స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-189

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ ప్రభూ! నీవు సమస్త జీవులకు పోషకుడవని చెబుతారు. అలా ఎందుకు చెబుతున్నారు? నేనాకలితో చచ్చిపోతున్నా. నీ వెవరిని రక్షిస్తూ ఉన్నావు? అందరిని కదా. మరి ననే్నల రక్షింపవు? ఆకలి మరణానికి నన్ను నీవు వదిలివేసావు. నాపై నీ కేల దయరాదు? ఓ సంరక్షకా! ‘శిశయం త్వా శ్రుణోమి’ ‘‘నీవు వెంటనే సంరక్షించేవాడవని విన్నాను’’ నేను అలసుడను. ఆపద వచ్చినపుడు చింతింపవచ్చునులేనని సోమరిగా ఉండే దీర్ఘసూత్రుడను. నీవో! కనురెప్పపాటులో ప్రళయాన్ని సృష్టింపగల సమర్థుడవు. నాకు యుగాలు గడిచిపోయాయి. నీ పరంధామంనుండి నేనీ లోకంలోనికి వచ్చి ఎన్ని యుగాలు గడచిపోయాయో! ఎన్ని కల్పాలు గతించిపోయాయో! కాని నీ పరంధామానికి తిరిగి చేరుకోలేకపోయాను. చివరకు నేనా మార్గంలో నడుస్తున్నానో లేదో కూడ నాకు తెలియదు. ఓ జగత్పిత! ‘శిశీహి మా’ ‘‘నాకు శక్తినిమ్ము’’ నీవు నాకు మంచి బుద్ధిని కూడ ఇచ్చావు. దానిని వినియోగించి ఏమీ పొందలేకపోయాను. కాబట్టి ‘అప్నస్వతీ మమ ధీరస్తు శక్ర’ ‘‘ఓ శక్తిశాలీ! భగవాన్! నా బుద్ధిని సత్కర్మకు సుముఖంగా వెంటనే చేయి’’ నీకు కర్మమార్గం ఇష్టమని విన్నాను. నన్నా కర్మమార్గంలో పెట్టు. కాని ఏది సుకర్మయో ఏది దుష్కర్మయో నీవే ప్రబోధించు. దానివలన దుష్కర్మనాచరించి నీ ఆగ్రహానికి గురికాకుండా ఉంటాను.
ఓ అష్వైశ్వర్య సంపన్నుడా! నా జీవిత సౌఖ్యానికి ధనమెంతో అవసరం. కాని నీవు ‘్ధనం న స్పంద్రం బహుళమ్’ ‘‘్ధనం అత్యంత చంచలం’’అన్న భ్రాంతిని కలిగించి భయపెట్టావు. కాని ధనకాంక్షనుమాత్రం పోగొట్టలేదు. అందువలన ఓ మహాదేవా! ‘వసువిదం భగమింద్రా భరా నః’ ‘‘్ధనాన్నిపొందే సౌభాగ్యాన్ని మాకిమ్ము’’ నా కొక్కడికే కాదు. అందరకూ ఇమ్ము. ఓ ప్రభూ! నీవు భక్తుల పాలిట కల్పవృక్షమవు. ‘కృధీ ధియం జరిత్రే వాజరత్నామ్’ ‘‘్భక్తులకు నీవే జ్ఞాన ధనమైయున్నావు’ కాబట్టి జ్ఞానధనాన్ని భక్తులకు నీవే అనుగ్రహించు. మా అందరకు ఆ జ్ఞాన ధనమే కావాలి. ఓ జ్ఞాననిధీ! భక్తులకు నీవు జ్ఞాన ధనాన్ని ప్రదానంచేసినా అది ఎన్నటికి తరగదు. నిండుగానే ఉంటుంది.
**
పరమాత్మకు ప్రేమ పాత్రులు
న తం జినంతి బహవో న దభ్రా ఉర్వస్మా అదితి. శర్మ యంసత్‌
ప్రియః సుకృత్ప్రియ ఇంద్రే మనాయుఃప్రియః సుప్రావీః ప్రియో అస్య సోమ॥
భావం:- సత్కర్మాచరణుడు, నిరంతర దైవధ్యాన తత్పరుడు, సర్వజీవ సంరక్షకుడు, శాంతశీలుడు అయినవాడే భగవంతునకు ప్రియమైనవాడు. అట్టివానికి జగన్మాత భూలోకంలో చిరకాల సుఖజీవన సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఎంతమంది కూడినా అట్టివానికి కించిత్తు అపకారాన్ని చేయజాలరు.
వివరణ:- లోకంలో అందరు భగవంతుడు తన ఎడల సంప్రీతుడై అనుగ్రహించాలని కోరుకొంటారు. కాని ఆయనావిధంగా తన ఎడల ప్రీతి జనించే సద్గుణాలేమైనా తనలో ఉన్నాయా? అని ఆత్మవిమర్శ చేసుకోరు. ప్రస్తుత మంత్రం తన ఎడల దైవానికి సంప్రీతి కలగాలంటే ముఖ్యంగా ఉండవలసిన సద్గుణాలేమిటో వివరిస్తూంది. అవి 1.సుకృత్ 2. మనాయు. 3. సుప్రావీ. 4. సోమీ.
సుకృత్:- సత్కర్మల నాచరించేవాడు సుకృత్తు. దైవమే స్వయంగా సత్కర్మాచరణశీలి. ‘సమానశీల వ్యసనేషు సఖ్యమ్’ ‘‘ఒకే శీలంగలవారి మధ్యగాని ఒకే ఆపద నెదుర్కొనేవారి మధ్యగాని మిత్రత్వమేర్పడుతుంది’’ అన్న వచనానుసారం సత్కర్మాచరణశీలి (స్వపాః) అయిన సర్వేశ్వరుడితో సుకృత్తు అయినవానికిగాక దుష్కృతుడికి మిత్రత్వం గాని, ప్రీతిగాని ఎలా ఏర్పడుతుంది? ఋతగామి అయినవానితోనే పరమాత్మకు సఖ్యం లేదా ప్రతి ఉంటుందని-
ఋతస్య పంథాం న తరంతి దుష్కృతః
‘‘ఋతమార్గాన్ని (సృష్టినియమాలు, శాసనాలు, ధర్మాలు) దుష్కర్ములు అనుసరించరు’’అన్న ఋగ్వేద వచనానుసారం సుకర్ములతో గాక దుష్కర్మలతో పరమాత్మకు సఖ్యంగా ప్రీతిగాని కలుగదు. కాబట్టి సుకృత్తు= సత్కర్మశీలుని ఎడల మాత్రమే భగవత్ప్రీతి జనిస్తుంది.
మనాయుః:- సదా భగవత్ స్మరణచేయువాడే మనాయువు. అతడియందు కలిగే ప్రీతి కలలోనైన దైవచింతన చేయని మూఢమతి ఎడల భగవంతుని కేవిధంగా జనిస్తుంది? భగవచ్చింతన ఎవరికైనా భగవత్క్థాశ్రవణం తరువాతనే కలుగుతుంది. శ్రవణమే చేయనివాడు ఎవరిని గురించి చింతన చేస్తాడు? దైవకథాశ్రవణం దైవచింతనకు ప్రేరణ కలిగిస్తుంది. అట్టి దైవచింతనుని ఎడల పరమాత్మకు సంప్రీతి జనిస్తుంది. అది ఆ జీవుని ఆత్మోద్ధరణకు దోహదపడుతుంది.
సుప్రావీః:- సర్వజీవులు భగవత్ప్రతిరూపాలన్న ఉదారాశయంతో వారికి సేవ చేసేవాడు సుప్రావి. ఎవరైనా సుప్రావియై భగవత్ప్రీతిపాత్రుడు కావాలని వాంఛించేవాడు భగవత్ప్రతి రూపమైన సర్వజీవుల ఎడల ప్రేమ భావమూ, ఆపత్సమయాలలో వారి రక్షణభారమూ వహించే సుశీలి కావాలి. ఈ సౌశీల్యాన్ని మనిషి ప్రయత్నపూర్వకంగా ఆచరించాలి.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు