స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-167

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివరణ:- సదాశ్రయాన్ని కోరిన మనిషి లోకమంతా తిరుగుతూ తిరుగుతూ ఒక ఆశ్రయాన్ని పొందాడు. కాని కొంతకాలానికే అతడికి అందులో లోపాలు కనబడసాగాయి. దోషాలు లేని ఆశ్రయంకోసం దానిని వెంటనే విడిచి మరల లోకమంతా తిరుగసాగాడు. చివరకాతనికి బంధువులు, చుట్టాలు, మిత్రులు, భార్యాపుత్రులు, మాతాపితలు ఇలా అందరూ వ్యర్థమైన గడ్డిబొమ్మల్లా కనబడ్డారు. దిక్కుతోచక సదాశ్రయం దొరకక ఆర్తుడై ‘అయమగ్నే జరితా... నహ్యన్యదస్త్యాప్యమ్’ ‘‘ఓ ప్రభూ! నిన్ను స్తుతించే ఈ స్తోత (్భక్తుడు) నీ ఆశ్రయంకోరి వచ్చాడు. బలవంతులను కూడ నియంత్రించే సర్వనియామకా! నీవు తప్ప జీవితంలో పొందదగిన వాడెవడూ లేడు’’అని శరణాగతి చేసాడు. ఇది ఎంతో సహేతుకం. ఎందుకంటె భగవంతుడికంటె మించిన నిజమైన మిత్రుడు, బంధువు, తల్లి, తండ్రి మరెవ్వరూ లేరు. శుక్ల యజుర్వేదం ఇదే విషయాన్ని ‘స నో బంధు ర్జనితా స విధాతా’ (శు.య.వే.32-10) ‘‘ఆ దైవమే మా ప్రభువు, బంధువు, జనితా= తల్లి- తండ్రి. ఆయనే సర్వసృష్టికర్త అని సూటిగా పేర్కొంది.
సర్వశక్తిమంతుడైన భగవదాశ్రయమే లభిస్తే ఇక కావలసినదేముంటుంది? ఇట్టి మహదాశ్రయాన్ని పొందిన స్తోత(్భక్తుడు) ‘్భద్రత హి శర్మ త్రివరూథమస్తి తే’ ‘‘నీ ఆశ్రయం జడమైన ప్రకృతి, చైతన్యవంతుడైన జీవుడు, పరమాత్మ అనే త్రివిధ ఆశ్రయాలకంటె మిన్న’’అని మనస్ఫూర్తిగ కీర్తిస్తాడు. జడప్రకృతిని ఆశ్రయించిన జీవుడికి తానుముందుగా ఎంతో కోల్పోయిన విషయం తెలియదు. అంతేకాక ఆ విషయం తెలిసిన తాను కోల్పోయిన దానినంతా జడ ప్రకృతినుండి పొందలేడు. జీవుడు వివేకవంతుడే అయినా ప్రకృతి నాశ్రయిస్తే తాను స్వామినని, ప్రకృతి భృత్యువు అన్న విషయాన్ని మరచిపోతాడు. చైతన్యవంతుడైన జీవుడి కంటె జడప్రకృతి అధమమే. కారణం దానియందు స్వయం సిద్ధమైన క్రియ, చేష్ట, గతి అనేవి వుండవు. కాబట్టి జడ ప్రకృతి నాశ్రయించిన జీవుడికి మరణమే తథ్యం.
