స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-171

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయితే అట్టి అంధ తమ సాకృత లోకాలలో పడినవారికి దైవానుగ్రహంవలన ఏనాడో వారు చేసిన పుణ్యకర్మ ఫల లవలేశాలు జాగృతమయితే ‘దోషాఃశివఃసహసః సూనో అగ్నే యం దేవ ఆ చి త్సచసే స్వస్తి’ ‘‘ఓ మహాబలాగ్రణీ భగవాన్! వారివద్దకు దయతో దరిచేరే శివస్వరూపులు మీరే’’అని ప్రతి మంత్రం వారికి స్వాంతన పలికింది.
ఈ మంత్రంలో మరొక ముఖ్య సంకేతం కూడ ఉంది. ధ్యానం రాత్రి సమయంలోనే జరగాలి. అప్పుడు నిశ్శబ్దమంతట గాఢంగా వ్యాపించియుంటుంది. ఆ సమయంలో దైవం సాధకుని చేరి జ్ఞానజ్యోతిని చూపుతుంది. దైవం ధ్యానంలో రాగానే సాధకునిలోని అమతి= నాస్తికత్వాన్ని తొలగించివేస్తుంది. అలా జరిగినంతనే సాధకునిలో నకారాత్మక భావాలకు (వ్యతిరేక భావాలకు) తావే యుండదు. సమస్త పాపాలకు మూలం నాస్తికతయే. భగవంతుని అస్తిత్వమూ, న్యాయశీలత, కర్మఫల ప్రదాతృత్వాలపై అచంచల విశ్వాసం లేనివాడికి పాపపంకిల కూపంలో పతనం తప్పదు. అందుచేతనే ధ్యానంలో దైవం ప్రవేశించిన వాడికి ‘అమతి’ వినాశనమేగాక పాపచింతన కూడ దరిజేరదు. దానివలన ధ్యాననిష్ఠుని మదిలో పాప సంబంధ సంస్కారాలు కూడ తలెత్తవు. ఆ విధంగా దైవం సాధకుని ఎడల కృపావీక్షణాన్ని సారించి అనుగ్రహిస్తుంది.
**
158. మహా సౌభాగ్య సాధనకు నీ శక్తిని వినియోగించు
అగ్నే శర్ధ మహతే సౌభగాయ తవ ద్యుమ్నాన్యుత్తమాని సంతు
సం జాస్పత్యం సుయమమా కృణుష్వ శత్రూయతామభి తిష్ఠా మహాంసి॥ ఋ.5-28-3.
భావం:- ఓ అగ్నీ! మా సౌభాగ్యానికి నీవు నీ బలాన్ని అనుసంధానం చేయి. అది నీ కీర్తిని మహోన్నతంగా వృద్ధిపరచుగాక! భార్యాభర్తల సంబంధం శుభకరంగా, పరస్పర సహకారయుతంగా, నియంత్రణగా ఉండే రీతిగా చేయి. మా యెడల శత్రుత్వం వహించేవారి బలాన్ని అణచివేసి వారిని నీవు నీ అదుపులో ఉంచుకొనుము.
వివరణ:- మానవులు కొద్దియో పని చేసే వారికి ఎంతోకొంత బలమవసరం. మరి ఆ బలం దేనికి వినియోగించాలో వేదం ‘అగ్నే శర్ధమహతే సౌభగాయ’ ‘‘ఓ జ్ఞానీ! బ మహాసౌభాగ్యంకోసమే నీవు నీ బలాన్ని ఉపయోగించు’’ అని హెచ్చరిస్తూంది. ఈ విషయానే్న పునరుద్ఘాటిస్తూ ఋగ్వేదము మరొక సందర్భంలో ‘ఉచ్ఛ్రయస్వ మహతే సౌభగాయ’ (ఋ.3-8-2) ‘‘మహాసౌభాగ్యంకోసం ఉద్యమించు లేదా ఉన్నతమైన దానిని ఆశ్రయించు’’మని చెప్పింది. నీకంటె గొప్పదాన్ని లేదా గొప్పవారి సహకారం పొందాలనుకొంటే ఒక గొప్ప ఆదర్శసాధనకోసమే పొందు. అలాచేస్తే ‘తవ ద్యుమ్నాని ఉత్తమాని సంతు’ ‘‘నీ కీర్తి శోభిస్తుంది’’. సౌభాగ్యశాలి కీర్తి శోభస్కరం కాకుండా మరోలా ఉండదు కదా!
చిత్రమేమంటే సౌభాగ్యప్రాప్తి ననుసరించి పతనప్రాప్తి అనే ప్రమాదం కూడ పొంచియుంది. అదే విలాసం. విలాసం వినాశ సహచరి. విలాసాన్ని కోరకో వినాశనం కోరకుండానే నీ చెంతకు చేరుతుంది. విలాసం రూపనాశనం, సంపత్తి నాశనం, తేజోనాశనం. కీర్తి నాశనం ఇలా ఎన్నో వినాశనాలను వెంట తీసుకొని వస్తుంది. ఈ అన్నింటిని సమీక్షించి వేదం ‘సం జాస్పత్యం సుయమమా కృణుష్వ’ ‘‘దాంపత్య జీవితాన్ని సంయమనంతో గడుపు’’ అని మానవ సమాజాన్ని సావధానపరుస్తూంది. వివాహ ప్రధానోద్దేశ్యం కామోపభోగం కాదు. ఉత్తమ సంతానప్రాప్తియే. భోగానుభవం కేవలమా సంతానప్రాప్తి పర్యంతమే. వివాహ ప్రధానోద్దేశ్యం సఫలంకాకపోతే అంటే సంతానప్రాప్తి కాకుంటే దానికోసం ఆచరించబడిన భోగం దూషిత మవుతుంది. కాబట్టి దాంపత్య ధర్మాన్ని దూషితం చేయవద్దని వేదం శాసిస్తూంది. వివాహ పద్ధతిద్వారా విలాసాన్ని- భోగాన్ని అనుభవించేందుకు వేదం అనుమతినిచ్చింది. కాని ఆ దాంపత్య ధర్మం ద్వారా సత్సంతానాన్ని పొంది పవిత్రమైన, ఉన్నత, ఆదర్శ సమాజ నిర్మాణాభివృద్ధికి తోడ్పడేటందుకు మాత్రమే.
వివాహపరంగా ఇంతటి మహోన్నత ఆదర్శభావన వేదాలలో ఉన్నంతగా ప్రపంచంలో మరెచ్చటకానరాదు. వైవాహిక జీవితం నిజంగా ఒక గొప్ప సామ్రాజ్యం. సాధారణ రాజ్యంలోవలెనే ఈ గృహస్థాశ్రమ సామ్రాజ్యంలో కూడ కష్ట-నష్టాలు ఉంటాయి. అయినా వాని యెడల ఉదాసీనంగా ఉండక ‘శత్రూయతామభి తిష్ఠా మహాంసి’ ‘‘శక్తివంతుడవై నీ శత్రువులను నిర్జంచు’’అని భగవంతుడీ మంత్రంద్వారా ధైర్యవచనంతో ప్రోత్సహపరుస్తున్నాడు. విలాసాల ఎడల అభిముఖ్యం కలవాడు ఆ విధంగా దైవోపదేశాన్ని ఆచరించలేక జీవితంలో పరాజితుడవుతాడు.

ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు