స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-195

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ప్రకటితమూ మరియు రహస్యమూ అయిన రెండు ధనాలను నీవే వహించి యున్నావు. ఆ రెండు సుఖదాయకమైనవే. ఓ ప్రభూ! నా కోరికను తిరస్కరించకు. సర్వప్రబోధకుడవు నీవే. నా అభిమతమేదో తెలిసినవాడవు కూడ నీవే. సర్వప్రదాతవు నీవే.’’
నా కోరికలలో మంచి కోరిక ఏదో నీవే ఎరుగుదువు. ఆ కోరికలను నెరవేర్చువాడవు కూడ నీవే. అందుచేత నీవుచేసే పనిని నా ఎడల చేయి. ఆనందం పొందడమే నా ధ్యేయం. కాని నిజమైన ఆనందమేది? దానికి సంపూర్ణత ఉందా? నిజంగానే ప్రశ్నిస్తే దానిని గురించి కొంచెం కూడ తెలియదు. పలుమార్లు తీయనిదిగా పొరపడి చొప్పదంటును తిన్నాను. కాని రసహీనమైన ఆ చొప్పదంటు వెగటును కలిగించింది. దానితో ఎందుకో మనసులో భయంకూడ కలిగింది. నాలో ఆనందం పొందాలనే లౌల్యబుద్ధి ఎప్పుడూ ఉంది. కాని నాలో ఉన్న సహజమైన అజ్ఞానమే తెలుసుకొనేందుకు సిద్ధమవుతూంది కాబట్టి సర్వ జ్ఞాన విధాన! నా ఉచితమైన కోరిక ఏదో నీవే గుర్తించి పరిపూర్ణం చేయి. ఇదే నీకు నా విజ్ఞప్తి- ప్రార్థన.

దుఃస్వప్న నివారణోపాయం
పర్యావర్తే దుఃష్వప్న్యాత్ పాపాత్స్యప్న్యాదభూత్యాః
బ్రహ్మాహమంతరం కృణ్వే పరాస్వప్నముఖాః శుచః
భావం: దుఃస్వప్నానికి కారణమైన పాపం నుండి మరియు అసలు అట్టి కల రావడానికి కారణమైన దౌర్భాగ్యం నుండి విముక్తి పొందుతున్నాను. ఆ కలలు వచ్చినట్లయితే హృదయంలో దైవధ్యానం చేస్తాను. దానివలన కలలోని దుఃఖం నుండి విముక్తి పొందుతాను.
వివరణ: దుఃస్వప్నమన్న పేరే అది చెడ్డదన్న విషయాన్ని తెలుపుతుంది. అసలు దుఃస్వప్నానికి కారణం పాపమే. అదేమిటో ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. కలకు - మెలకువకు మధ్య భేదమేమిటో ముందు తెలుసుకొందాం. జాగ్రత్ (మెలకువ) దశలో ఆత్మ కొరకు మనో, బుద్ధి, అహకార, చిత్తాలనే అంతఃకరణాలు మరియు జ్ఞానం, కర్మేంద్రియాలు చురుకుగా పనిచేస్తుంటాయి. కాని స్వప్నం - ఆ జాగ్రద్దశకు భిన్నంగా శరీరం మరియు జ్ఞాన కర్మేంద్రియాలు అలసిపోయి విశ్రాంతిని పొందుతూ కేవలం అంతరింద్రియమైన మనస్సు మాత్రమే పనిచేస్తూ ఉండేదశ. ఈ సందర్భంలో ఆత్మ మరియు ఇంద్రియాలకు మధ్య మనస్సు అనుసంధానకర్తగా ఉంటుందని దార్శనికులు చెబుతారు. అంటే- ఇంద్రియాలు తాము సంగ్రహించిన రూపాదుల విషయ జ్ఞానాన్ని మనసుకు చేరవేస్తాయి.
