స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-194

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాని నీవద్ద గల ధనరాశికి తరుగుదల కానరాదు.
త్వాం హి సత్యమద్రినో విద్మ దాతారమిషామ్‌ విద్మ దాతారం రరుూణామ్‌॥
(ఋ.8-46-2)
‘‘ఓ దీనదయాళో! మాకు నిజమైన అన్నదాతవు, ధనదాతవు నీవే.’’ ఈ సృష్టిలో ఆహారాన్ని తీసుకొనే జీవులను లెక్కించలేము. నా దృష్టిలో ఆ జీవులు అనంతం. ఒక్కొక్క జీవజాతిలో వేలాది కోట్ల జీవులున్నాయి. ఆ జీవులన్ని తినే ఆహార సామగ్రి కూడ అనంతమే. అంత అనంత ఆహార సామగ్రిని అనంత ధనవంతుడవైన నీవే రుూయగలుగుతున్నావు. అందుచేత ‘దశస్యా నో మఘవన్ నూ చిత్’ ‘‘ఓ ధనేశ్వర! మాకాధనాన్ని శీఘ్రంగా ఇమ్ము’’ నీవాలస్యం చేస్తే మా అశాంతమైన మనస్సు మరింత అశాంతమైపోతుంది. ఓ పరమేశ్వర! ‘దదీ రేక్ణస్తనే్వ దదిర్వసు దదిర్వాజేషు పురుహూత వాజినమ్...’॥
నీవు ఈ శరీర పోషణకు తగిన ధనాన్ని, నివాసాన్ని ఇస్తున్నావు. మాకు జ్ఞానప్రబోధార్థం జ్ఞానిని కూడ అనుగ్రహిస్తున్నావు. సమస్తమూ అనుగ్రహించే ఓ ప్రభూ! శారీరక ధనాన్ని బుద్ధ్ధినాన్ని ఇమ్ము.
తమింద్రం దానమీమహే శవసానమభీర్యమ్‌ ఈశానం రాయ ఈమహే॥ (ఋ.8-46-6)
‘‘ఓ అనంత బలశాలీ! నిన్ను దానాన్ని అర్థిస్తున్నాం. అభయప్రదాతా! ధనేశ్వరుడవైన నినే్న కోరుతున్నాం.’’
ధనమూ మరియు జనమూ వినాశనమైపోవుట చూస్తున్నా. ధనం తప్పక వినాశనమైపోతుందని భయం కలుగుతూ ఉంది. కాబట్టి ఓ అభయదానశీలా! మాకు ధనమే వద్దు. నీవే కావాలి. ధనస్వామివైన నీవే కావాలి. ఈ సద్భుద్ధి మాలో స్థిరంగా ఉండనిమ్ము అందువలన ‘్ధయో వాజేభి రావిథ’ ‘‘మా బుద్ధులను జ్ఞానంచేత పవిత్రం చేయి.’’
ప్రభంగం దుర్మతీనామింద్ర శవిష్ఠా భర రయి మస్మభ్యం యుజ్యమ్‌॥
(ఋ.8-46-19)
‘‘దేవాధిదేవ! సదా మావెంట ఉండి దుర్బుద్ధులను నాశనంచేసే ధనాన్ని ఇమ్ము’’
‘‘ఓ దేవాధిదేవా! మానవుడు ధనాన్ని పొంది ఉన్మత్తుడైపోతాడు. బుద్ధియందు సమతౌల్యాన్ని కోల్పోతాడు. ఒకప్పుడు మూఢునిగా మారిపోతాడు. కొన్ని సందర్భాలలో జ్ఞానియయిన వాని మనస్సులోకూడ అహంకారాన్ని, దురభిమానాలను పుట్టిస్తుంది. అందుచేత అనంత జ్ఞాన సంపన్నా! బుద్ధి సంశోధకమూ, దుర్బుద్ధి నివారకమూ, విమల ప్రకాశమూ, అజ్ఞాన నివారకమూ, దుష్టజ్ఞాన వినాశకమూ అయిన సుజ్ఞానాన్ని మాకు వరప్రదానంచేయి. కాని ఓ త్రిలోకాత్మా! ఇంత మాత్రం దయను తప్పక చూపు. ఎందుకంటే-
సనితః సుసనితరుగ్రచిత్ర చేతిష్ఠ సూనృత
ప్రాసహా సమ్రాట్ సహురిం సహంతం భుజ్యుం వాజేషు పూర్వ్యమ్‌॥ ఋ.8-46-20
ఓ ధనాధిపతీ! పరమేశ్వరా! నీ వరప్రదానమైన ధనమూ నీ కరుణాపూర్ణమైన రక్షణ మమ్ము పెడదారి పట్టించకుండ ఉండుగాక! నీ రక్షణలో మేము మూడుపూవులు ఆరుకాయలుగా వర్ధిల్లెదముగాక! నీ ధన వరప్రదానంతో సమాజంలో ఔన్నత్యాన్ని కూడ పొందెదముగాక! కాని ఎన్నడూ నీ ఆజ్ఞోల్లంఘన మాత్రం చేయకుందుముగాక! అల్పజ్ఞతవలన మేమట్టి తప్పిదానికి పాల్పడకుండెదముగాక! నీవు చెప్పిన పవిత్ర సందేశ వాక్యాలలోనే నేనొక మాట చెబుతున్నాను.
త్వం విశ్వా దధిషే కేవలాని యాన్యావిర్యా చ గుహా వసూని
కామ మినే్మ మఘవన్మా వి తారీ స్త్వమాజ్ఞాతా త్వమింద్రాసి దాతా॥ (ఋ.10-54-5)
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు