను కలిగిస్తూ, రాక్షసులనుపోలిన దురాచారాలను ఎగసనద్రోస్తూ శాంతికొఱకై చేసే ప్రయత్నాలను నిరుత్సాహపరుస్తూ, అదే విధంగా స్నేహంగా ఉంటూనే తుచ్ఛమైన ఆలోచనలను చేస్తూ ఉంటాడో అతడిని అర్థచంద్ర ప్రయోగంతో (చేతి బొటనవ్రేలు చూపుడువ్రేలు అర్థచంద్రాకారంగా చేసి) మెడ పట్టి గెంచివేయుము.
వివరణ:- ఇతరులకు విఘ్నాలను అపకారాలను తలపెట్టి తమతమ స్వప్రయోజనాలను రక్షించుకొంటారో వారే రాక్షసులు. అట్టి వారి భావాలు, కర్మలు కూడ రాక్షసాలే. అట్టివారు మనుషులు, పక్షులు, పశువులు, కీటకాలు ఏవయినా- ఎవరైనా అందరూ రాక్షసులే. వీరికి భిన్న స్వభావంకలవారు మరుత్తులు. వీరు సమాజ సంరక్షణకోసం చావడానికయినా, చంపడానికయినా సంసిద్ధులైయుంటారు. సమాజంలో శాంతిస్థాపనకై, సమతాస్థాపనకై పరిశ్రమించే వీరిని వేదం ‘మరుత్తులు’ అని వ్యవహరించింది. రాక్షస ప్రవృత్తిగల వారిని దూరంగా గెంటివేయుమని మరుత్తులనే సంబోధిస్తూ ఇలా ఈ మంత్రంలో ప్రార్థన చేయబడింది.
‘య ఓహతే రాక్షసో దేవ వీతౌ’:- ‘‘భగవత్ప్రాప్తి కొఱకై చేసే సాధనలో లేదా శుభకార్య సమయంలో ఎవరైతే రాక్షసులను-రాక్షస వృత్తులను తెచ్చి వారిని ప్రేరేపిస్తారో అట్టివారే రాక్షసులు. అట్టివారు తప్పక దూరంగా తరిమివేయబడాలి.’’
‘జో వః శమీం శశమానస్య నిందాత్’= నీలోనే ఉండి శాంతి మరియు శుభకర్మలను చేసే శాంతికాముకుని కర్మలను దూషిస్తూ నిరుత్సాహపరచువాడు కూడ బహిష్కరింపబడాలి.
సర్వజీవులు సుఖ-శాంతుల కొఱకై నిత్యమూ ప్రయత్నిస్తూ ఉంటాయి. అట్లే సమస్త జీవులకు సుఖశాంతులు కలిగే విధంగా ఎవరు ప్రయత్నిస్తారో వారు ధన్యజీవులు. అట్టి మహోపకారులే సమాజానికి ఆధారభూతులు కాని లోకంలో ఇతరుల సుఖ-శాంతులను చూచి కన్నుకుట్టి అసూయతో రగిలిపోయే మనుషులు కూడ ఎందరో ఉంటారు. వారు మహోపకారులైన సమాజ సంరక్షకులను గూర్చి ఒక్క మాటకూడ విని సహించలేరు. వారు స్వయంగా ఒక మంచి పనిచేసి అందరి మెప్పును పొందలేరు సరికదా సమాజంలో మంచి పనులను చేస్తున్న వారిని చూచి అసూయతో రగిలిపోయి వారిని నిందిస్తూ ఉంటారు. ఆ విధంగా వారు తమ కడుపు మంటను చల్లార్చుకొంటారు. అట్టి అసూయగ్రస్తులను, శాంతి భంజకులను సమాజంనుండి గెంటివేయాలి.

ఇంకావుంది...