స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-155

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
వివరణ:- పాపకార్యాలను చేయకుండ హెచ్చరిస్తూ ఎల్లప్పుడు వెన్నంటి రక్షించే దయాకరమైన విధానమే దైవం మనతో మిత్రుడుగా ఉండి చూపే చెలిమిని తెలుపుతుంది. ఈ విషయానే్న స్పష్టంచేస్తూ ఋగ్వేదం (ఋ.7-86-7) ‘అచేతయదచితో దేవో అర్యః’ సర్వజ్ఞుడైన ‘‘పరమాత్మ జ్ఞానహీనులను (అచేతనులు)రక్షిస్తూ ఉంటాడు’’అని భగవత్కృపాళుత్వాన్ని శ్లాఘించింది. దైవకృప వలన పాపులకు తమ పాపాచరణకు పశ్చాత్తాపం మరియు జగత్పితరుని రక్షకత్వం ఎరుకలోనికి రాగానే ‘మిత్రో అంహోశ్చిత్... గాతుం వనతే’ పరమ మిత్రుడైన భగవానుని రక్షణ మరియు దయతో తాము నివసించేందుకిచ్చిన ఈ విశాల భూమిని తలవంచుకొని వివశుడై రోదిస్తూ-
క్వత్యాని నౌ సఖ్యా బభూవుః సచావహే యదవృకం పురా చిత్ (ఋ.7-88-5)
‘‘అరమరికలు (్భదభావాలు) లేక ఎంతో కలిసిమెలసియున్న మా ఐహిత పూర్వ స్నేహాలు నేడేమయ్యాయి?’’అని దేవుని ముందు శరణాగతుడవుతాడు. అయ్యో! మేమింతకాలమూ పాపాలు చేస్తూ చిరకాల మిత్రుడు, సర్వదా సహచరుడు అయిన భగవన్మిత్రుణ్ణి విడిచి పాపపంకిలంలో కూరుకుపోయాం అని పాపులు దుఃఖిస్తారు. చిత్రమేమంటే పశ్చాత్తాప జీవులకీ దుఃఖం పాపాచరణ వలన సహజంగా కలిగినదా? కాదు. పరమకృపాళువై సహజమిత్రుడైన పరమేశ్వరుడు వారిని ఉద్ధరించేందుకై అనుగ్రహించి ప్రసాదించిన సద్బుద్ధి ఫలితమే. ఈ సద్బుద్ధి ‘మిత్రస్య హి...విధతః’ శీఘ్రంగా అనుగ్రహించే విధాత వరప్రదానమే’’అని వేదం దైవపతితోద్ధరణత్వాన్ని కీర్తించింది.
చెలిమితో పాపులను సహితం సంరక్షించే భగవతత్త్వాన్ని ఆధునిక కాలంలో మహర్షి బిరుదాంచితులైన దయానంద సరస్వతి ఇలా వివరించారు.
ఆత్మ మనస్సును ఇంద్రియాలను దొంగతనం, వంచన, పరద్రోహం మొదలైన దుష్కర్మల ఎడల గాని అట్లే పరోపకారం మొదలయిన సత్కర్మల ఎడలగాని ప్రోత్సహించిన క్షణంలోనే జీవుని సమస్త జ్ఞానమూ తత్‌క్షణమే జనించే ఇచ్ఛ (కోరిక)కు వశమై దుష్కర్మ- సత్కర్మలలో ఏదో ఒకదానిని చేసేందుకు ఉద్యుక్తమైపోతుంది. కాని అదే క్షణంలో పాపాచరణవలన లజ్జ్భాయాలు పుణ్యకర్మాచరణవలన అభయం, నిశ్శంకత, ఆనందమూ మొదలైన భావాలు ఒక్కసారి ఉద్భవిస్తాయి. అవి నిజానికి జీవాత్మవలన కాక పరమాత్మ వలన జనింపచేయబడిన భావాలే. పరమాత్మ నిత్యమైన, సత్యమైన మిత్రుడు కాబట్టే పాపాచరణకు పూనుకొనబోతున్న మిత్రుడి (జీవుడికి) సద్బుద్ధిని ప్రసాదిస్తూ దుష్కర్మాచరణను నివారిస్తూ హెచ్చరిస్తూ ఉంటాడు. పరమేశ్వరుడు ఎవరికి శత్రువుకాడు. ఎవరి యెడల పరమేశ్వరుని వంటి మిత్రుడు లోకంలో ఎవరికి ఎన్నడూ ఉండడు.
సత్యార్థ ప్రకాశం. ప్రథమ సముల్లాసం.
పరమేశ్వరుడే ఉదాసీనుడయితే జీవులను ముఖ్యంగా పాప జీవుల సముద్ధరణ ఎన్నటికీ సంభవమేకాదు. భగవానుని చెలిమి కేవలం పాపులను ఉద్ధరించేందుకు మాత్రమే లోకంలోని మిత్రులందరూ ప్రయోజనాపేక్షులే. ఆ ప్రయోజనం సిద్ధించని క్షణంలో వారు ఉదాసీనులో లేదా శత్రువులో అవుతారు. కాని దైవం సర్వజీవులకు సహజమిత్రుడు. అందుకే ఆయన ఉదాసీనుడు గాని శత్రువుగాని కాడు.
***
స్వారాజ్యం కోసం ఆకాంక్ష
ఆ యద్వామీయచక్షసా మిత వయం చ సూరయః
వ్యచిష్ఠే బహుపాయ్యే యతేమహి స్వరాజ్యే
భావం: కోరదగిన జ్ఞానవంతులారా! పరస్పరమూ అభిమానించుకొనే స్ర్తి పురుషులారా! విద్వాంసులైన మీరు మేము కలిసి సర్వ విధాలుగా సంరక్షణీయమైన స్వర్గరాజ్యాభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేద్దాం.
వివరణ: తమ స్వేచ్ఛను ఎవరైనా నిరోధించేందుకు ఇష్టపడే ఏ చిన్న ప్రాణి కూడా ఈ సృష్టిలో ఉండదు. తమ స్వేచ్ఛ నిరాటంకంగా ఉండాలని అందరూ కోరుకొంటారు. వేదంలో మార్గం ‘అనృక్షరః’ కంటకరహితమై ఉండాలన్న ప్రార్థన ఒకటి కనబడుతుంది. బాధారహితమైన నిష్కంటకమార్గమే ప్రశస్తమైనది. అదేవిధంగా స్వారాజ్య (స్వర్గరాజ్యం) వాంఛ అస్వాభావికం కూడా కాదు. ఇతరుల స్వేచ్ఛను హరించేవానికి తన స్వేచ్ఛ నితరులు హరించినపుడా బాధ ఏమిటో అర్థమవుతుంది. వేదం స్వారాజ్య (దుఃఖ స్పర్శలేని గొప్ప స్వర్గరాజ్యం) భావనను విశేషంగా సమర్థిస్తుంది. ఋగ్వేదంలో స్వారాజ్యభావనను సమర్థించే ఒక గొప్ప ప్రత్యేక సూక్తమే చెప్పబడింది. ఇందులోని ‘అర్చన్నను స్వరాజ్యమ్’ స్వారాజ్యాన్ని కనుకూల కార్యాలను చేస్తూ అను మంత్రంలో స్వారాజ్య సంబంధమైన ఒకటి రెండు పదబంధాలీ మంత్రంలో కనబడతాయి. అవి చాలా జ్ఞప్తికి ఉంచుకొనదగినవి.
*
ఇంకావుంది...