ఆ జ్ఞానాన్ని మనస్సు ఆత్మకు నివేదిస్తుంది. దానివలన ఒకే సమయంలో ఒకే విధమైన జ్ఞానం కలుగుతుంది. కారణం మనసు ఒక సమయంలో ఒక ఇంద్రియాలతోనే సంయోగం చెందుతుంది. అంటే లోనున్న ఆత్మ నుండి భావాలు బయటకు ప్రసరించినా, బయటనుండి జ్ఞానం ఇంద్రియాల ద్వారా లోపల వున్న ఆత్మకు చేరినా ఆ జ్ఞానం గాని భావంగాని మనస్సుకు ఇంద్రియాలందించినవి మాత్రమే కాబట్టి స్వప్న దశలో మంచి గాని చెడుగాని మనస్సు దేనిని స్మరిస్తుందో అది జాగ్రద్దశలో ఎప్పుడో ఒకప్పుడు క్రమబద్ధంగా గాని, మరొకప్పుడు క్రమవిహీనంగా గాని, వేరొకప్పుడు రెంటికి భిన్నంగా గాని జరిగిన విషయాలకు ఛాయారూపమే. ఈ అంశానే్న సూచిస్తూ ఋగ్వేదం ‘యదాశసా నిఃశసాభిశసోపారిమ జాగ్రతో యత్స్వపంతః’- జాగ్రద్దశలో చేయబడిన హత్యలే కలలోనికి వస్తాయి అని స్పష్టం చేసింది. వేదమతానుసారం మృతాత్మకే స్వప్నాలు వస్తాయి. మృతాత్మ అంటే పాపకర్మ చేత హతమైన ఆత్మ అని అర్థం. ఆ విధంగా మరణించని-
భద్రం వై వరం వృణతే భద్రం యుంజంతి దక్షిణమ్
భద్రం వైవస్వతే చక్షుర్బహుత్రా జీవతో మనః
‘‘సజీవమైన ఆత్మ దైవాన్ని క్షేమంకర వరాలనర్థిస్తుంది. సదా ఉత్సాహంగా ఉంటుంది. మరియు వివస్వంతుని (్భగవంతుని) గూర్చి సుజ్ఞానం కలిగి ఉంటుంది’’ అని ఋగ్వేదం వివరించింది. అంటే ఏమిటి? ఎన్నడూ ఇతరులకు చెడు చేయక, చెడు కోరక, అందరకు మేలును కోరేవారికి దుఃస్వప్నమెలా వస్తుందని ఋగ్వేదాభిప్రాయం.
ఈ ఋగ్వేదాభిప్రాయాన్ని విశే్లషించితే దుఃస్వప్నాలనుండి రక్షణ పొందాలంటే సదాలోచన మరియు సదాచరణ తరుణోపాయమని స్పష్టమవుతుంది. ఈ రెండు ఎలా సిద్ధిస్తాయి. శుభప్రదుడైన భగవానుని వలననే. లోకంలో ఆయనకంటే శుభప్రదుడెవరున్నాడు? అందుకే ప్రస్తుత మంత్రంలో ‘బ్రహ్మాహమంతరం కృణ్వే పరా స్వప్నముఖాః శుచః’ -‘‘నేను బ్రహ్మను (దైవాన్ని) హృదయంలో నిలుపుకొంటాను’’ అని దుఃస్వప్న నివారణోపాయం సూచించబడింది. ఈ విషయానే్న విశే్లషిస్తూ అనుభవ శిరోమణి సాక్షాత్ ధర్మస్వరూపులు అయిన అధ్యాత్మ ప్రసాద్‌గారు ఇలా వివరించారు.
‘‘జితేంద్రియుడు కావాలని అభిలషించేవారు రాత్రింబవళ్ళు పవిత్ర ప్రణవమై ఓంకారాన్ని జపించాలి. రాత్రి ప్రణవ జప సాధనలో చాలా ప్రొద్దు గడచిపోతే ఒక రెండు గంటలు నిద్రించి లేచి ఓంకారాన్ని జపించాలి. ఎక్కువ సమయం నిద్రించేవారికి కలలు వస్తాయి. జితేంద్రియాభిలాషికి రావు.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు