స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం -27

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
ఈ సందర్భంలోనే వేదప్రామాణ్యమెట్టిదో తెలుపుతూ ఋగ్వేద దశమ మండలంలోని జ్ఞానసూక్తం (71) వేదోత్పత్తిని గూర్చి వివరించింది. అందులో మొదటగా బృహస్పతి వేదోత్పత్తిని ప్రథమ మంత్రంలో వివరించి తదుపరి రెండవ మంత్రంలో సాధారణంగా అందరకు కలిగే ఒక సందేహానికి సమాధానాన్ని వివరించాడు. ముందుగా ఆ సందేహమేమంటే- దైవం మానవుడిని వేద విజ్ఞానాన్ని ఇచ్చినా దానిని ఆతడు పునశ్చరణ చేసే సమయంలో కారణాలేమయినా స్వయంగా ఏవేని కొన్నింటిని క్రొత్తగా చేర్చలేదు కదా? అని క్రింది మంత్రంలో దానికి సమాధానం చెప్పబడింది. ఆ మంత్రమిది
సక్తుమిప తిత ఉనా పునంతో యత్ర ధీరా మనసా వాచమక్రత
అత్రా సఖాయః సఖ్యాని జానతే భద్రైషాం లక్ష్మీర్నిహితాధి వాచి॥ ఋ.10-71-2.
మహర్షులు వేదమంత్రాలకు ద్రష్టలు. వారు ఉచ్ఛారణ చేసింది నోటితో అయినా వారి నోటినుండి వెలువడిన వేదవాణి బహిర్గతమైనది మాత్రం వారి హృదయం నుండియే. అందుకే జల్లించగా పొట్టుపోయిన శుద్ధమైన పేలపిండి వచ్చినట్లు వారి నోటినుండి మనసు అభివ్యక్తంచేసిన శుద్ధవేదమే ప్రకాశితమైనది. అంటే శుద్ధమైన ఆ వేదవాణి సఖి. పరమాత్మ సఖుడు. వారిద్దరి అన్యోన్య సంబంధాన్ని గుర్తించిన ఋషులు కల్యాణకారియైన వేదవాణికి సఖుడైన భగవంతునకు విరుద్ధం కాకుండా శుద్ధవేదవాణిని ప్రకాశపరచారు. ఆ విధంగా వేదర్షులు పరమాత్మ దత్తమైన జ్ఞానశక్తి చేతనే శుద్ధవేదవాణిని ప్రపంచానికి అందించారని సారాంశం.
20. వృద్ధుడు
యే అగ్నే నేరయంతి తే వృద్ధా ఉగ్రస్య శవసః
అప ద్వేషో అప హ్వరో- న్యవ్రతస్య సశ్చిరే॥ ఋ.5-20-2.
ప్రతిపదార్థం:- అగ్నే= దివ్యప్రకాశంగల పురుషుడా!; యః= ఎవరు; ఉగ్రస్య= తీవ్రమైన; శవసః= బలంకలవారో; అన్యవ్రతస్య= స్వధర్మంకంటె భిన్నమైన ధర్మాన్ని ఆచరించేవారి ఎడల; ద్వేషః= ద్వేషభావాన్ని; అప= విడిచిపెట్టెదరో; హ్వరః= దురాలోచనను (కుటిల భావాన్ని); అప+సశ్చిరే= మనస్సునుండి దూరంగా ఉంచుతారో; తాదృశ కార్యే= అట్టి సదాచరణయందు (అధ్యాహార్యం); స+ఈరయంతి= చలింపక స్థిరబుద్ధితో నిలిచియుందురో; తే=వారు; వృద్ధాః= వృద్ధులు లేదా పెద్దలు;
భావం:- ఓ దివ్యపురుషుడా! స్వధర్మంకంటె భిన్నమైన ధర్మాన్ని దృఢచిత్తంతో ఆచరిస్తూ ఆచరింపనివారి ఎడల ద్వేషాన్ని- కుటిల స్వభావాన్ని విడిచి వారివలన ఎన్ని కష్టాలు ఎదురయినా స్థిరచిత్తంతో వారి ఎడల ప్రేమభావన కలిగియుంటారో వారే వృద్ధులు- పెద్దలు
- సజ్జనులు.
వివరణ:- సాధారణంగా వయోవృద్ధుణ్ణి వృద్ధుడిగా అందరు భావిస్తారు. లోకంలో ఇలాంటి వృద్ధులెందరో ఉంటారు. ఈ వృద్ధత్వం అందరకు ప్రాప్తిస్తుంది. కాని వేదమట్టి వ్యక్తిని వృద్ధుడుగా ఆదరించలేదు.
నిజమైన వృద్ధుడెవరో ఈ మంత్రంలో వేదర్షి చర్చిస్తున్నాడు. లోకంలో అందరు వృద్ధుడని భావించేవానికంటె ఈ వేదప్రతిపాదిత వృద్ధుడు చాల విలక్షణమైన వ్యక్తి.

ఇంకావుంది...