స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-162

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవుని పదాలు అనగా సజీవంగా నిలిపి ఉంచే శరీరం, ఇంద్రియాలు, అంతఃకరణాలు మొదలైనవి. వీనిని రక్షించుమని చేసే ఇచటి ప్రార్థన చాలా విశిష్టమైనది. జ్ఞాన, కర్మ, ఇంద్రియాల అద్భుత రచనా విశేషం చేత, అనమాన ప్రమాణం చేత భగవంతుడు తెలియబడుతున్నాడు. అంతఃకరణలో (మనోబుద్ధ్యహంకార చిత్తాలలో) దైవ సాక్షాత్కారమే సిద్ధిస్తూ ఉంది. ఈ జ్ఞాన, కర్మ, ఇంద్రియాలకు, అంతఃకరణకు ఈ శరీరమాశ్రయం. ఇవన్నీ నశించితే దైవాన్ని దర్శించే మరే సాధనం లేదు. మనుషులవలె పశుపక్ష్యాదులకు మనస్సు సంపూర్ణంగా వికసించి యుండకపోవడం చేత భగవద్ధ్యానానికి గాని, జ్ఞానానికి గాని అవి అయోగ్యమైనవి. భగవద్ధ్యాన -జ్ఞానాలకు అనువైన సాధనం మానవ దేహమే. అందుకే ఈ దేహాన్ని రక్షించుమన్న ప్రార్థన ఇచట చేయబడింది.
భగవద్ధ్యానానికి అవసరమైన సామగ్రి ఏమీ లేదు. ఆ దైవం హృదయంలోనే ఉన్నాడు. దైవాన్ని హృదయంలో దర్శించిన మహాపురుషుడు ఆ దైవ ప్రకాశాన్ని తన హృదయం నుండి వేరొకరి హృదయంలోనికి ప్రసారం చేయగలడు అని వేదం ‘విశ్వాయు రగ్నే గుహా గుహంగాః’- సర్వజీవాధారుడైన జ్ఞానప్రకాశ స్వరూపుడైన ఆ దైవం ఒక హృదయంలో నుండి మరొక హృదయంలోనికి ప్రవేశిస్తున్నాడు అని స్పష్టంగా వచించింది. అంటే నీ హృదయాన్ని మహాత్ముల హృదయంతో అనుసంధానించు. ఆయననీకు నీ హృదయంలో దాగియున్న పరమాత్మ దర్శనాన్ని చేయిస్తాడు.
146. ఋతశీలికి దైవం సమసె్తైశ్వర్యాన్ని ముందుంచుతుంది
భావం:- తన హృదయమనే గుహలో నివసిస్తున్న భగవానుని తెలుసుకొన్న వానికి, సృష్టి నియమాలను పరిపూర్ణంగా తెలిసికొన్నవానికి, సృష్టినియమాలను (ఋతం) తెలిసికొని ఆచరించి భౌతిక బంధనాలనుండి విముక్తి పొందినవానికి, దైవం వెంటనే సత్యమైన ధనాన్ని గురించి ప్రబోధం చేస్తుంది.
వివరణ:- దైవముందని అందరూ నోటితో చెప్పేవారేగాని హృదయ పూర్వకంగా విశ్వసించేవారు మాత్రం చాల అరుదు. ఎవడు భగవానుణ్ణి నమ్మాడో ఎవడు నమ్మలేదో తెలుసుకొనేందుకు వేదం బంగారు నాణ్యతను కనుగొనే గీటురాయి పరీక్షను పేర్కొంటూంది. అదేమంటే ‘య ఈం చికేత... ధారామృతస్య’ ఎవడు తన హృదయమనే గుహలో నివసిస్తున్న సర్వేశ్వరుణ్ణి తెలుసుకోగలుగుతాడో, సనాతనమైన ఋతాన్ని (సృష్టి నియమాలను) గూర్చిన విచార స్రవంతిని పరిపూర్ణంగా కలిగియుంటాడో అతడే దైవ విశ్వాసి’’ అని.
అట్టి మానవుడు తానుచేసే చేష్టా- మాటలను సన్నిహితంగా ఉండి పరమాత్మ చూస్తూ ఉన్నాడని ఆయనకు తెలియకుండ దేనిని దాచడం సాధ్యంకాదని సదా జాగరూకుడై యుంటాడు. అట్టివాడిని పాపమే స్పృశించదు. ఆతడిలో పాపప్రవృత్తి జనించదు. భగవంతుడు సంకల్పించిన ఋతం (సృష్టినియమాలు) తెలిసికొని దానిని సదా ఆచరిస్తూ ఉంటాడు. అసలు ఋతం వలననే పరమాత్ముడు సర్వ దేవతలలో వ్యాపకుడై వారికి సర్వాధ్యక్షుడయ్యాడు. ‘దేవో దేవాన్ పరిభూర్ ఋతేన’ (ఋ.10-12-2) అని ఋగ్వేదం భగవత్తత్వమర్మాన్ని ఆవిష్కరించింది. కాబట్టి భగవంతుని విశ్వసించినవాడు ఋతాన్ని జీవితలక్ష్యంగా చేసుకొని జీవించాలి. అయితే కొందరు సర్వేశ్వరుణ్ణి అంగీకరిస్తారు. కాని ఆయన ఆదేశించిన సృష్టి నియమాలనాచరించక అవహేళన చేస్తే భగవంతుణ్ణి నమ్మి ఏమి లాభం పొందగలరు? అట్టివారికి అసలు మహాదైవం లేదనేవారికి భేదమేముంది? కాబట్టి జగత్ప్రభువును నమ్మి మానవుడు ‘వి యే చృతన్‌త్వృతా సపంతః’ ఋతాన్ని (సృష్టి నియమాలను)ఆచరిస్తూ భౌతిక జన్మసంసారబంధాల నుండి విముక్తిని పొందే మహాప్రయోజనాన్ని పొందవచ్చు. అట్టి ప్రయోజనాన్ని పొందినవాడు తననుతాను భగవదర్పణం చేసికొన్నవాడే కాగలడు. అట్టివానికి దైవమనే ‘ఆదిద్వసూని ప్ర వవాచాస్మై’ ‘సమస్త దిక్కులనుండి సత్కమైన ధన స్వరూపాలను తత్‌క్షణమే తెలియపలుకుతాడు’’ ఈ విధంగా మహదైశ్వరాన్ని పొందిన వానిని ప్రశంసిస్తూ ఋగ్వేదం ‘ఋతేన సత్యమృతసాప ఆయన్’ (ఋ.7-56-12) ‘ఋతాన్ని ఆచరించేవాడు ఋతం ద్వారానే నిత్య సత్యజ్ఞానాన్ని పొందగలడు’’అని స్పష్టంచేసింది. ఆ విధంగా ఋతపాలన ద్వారా భగవత్ప్రాప్తిని పొందిన వాని సమక్షంలో సర్వేశ్వరుడు తన సమస్త అష్టైశ్వర్య నిధిని తెరచి ఉంచుతాడు.
**
147. తండ్రిగా తన ననుసరించే వానికై దైవం ధననిధి ద్వారాలు తెరుస్తుంది
పితుర్న పుత్రాః క్రతుం జుషంత శ్రోషనే్య అస్య శాసం తురాసః
వి రాయ ఔర్ణోద్దురః పురుక్షుః పిపేశ నాకం స్తృభిర్దమూనాః॥
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512