స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-157

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సదుపదేశానికి అధికారి ఎవరు?
య శ్చికేత స సుక్రతు ర్దేవత్రా స బ్రవీతు నః
వరుణో యస్య దర్శతో మిత్రో వా వనతే గిరః॥ ఋ.5-65-1॥
భావం:- ఎవడు జ్ఞానియో, ఎవనికి దైవమే ఆదర్శమో, ఎవని మాటలను భగవానుడు కూడ సమాదరిస్తాడో అతడే సత్కర్మల నాచరించినవాడు. అతడే మాకు దేవతలను లేదా సజ్జనులను గురించి ఉపదేశించుగాక!
వివరణ:- వేదం ఆచరణకు ప్రాముఖ్యతనిస్తుంది. ప్రపంచంలోని అన్ని మత గ్రంథాలు మరియు సంప్రదాయ గ్రంథాలు మతవిశ్వాసానికి అగ్రస్థానమిస్తున్నాయి. కాని ఆ గ్రంథాల వలె వేదం ఆచరణకు ఇచ్చినంత అత్యధిక ప్రాధాన్యం మతవిశ్వాసానికి ఇవ్వదు. వేదాలలోని ఈ స్పృహ పురాణాలలో కూడ కనబడుతుంది. ‘ఆచార హీనం న పునంతి వేదాః’ మహాభారతం వనపర్వం 313-117 ‘‘ఆచారహీనుణ్ణి వేదాలు కూడ పవిత్రం చేయవు’’అన్న ఎన్నో వాక్యాలీ విషయానే్న సమర్థిస్తాయి. వాస్తవానికి వేదాలు పవిత్రగ్రంథాలు. వాని నధ్యయనంచేసిన వారిని పవిత్రులుగాచేసే శక్తివంతమైనవి. కాని పై మహాభారతంలోని ‘ఆచారహీన...వేదాః’అన్న వాక్యాలను పోలిన పురాణగ్రంథ వాక్యాలు మనుష్యులను పవిత్రంచేసే వేదాల యోగ్యతను గూర్చి వ్యర్థాలాపాలుగా పైకి కనబడతాయి. కాని అది వాస్తవమా? కాదు. కాదు. నాలుగు వేదాలను పైనుండి క్రిందికి, క్రిందినుండి పైకి సుస్వరంగా అప్పగించగలవారు ప్రతి మంత్రానికి గొప్ప గొప్ప వ్యాఖ్యానం చేయగలవారు లోకంలో ఎందరో ఉన్నారు. కాని ఆ వేదం చెప్పిన ధర్మాలలో ఒక్క దానిని కూడ జీవితంలో ఆచరించేవారెందరు? అట్టివారిని వేదమేమి చేస్తుంది? వేదం చెప్పగలదుగాని ఆచరింపచేయలేదు గదా. ఆచరించవలసింది మనిషి చేయవలసిన పని. మనిషి చేయవలసిన ఈ కర్తవ్యాన్ని ఉద్దేశించియే మనుధర్మశాస్త్ర కర్త-
ఆచారః పరమో ధర్మః శ్రుత్యుక్తః స్మార్త ఏవచ
‘‘శ్రుతులు- స్మృతులలో నిర్దేశింపబడిన ఆచారమే ధర్మం’’అని స్పష్టంగా ఆచరణ గురించి పేర్కొన్నాడు. దీనినిబట్టి వేదంలో ఆచారమే ముఖ్యధర్మం. తదాచరణమే యజ్ఞంగా వేదాలలో ఎన్నోచోట్ల నొక్కివక్కాణించడం కనబడుతుంది.
ఇక ఈ మంత్రం అట్టి వేద ధర్పోపదేశాధికార మెవరికుందో సూచిస్తూ నాలుగు అంశాలను వివరించింది. చూడండి.
యశ్చికేత:- ‘‘ఎవడు తెలుసుకొంటాడో’’. అన్ని తెలుసుకొన్నవానికే ఇతరులకు బోధించే అధికారముంటుంది. తెలియనివాడు, తెలిసీ తెలియనివాడు, అన్నీ నాకే తెలుసునని అహంకరించినవాడు ఇతరులకు బోధించలేదు సరికదా వారిని భ్రాంతమనస్కులను చేస్తాడు.
స సుక్రతు:- ప్రబోధకుడు ముందుగా సత్కర్మాచరణుడు కావాలి. అంటే డాంబికతతోకాక చెప్పిన దానిని తాను ఆచరించేవాడుగా ఉండాలి.
వరుణో యస్య దర్శనః:- సర్వ శ్రేష్ఠుడైన భగవంతుడే (వరుణుడు) తన జీవితానికి ఆదర్శంగాకలవాడుగా ఉండాలి. మనిషి ఎప్పుడావిధంగా కాగలడు? అంటే తాను చేసే ప్రతి కార్యం, ప్రతి ఆలోచన భగవంతుని ముఖం చూచి చేసేవాడుగా అయినప్పుడు మాత్రమే. ఈ విధంగా నడుచుకొనేవాని మాటలోగాని చేష్టలోగాని మోసం లేదా భ్రమ ఉండదు.
మిత్రో వా వనతే గిరః:- స్నేహశీలి అయిన భగవానుడే ఎవని మాటను తన కాజ్ఞగా శిరసావహిస్తాడో అట్టి మాననీయుడుగా ఉండాలి.
ఈ విషయాన్ని స్పష్టంచేస్తూ ఋగ్వేదంలో ఒక ప్రార్థనా మంత్రంలో-
‘సథేవ సఖ్యే గాతువిత్తమో భవ’ (ఋ.9-104-5) ‘‘ఓ ప్రభూ! నీవు నాకు మిత్రుడవు. నీ మిత్రుడవైన నాకంటె నీవు మహాజ్ఞానివి’’ ఈ ప్రార్థనలో మిత్రుడవైన నా అవసరాన్ని నీకు తెలుసు. నీవు నా విన్నపాలను వింటావు. సఫలం చేస్తావు అన్న మిత్రధర్మం కూడ పరోక్షంగా సూచింపబడింది.
ఈ విధంగా ఈ మంత్రం ఉపదేశకుడు సర్వజ్ఞుడు, సదాచార తత్పరుడు, ఈశ్వరునియందు భక్తివిశ్వాసాలు కలవాడు కావడమే ఆతని యోగ్యతలుగా నిర్దేశించింది. లోకంలో ఈ అర్హతలు లేనివారెందరో మహోపదేశకులై ఎంతెంతో ప్రఖ్యాతి వహిస్తున్నా వారి యుపదేశాలు శ్రోతల ఈవలి చెవినుండి ఆవలి చెవి గుండా బయటకు పోతాయి గాని అవి ఏ ఒక్కరిమీద సత్ప్రభావాన్ని చూపలేవు.
* * *
140. మిత్రుడు పాపం చేయకుండ రక్షిస్తాడు
మిత్రో అంహోశ్చిదాదురు క్షయాయ గాతుం వనతే
మిత్రస్య హి ప్రతూర్వతః సుమతిరస్తి విధతః॥ ఋ
భావం:- సర్వజీవులకు సహజమిత్రుడైన భగవంతుడు పాపులను వారి పాపాలనుండి రక్షించి వారు సుముఖంగా జీవించేందుకు విశాలమైన భూమిని కూడ ప్రదానంచేసాడు. అట్లే పాపులు సహితం పుణ్యాత్ములు కావడానికి అవసరమైన సద్బుద్ధి ఆ దయాళువైన పరమమిత్రుడైన పరమేశ్వరుని మహావరదానమే.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు