స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-160

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తమ ఆసీత్ తమసా గూళ్హమగ్రే-ప్రకేతం సలితం సర్వమా ఇదమ్’
‘‘సృష్టికి పూర్వం గాఢాంధకారంతో ఆచ్ఛాదింపబడి యుండటంవలన సమస్తమూ గుప్తంగా ఉండిపోయింది. చలనశీల వస్తుజాలమంతా నిశే్చష్టమై రూపరహితమైపోయాయని వివరించింది.
మనస్మృతిలో దాదాపు ఈ మంత్రానికి అనువాదంగా ఈ వాక్యాలు కనబడతాయి.
ఆసీదిదం తమోభూతమప్రజ్ఞాతమ లక్షణమ్‌
అప్రతర్క్యమవిజ్ఞేయం ప్రసుప్త మివ సర్వతః॥ ‘‘ఈ సమస్త ప్రపంచమూ అంధకారంచేత గాఢంగా ఆవరింపబడియుంది. దానివలన ప్రత్యక్ష, అనుమాన, శబ్ద, అర్థాపత్తి మొ. ప్రమాణాలచేత అంతా అగమ్యగోచరమైయుంది. కారణం సర్వమూ ప్రసుప్తావస్థలో అంటే నిశ్చైతన్యావస్థలో ఉండిపోయింది’’. ఇక సృష్టికారంభంలో అన్నింటికన్న ముందుగా ‘అవిఃస్వరభవజ్జాతే అగ్నౌ’అగ్ని ఉద్భవించి దానినుండి ప్రకాశం వ్యాపించింది. ఈ అగ్ని ప్రాదుర్భావం తరువాతనే క్రమంగా సృష్టిరచనారంభం జరిగింది.
‘తస్య దేవాః పృథివీ ద్యౌరుతాపో- రణయ న్నోషధీః సఖ్యే అస్య’
‘‘ఈ మహా ఆగ్నేయ పిండ సహయోగంతో పృథివీ, ఆకాశమూ, జలమూ ఓషధులు జనించాయి. సూర్యునినుండి పృథివి వేరుగా ఏర్పడింది. వేల సంవత్సరాలు ఆ పృథివిపై రోకలిని పోలిన ధారలతో వర్షం కురిసింది. దానితో భూమి తడిసి ముద్దయింది. తదుపరి ఓషధులు, వనస్పతులు మొదలయినవి పుట్టాయి. వేదాలలో వర్ణిపబడిన ఈ సృష్టిక్రమానే్న నేడు వైజ్ఞానికులు కూడ అంగీకరిస్తున్నారు. వైజ్ఞానిక వేదాన్నిచూచి శాస్తవ్రేత్తలు బహుధాచకితులై శ్లాఘిస్తున్నారు.
***
143. అగ్ని భూమ్యాకాశాలను తపింపచేస్తుంది
యం దేవాసో జనయంతాగ్నిం యస్మిన్నాజుహవుర్భువనాని విశ్వా
సో అర్చిషా పృథివీం ద్యాముతే మామృజూయమానో అతపన్మహిత్వా॥
భావం:- దేవతలు అగ్నిని సృజించి అందులో సమస్త భువనాలను హవిస్సుగావేసి ఆహుతిచేసారు. అప్పుడా అగ్ని ఋజువుగా ప్రజ్వలించి తన మహత్వ పూర్ణమైన శక్తినుండి పుట్టిన తేజస్సుతో భూమ్యాకాశాలను తపింపచేసింది.
వివరణ:- సృష్ట్యారంభంలో దేవతలు అగ్నిని సృజించి దానియందు సమస్త భువనాలను హవిస్సుగా ఆహుతిచేసారు. అప్పుడు ఆ అగ్నినుండి గ్రహనక్షత్రాదులెన్నో ఉద్భవించాయి. దేవతలావిధంగా చేయకుంటె అవి ఎలా ఉద్భవిస్తాయి? ఈ భావానే్న దాదాపుగా ప్రకటిస్తూ మనుస్మృతి ఇలా వర్ణించింది.
తదా విశంతిభూతాని మహాంతి సహ కర్మభిః
మనశ్చావయవైః సూక్షైై్మః సర్వభూతకృదవ్యయమ్‌॥
‘‘శతాబ్ది పంచతన్మాత్రల రూపంలో ఉన్న ఆకాశాది పంచభూతాలు తమతమ కర్మలలో ఆత్మను ఆశ్రయిస్తున్నాయి. అట్లే మనస్సు తన సూక్ష్మకర్మలతో ఆత్మను ఆశ్రయించింది. ‘‘సృష్ట్యాదిన ప్రభవించిన అగ్ని ఎంత శక్తివంతమైనదంటె- ‘సో అర్చిషా...మహిత్వా’ ‘‘అది ఋజువుగా ప్రజ్జ్వరిల్లుతూ తన శక్తినుండి పుట్టిన ప్రకాశంచేత భూమ్యాకాశాలను తపింపచేసింది.’’ ఆవిధంగా కోట్ల మైళ్లదూరంలో ఉన్న అగ్ని భూమ్యాకాశాలను తపింపచేయడం సామాన్యమైన పనేమికాదు. ఆకాశమెంత పరిమాణముందో ఊహించడం మానవుడి ఊహకు అందేది కాదు. అగ్నిగోళమెంత మహత్తరమైనది! సమస్త సృష్టిని జనింపచేసిన దాని అపార శక్తిని గణించగలమా? సృష్టికి కారణమైన ఈ అగ్నికి సృష్టికర్తలు దేవతలే అని ఋగ్వేదమీమంత్రంలో చెప్పి సంతృప్తిపడలేదు. మరో సందర్భంలో-
‘స్తోమేన హి దివి దేవాసో అగ్ని మజీజనన్ శక్త్భి రోదసిప్రామ్’॥
‘‘దేవతలు సామూహికంగా ముల్లోకాలను వహించగల (సృష్టించగల) అగ్నిని ఆకాశంలో తమ మహత్తరశక్తితో జనింపచేసారు’’అని పునరుద్ఘాటించింది. ప్రకృతి ప్రథమకార్యం నింగిలో అగ్నిని సృష్టించడమే. అలా అది జనించి త్రిలోకాలలో వ్యాపించి సృష్టిరచనను నిర్వహిస్తుంది.
***
144. దైవాన్ని హృదయంలోనే పొందాలి
హస్తే దధానో నృమ్ణా విశ్వాన్యమే దేవాన్ధాద్ గుహా నిషీదన్‌
విదంతీమత్ర నరో ధియంధా హృదా యత్తష్టాన్మంత్రాన్ అశంసన్‌॥
భావం:- మానవులకు సదా ఉపయోగకరమైన ధనం- బలం సమస్త వస్తు జాలాన్ని తన స్వాధీనంలో పెట్టుకొని ఆ మానవుల హృదయమనే గుహలలో సదా నివసిస్తున్నాడు. ఆయన సమస్త దేవతలను తన యెడల భయభక్తులతో ఉండే విధంగా చేసికొన్నాడు.
హృదయ పూర్వకంగా వెలువడిన స్తుతులతో ఎవరు దైవాన్ని స్తుతిస్తారో ఆ ధ్యాన తత్పరులైన మానవులు తమ హృదయసీమలలోనే ఆ దైవదర్శనాన్ని పొందుతారు.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు