స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం -- 152

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512

అదేమంటే-బోధించేవాడు క్రాంతదర్శి అయిన కవి (గురువు) ఆయననుండి జ్ఞాన ప్రబోధం పొందే శిష్యుడు కూడ క్రాంత దర్శ అయిన కవియే లేదా విద్వాంసుడే. ఇది ఎలా సంభవం? అంటే గురుశిష్యులైన ఇరువురిలోను ఉన్నది సహజ చైతన్యంగల ఆత్మయే. కాబట్టి జ్ఞానం ఆ ఆత్మ స్వరూపం. ఆ జ్ఞానం ప్రకాశించేందుకు శిష్యునియందు అవరోధముంటుంది. గురువు చేసే పని కేవల మా అవరోధాన్ని తొలగించడమే. అది తొలగినంతనే శిష్యుడు కూడ గురువువలె సమాన జ్ఞానవంతుడవుతాడు. ఈ మర్మానే్న వేదమావాక్యంలో సూత్రీకరించింది.
ఇట్లే పూర్వార్థవాక్యంలో ప్రతిపాదింపబడిన మరో ముఖ్యాంశం గురురూపుడైన కవి ‘అదబ్ధా’= ఇతరులచేత అణచబడేవాడు లేదా ఆశింపబడేవాడు కాకూడదు అన్నది. గురువుశిష్యుని చేతగాని మరెవ్వరి చేత గాని అణచివేయబడినట్లయితే అది కనేక దుష్ప్రభావాలను వెంటబెట్టుకొని శిష్యునకు అశుభదాయకమైపోతుంది.
ఇక మూడవ అంశం. ‘నిధారయంతః’ నియమ నిష్ఠలను విధి తప్పక ఆచరిస్తూ ఉండేవాడు. గురువునకు ప్రధానంగా ఉండవలసిన లక్షణమిదే. ఎందుకంటె శిష్యుల నియమ- నిష్ఠాపరుడుగా, సద్గుణవంతునిగా తీర్చబడాలంటే ఈ లక్షణ సమన్వితుడుకాని గురువునకు సాధ్యపడుతుందా? అయితే నియమనిష్ఠలను ఆచరించే సమయంలో విపత్తులు గురువునకు ఎదురయితే భయపడి వానిని వివకుండా ధైర్యంగా ఆచరించవలసియుంది. అప్పుడే అట్టి గురువు శిష్యుడికి ఆదర్శప్రాయుడు., పూజనీయుడు అవుతాడు.
ఇక ఈ మంత్రంలో ద్వితీయార్థం గురువులకుండదగిన మరో రెండు లక్షణాలను వివరించింది. మొదటిది గురువుముందు ‘దృశ్యాన్’ ‘‘చూడచక్కనివాడు’’గా ఉండాలి. కానిచో గురువును చూచినంతనే శిష్యునికి భీతి కలుగుతుంది. భీతివలన కల్గిన ఉద్వేగంతో శిష్యుడు గురు ప్రబోధాన్ని సక్రమంగా గ్రహించలేడు. రెండవది- గురువు ‘అద్భుతాన్’= అద్భుత ప్రబోధకుడై ఉండాలి. అంటే శిష్యుడికి అంతకుముందు తెలిసిన విషయాన్నిగాక ఎప్పటికప్పుడు నూతన విషయాలను బోధించువాడై ఉండాలి. అలా బోధించేందుకు గురువు ఎప్పటికప్పుడు నూతన విజ్ఞాన విషయాలను తెలుసుకొంటూ నిత్య విద్యార్థిగా ఉండాలి. అప్పుడే శిష్యుణ్ణి సంపూర్ణ జ్ఞానవంతుణ్ణి చేయగలడు.
అనంతరం శిష్యుడు గురువును దర్శించే విధానాన్ని ఈ మంత్రంలోని ద్వితీయార్థం వివరిస్తూంది. శిష్యుడు ముందుగా గురువు పాదాలనే దర్శించాలి ‘పడ్భిః పశే్యరన్’అని వచించింది. పాదాలు నడకకు ప్రతీక. పాదాలను చూడమంటే గురువు నడతను అనగా సత్ప్రవర్తనను దర్శించు అంటే చూచి అనుసరించమని వేదాదేశం. ఈ వేదాదేశాన్ని తైత్తిరీయోపనిషత్తు (11-12) ఈ విధంగా వివరించింది.
‘యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితన్యాని నో ఇతరాణి’ ‘‘మా సత్కర్మలేవి గలవో వానిననుసరించు. తదితరమైనవి అనుసరించకు.’’ ఈ రీతిగా ఉపనిషత్తు గురువు తన ప్రవర్తన విషయంలో సంయమనం కలిగియుండాలని హెచ్చరించింది. మంచైనా, చెడైనా గురువు ప్రవర్తనచేత శిష్యుడు ప్రభావితుడౌతాడు. అందుకే వేదంముందే గురువు ‘నిధారయంతః’ నియమ నిష్ఠలను విధిగా అనుష్ఠించాలని స్పష్టంగా హెచ్చరించింది. ఈ వేదాదేశం నాడే కాదు ఏనాడైనా ఎక్కడైనా, ఎప్పుడైనా గురువులందరికి శిరోధార్యమే.

***
134. హృదయాకాశం నుండి అమృతం వర్షిస్తుంది
ఆత్మన్వన్నభో దుహ్యతే ఘృతం పయ ఋతస్య
నాభిరమృతం వి జాయతే సమీచీనాః సుదానవః
ప్రీణంతి తం నరో హితమవ మేహంతి పేరవః॥
భావం: పరమాత్మ వ్యాపించిన ఆకాశంనుండి ప్రకాశమయమైన అమృతం వర్షింపబడుతూ ఉంది. దానినుండి ఋతానికి మూలమైన అమృతం పుడుతూ ఉంది. సత్ప్రవర్తన కలవారు, మహాదాతలు ఆ అమృతాన్ని తృప్తిగా అనుభవిస్తారు. దానిని జ్ఞానులైన మహాపురుషులు గ్రహించి జ్ఞానహీనులైన పామరుల శ్రేయస్సు కొఱకై వర్షిస్తారు.
వివరణ: పరమాత్మ అంతటా వ్యాపించిన ఆకాశంనుండి అమృతం వర్షిస్తుందన్న విషయాన్ని సంకేత రూపంగా తైత్తిరీయోపనిషత్తు ఈ క్రింది విధంగా వివరించింది.
స చ ఏషో- న్తర్హృదయ ఆకాశః
తస్మిన్నయం పురుషో మనోమయః, అమృతో హిరణ్మయః (తైత్తిరీయ ఉప.1-6-1)

-- ఇంకావుంది...