ఇక రెండవ ఆశ్రయమైన చైతన్యవంతుడైన జీవుడు. జడప్రకృతికంటె ఈ ఆశ్రయం సర్వోత్కృష్టమైనది. సంధ్యామంత్రాలలో చైతన్యవంతుడైన జీవుడు ప్రకృతికంటె శ్రేష్ఠుడు. ‘ఉద్వయం తమసస్పరి స్వఃపశ్యంత ఉత్తరమ్’ (అథ.7-55-7) ‘‘చైతన్యవంతుడైన జీవుడు అంధకారమయమైన ప్రకృతినుండి పైకి లేచి సర్వోత్తమమైన ఆత్మ ప్రకాశదర్శనం చేస్తాడు’’ అని స్పష్టం చేయబడింది. జీవుడికి అనాదిగా ఉన్న గుణాలలో ఒక విశేషముంది. ప్రత్యక్షంగా ఉన్నవానిలో ఏది శ్రేష్ఠమైనదో ఏదికాదో పరిశీలిస్తాడు. తానాశ్రయించిన దానికన్న అధిక గుణవంతమైనది కనబడినంతనే ముందు దానిని అతడు పరిత్యజిస్తాడు. అదికూడ తనకు సంతృప్తినీయకుంటె మరో ఉత్తమమైన దానిని అనే్వషిస్తాడు.
అంతిమంగా ఆ జీవుడి అనే్వషణార్తిని శాంతింపచేసే పరమాత్మయొక్క తృతీయ ఆశ్రయం లభించినంతనే ఆత్మరతుడై భద్రం హి శర్మ త్రివరూథమస్తితే ‘‘త్రివిధాశ్రయాలలో నీ ఆశ్రయమేన సర్వశ్రేష్ఠం’’అని కీర్తిస్తాడు.
చిత్రమేమంటే అల్పజ్ఞాతా కారణంగా జీవుడు ఉత్తమమైన పరమాత్మ ఆశ్రయాన్ని పొందినా దానిని ఎంతోకాలం నిలుపుకోలేడు. అతడిమీద కామక్రోధాది శత్రువులు సర్వదా దాడిచేస్తూనే ఉంటాయి. వాటి వజ్రసదృశమైన ప్రహారాలతో త్రివిధాశ్రయాలలో మిన్నఅయిన భగవదాశ్రయాన్ని కూడ కోల్పోతాడు. అయినా సహజంగా చేతనాశీలుడు కావడంవలన జీవుడు ఆప్య=ఆత్మబంధువైన పరమాత్మను ‘ఆరే హింసానామప దిద్యుమా కృధి’ హింసాపరుల వజ్రాయుధాన్ని నాకు దూరంగా ఉంచు’’ అని ప్రార్థిస్తాడు. హింసకులంటే కామక్రోధాది శత్రువులే. వారి వజ్రఘాతాల బారినుండి ఆత్మరక్షింపబడితే ఆత్మకు ఉత్తరోత్తరాభివృద్ధి కలుగుతుంది. అంటే భగవదాశ్రయాన్ని పొందిన జీవుడు ప్రస్తుతంగాకాక సావధానుడై ‘అయమగ్నే జరితా... న్యదస్త్యాప్యమ్’అంటూ సర్వదా భగవంతునకు శరణాగతుడు కావాలి. జీవన గతమైన సహజ దుర్బలతను పరమాత్మునితో విన్నవించుకోవాలి.
153. దైవం కష్టించి సేవించే వాణ్ణి రక్షిస్తుంది
యస్త ఇధ్మం జభరత్సిష్విదానో మూర్ధానం వా తతపతే త్వాయా
భువస్తస్య స్వతవాన్ పాయురగ్నే విశ్వస్మాత్సీమఘాయత ఉరుష్య॥
ఋ.4-2-6.
భావం:- సర్వరక్షకుడవైన ఓ అగ్నీ! మిక్కిలి శ్రమపడి చెమటలు క్రక్కుతూ ఎవడు నీ కొఱకై సమిధలను తీసుకొని వస్తాడో లేదా నీకు చెందిన జ్ఞానాన్ని కలిగియుంటాడో లేదా నినే్న కోరి తన శిరస్సును (ఆలోచనలతో) తపింపచేస్తాడో అతడికి స్వయంశక్తియుతుడవై రక్షకుడవవుతున్నావు. అతడికి అపకారం చేసేవారినుండి నీవు అతడిని సదా రక్షిస్తున్నావు.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు