స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-190

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసా, వాచా, కర్మణా త్రికరణశుద్ధిగా ఆచరించినవాడే సుప్రావియై పరమాత్మకు ప్రీతిపాత్రుడు కాగలడు.
సోమీ:- తాను శాంతుడై తన తోడివారిని ప్రశాంతులుగాచేసే సచ్ఛీలియే సోమి. వెనుక చెప్పబడిన సుకృత్తు, మనాయు, సుప్రావి అయినవాడే సోమి కాగలడు. తాను ప్రశాంతంగా ఉండి ఇతరులను ప్రశాంతంగా ఉంచాలంటే ముందుగా ఇతరుల ఎడల సహజంగా కలిగే వైరభావాన్ని తొలగించుకోవాలి. ఈ భావాన్ని అలవరచుకొనేందుకు ‘ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్’ ‘‘ఇతరులు తన ఎడల ఏ పనులుచేస్తే తనకు అప్రియంగా ఉంటుందో ఆ పనులను తాను స్వయంగా ఇతరుల ఎడల ఆచరించరాదు’’అని మహాభారతం ఒక చిన్న ఉపాయాన్ని చెప్పింది. ఇది చిన్నదే అయినా సులభోపాయం మాత్రంకాదు. కాని ప్రయత్న పూర్వకంగా ఆచరిస్తే ఆతడు తప్పక వేదం చెప్పిన సోమి అయి భగవత్ప్రీతి పాత్రుడవుతాడు.
విశ్వాత్ముడికి ఆత్మీయుడై ప్రీతిపాత్రుడు కావడానికి ఎనె్నన్నో లక్షణాలున్నాయి. కాని వేదం వానిలో ఎంచి ఎంచి ప్రధానమైన వాటిని నాల్గింటిని ఈ మంత్రంలో పేర్కొంది. కనీస మా నాల్గు లక్షణాలున్నా ఉర్వస్మా అదితిః శర్మ యంసత్ ‘‘జగన్మాత (అదితి)వారికి ఇహలోకంలో సుదీర్ఘమైన సుఖజీవనం తోడి దీర్ఘాయువు నిస్తుంది’’అని ఋగ్వేదం మానవ సమాజానికి సందేశమిస్తూంది.
***
దేవా! నీకు దూరంగానే ఉండి మొరపెడుతున్నాం.
ఉత త్వా బధిరం వయం శ్రుత్కర్ణం సంతమూతయే
దూరాదిహ హవామహే॥ ఋ.8-45-17॥
భావం:- మేము మా రక్షణకోసం బాగా వినగల శక్తివంతమైన చెవులుగల నిన్ను దూరంగా ఉన్న మేము మొరపెడుతూ పిలుస్తున్నాం.
వివరణ:- సర్వభూతాంతరాత్మా! నేను దుఃఖార్తుడను. ఎందరికో నా ఆర్తిని విన్నవించుకొన్నా. ఇతరులకు మనసులోని దుఃఖాన్ని చెప్పుకొంటే ఆ భారం తగ్గుతుందని విన్నాను. కాని దానికి భిన్నంగా విపరీతమైన అనుభవమేర్పడింది. నా దుఃఖం తరుగలేదు సరికదా మరింతగా పెరిగింది. బహుశా నా దీనగాథ ఎవరూ వినలేదేమోననిపిస్తూంది. లేదా విన్నవారికి చెవులేవేవో! ఉన్నా అవి చెవిటి చెవులో ఏమో. లేకపోతే వారు నా దీనగాధకు ఎందుకు స్పందించలేదు?
సర్వ దుఃఖ భంజనా! నీవు చెవిటివాడవు కాదని, నీకు చెవులు బాగా వినబడతాయని చాలామంది చెప్పగా విన్నాను. నేను నీకు చాలా దూరంలో ఉన్నాను. ‘వి మే పురుత్రా పతయంతి కామాః’ (ఋ.3-55-3) నా కోరికలన్నీ ఎన్నో విషయాల మీద నిక్షిప్తం చేయబడ్డాయి. అలా నన్నవి నీకు దూరం చేసివేసాయి. అందువలన నేను వ్యాకుల చిత్తుడనై ఉన్నాను. రేపు నిన్ను పొంది అనుభవించాలనుకొన్న మధుర ఊహలన్నీ ఆవిరైపోయాయి. సంసార చక్రమనే జ్వాలా చక్రబంధంలో చిక్కుకొని పోయాను. కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్య, మోహమనే శత్రువులు నన్ను చుట్టుముట్టి హింసిస్తున్నాను. నాకు వానినుండి విముక్తి కనబడటం లేదు. ఎక్కడికి పోగలను? విముక్తినెలా పొందగలను? అనన్య శరణుడనై నీకు శరణాగతుడ నగుచున్నాను. నీకెంతో దూరంలో ఉన్నాను. ‘దూరాదిహ హవామహే’ ‘‘దూరంగా ఉన్న ఈ ప్రదేశం నుండియే నిన్ను పిలుస్తున్నాను.’’
సంసార పీడ నాకొక్కడికే కాదు. ఎందరికో ఉంది. నా వొక్కడి మీదనే అయితే నీవు వినకు. ఇది మా అందరి పీడ. ఓ ప్రభూ! ‘ఉత త్వం మఘవన్ శ్రుణు యస్తే వష్టి వవక్షి తత్’ (ఋ.8-45-6) ‘‘ఓ విశ్వయోనీ! ఓ పూజ్యధనశాలీ! నినే్న కోరి నినే్న మొరపెట్టుకో దలచినవాని పిలుపునైనా విను.’’ ఓ సత్య పరాక్రమా! అసలు నినె్నందుకు పిలుస్తారు? ‘ఊతయే’ ‘‘రక్షిస్తావని కదా!’’ నీకంటె రక్షకుడు, సుఖప్రదాయకుడు ఎవరున్నారు? ఓ దేవా! మేము రక్షణహీనులం. నానావిధ రాక్షస జనమూ మరియు నానా ప్రవృత్తుల చేత చుట్టుముట్టబడిన వారం. నీవో వృత్తాసుర సంహారకుడవు. మోహరాక్షస సంహారకుడవు. అన్నింటిని మించి ‘్భవేరాపిర్నో అంతమః’ (ఋ.8-45-18) ‘‘అంతిమ సర్వోత్కృష్ట బంధుడవు నీవే.’’ లోకంలో ఉండే బంధువుల స్వార్థబంధం వంటిది కాదు నీ బంధుత్వం. నీ ప్రేమ, బంధుత నిస్వార్థ పరిపూర్ణం. సర్వభూతాంతరాత్మా! మా మాట నమ్ము. మేమంతా ఉశ్శసి త్వా సధస్ఠ ఆ (ఋ.8-45-20) ‘‘నీ వొక్కడితో మాత్రమే ఉండేందుకిష్టపడుతున్నాం’’ మా మొరను విన్నావా? మమ్ము నీ వెంటే ఉంచుకో. నీదిమాత్రం ఏదీ చెడిపోదు. కాని మేము మాత్రం ధన్యులమవుతాం.
**
భగవంతుని రక్షణ
తమిన్నరో వి హ్వయంతే సమీకే రిరిక్వాంసస్తన్వః కృణ్వత త్రామ్‌
మిథో యత్త్వాగముభయాసో అగ్మన్నరస్తోకస్య తనయస్య సాతౌ॥ ॥
భావం:- మానవులు తమ శరీరేంద్రియ బలీయమైన శక్తులను వశం చేసుకుంటూ జీవన సంగ్రామంలో ఆ దైవాన్ని అత్యంత ఆర్తితో పిలుస్తారు. ఆ భగవంతుని తమ రక్షకునిగా చేసుకొంటారు. వీరూ మరియు పిల్లాపాపలను పొందాలనుకొనేవారు ఈ యిరువురు త్యాగానే్న ఆశ్రయిస్తున్నారు.
వివరణ:- ప్రపంచంలో మనిషి ఎప్పుడైనా ఎక్కడైనా నిరాశచేత హతాశుడయితే అప్పుడు దీన జన శరణ్యుడు- దుఃఖనివారకుడయిన భగవంతుని స్మరించి ఆయనకు శరణాగతుడవుతాడు. లోకంలో జగడాలు- విరోధాలు లేకుంటే ఎవరూ ఎవరిని సహాయమర్థించరు.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు