స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-154

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరి ఎందుకు చెడిపోడో కూడ వేదం తదుపరి వాక్యంలో ‘త్రీష పవిత్రా హృద్యంతరా దధే’ ‘‘మూడు పవిత్రమైన ధర్మాలను హృదయ పూర్వకంగా ఆచరిస్తాడు’’ కాబట్టి అని కారణాన్ని చెప్పింది. ఆ మూడు ఏమంటే
1. 1.్భగవంతుడు
2.జ్ఞానం
3.్ధ్యనం
2.
1.జ్ఞానం
2.కర్మ
3.ఉపాసన
3. 1. పవిత్రాలోచన
2. పవిత్ర సంభాషణ
3. పవిత్ర సదాచారానుసరణ.
ఈ మూడింటిని హృదయపూర్వకంగా ఆచరించేవాడిని ఎవడు చెడగొట్టగలడు? అట్టి ఋషి జన్మమరణ రూపమైన భవసాగరాన్ని సులభంగా తరించగలడు. ఋగ్వేద మీ విషయాన్ని సమర్ధిస్తూ ‘సత్యస్య నావః సుకృతమపీపరన్’ (ఋ.9-73-1) ‘‘సదాచార పరాయణుని సత్యమనే నౌక భవసాగరాన్ని దాటిస్తుంది’’అని వచించింది. అతడు సదా సృష్టినియమలను చింతన చేయడం ద్వారా సమస్త భువనాలను ప్రత్యక్షంగా చూడగల సమర్థతను ‘విద్వాన్‌త్స విశ్వాభువనాభి పశ్యతి’అని వేదం శ్లాఘించింది. ఆ విధంగా సృష్టి నియమాల చింతన ద్వారా అది సృష్టికర్త ధ్యానమే అవుతుంది. దానివలన సృష్టి జ్ఞానంకూడ మదిలో ప్రకాశిస్తుంది.
ఈ వేదార్థానే్న విభూతి పాదంలో ‘్భవన జ్ఞానం సూర్యే సంయమాత్’ (26) ‘‘సూర్య= చరాచర జీవుల ఆత్మలు సంయమనం కలిగియుండటం వలన వానికి సర్వలోకజ్ఞానం కలుగుతుంది’’అని పునరుద్ఘాటించడం జరిగింది. అట్టి సర్వలోక దర్శనుడైన ఋషి కర్తవ్యభ్రష్టులకు వారి తప్పిదాన్ని గుర్తుచేసి హృదయంలో స్వయంకృతాపరాధాగ్నిని రగిలిస్తాడు. ఆ విధంగా పశ్చాత్తాపాన్ని రగిలించి సన్మార్గ వర్తనులను చేస్తాడు. ‘అవాజుష్టాన్ విధ్యతి కర్త్రే అవ్రతాన్’అని ఋతశీలి సచ్ఛీలాన్ని ఆవిష్కరించింది.
***
తపో మహిమ
పవిత్రం తే వితతం బ్రహ్మణస్పతే ప్రభుర్గాత్రాణి పర్యేషి విశ్వతః
అతప్తతనూర్న దామో అశ్నుతే శ్రుతాస ఇద్వహంతస్తత్సమాశత॥
భావం:- ఓ బ్రహ్మణస్పతీ భగవాన్! నీ పవిత్రమైన నియమం (శాసనం) వివ్వమంతటా వ్యాపించియుంది. సమస్త జీవుల శరీరాలలో నీవు సర్వ సమర్థంగా వ్యాపించియున్నావు. తపస్సుచేసి పరిపక్వత పొందని మనిషి బ్రహ్మణస్పతి అయిన ఆ దైవాన్ని దర్శించజాలడు. దృఢ నిశ్చయంతో తపస్సు నాచరించినవాడే ఆ బ్రహ్మణస్పతిని అనుసరించి ఉత్తమ భోగాలనునభవించగలడు.
వివరణ:- భగవంతుని పవిత్ర శాసనం సర్వత్ర వ్యాపించియుంది. ఆయన మనలో ప్రతి అంశంలో వ్యాపించియున్నాడు. కాని ఆయన దర్శనం మాత్రం మనకు కలగటం లేదు. ఎందుకంటె ‘అతప్త తనూర్న తదామో అశ్నుతే’ తపమాచరింపజాలని దుర్బల శరీరులు, అపరిపక్వబుద్ధులైన మానవులు భగవానుని సర్వవ్యాపకమైన పవిత్రతను పొందలేకున్నారు’’. అగ్నితప్తమై పరిశుద్ధమైనదే బంగారం. అదే విధంగా తపస్సు అనే అగ్నిలో తపింపబడకుంటె ఆ మనిషి భగవత్ప్రాప్తిని ఎలా పొందగలడు? పచ్చికుండలో నీరు నిలవదు. నీరు నిలవాలంటె కుండ కాల్చబడాలి. అదే విధంగా భగవదనుభూతిని పొందాలంటె శరీరం తపింపబడాలి. అలా తపస్సుచేత పరిశుద్ధమూ, పరిపక్వతనూ పొందిన ఆత్మ బ్రహ్మానందానుభూతిని పొందేందుకు అర్హవౌతుంది. తపోమహిమను గురించి వేద మీ విధంగా వర్ణిస్తూంది. కాబట్టి-
తపసా యే అనాధృష్యాస్తపసా యే స్వర్యయుః
తపో యే చక్రిరే మహస్తాంశ్చిదేవాపి గచ్ఛతాత్‌॥
భావం:- తపస్వులు నిర్భయులు. తపస్సుచేత బ్రహ్మానందాన్ని పొందినవారే మహాతపస్వులు. వారికే భగవత్ప్రాప్తి కలుగుతుంది. వేదమంటితో సంతృప్తి చెందలేదు.
యే చిత్పూర్వ ఋతసాప ఋతావాన ఋతావృధః
పిత్రూన్ తపస్వతో యమ తాంశ్చిదేవాపి గచ్ఛితాత్‌॥
‘‘ఓ సర్వనియామకా! ఎవరు ఋతంతో సంబంధం కలిగి- ఋతాన్ని సమాదరించి ఋతాన్ని సమృద్ధం చేస్తూ ఉంటారో, ఎవరు జ్ఞానులో, ఎవరు తపస్వులో, వారిని కూడ నీవు పొందుము’’ అని దైవాన్ని ప్రార్థించింది.
ఈ రీతిగా వేద శాస్త్ల్రాలో తపోమహిమ ఎంతో విస్తారంగా వర్ణింపబడింది. తపస్వి ముందు అందరు అణిగిమణిగి ఉంటారు. ఎవరు కూడ తపస్వుల ముందు తలయెత్తజాలరు. తపమంటె జ్ఞానపూర్వక కర్మానుష్ఠానమే. దీనిని గురించి తైత్తిరీయోపనిత్తులో ఈ క్రింది విధంగా వివరింపబడింది.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు