స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-198

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*

తద్వాస్యైవం విద్వాన్ వ్రాత్యోరాజ్ఞో- తిథిర్గృహానాగచ్ఛేత్‌॥
శ్రేయాంస మేనమాత్మనో మానయేత్త్థా
క్షత్రాయ నావృశ్చతే తథా రాష్ట్రాయ నా వృశ్చతే॥
‘‘అట్టి సత్యవ్రత నిష్ఠుడైన విద్వాంసుడు రాజు ఇంటికి వస్తే అది తనకు సౌభాగ్యదాయకమని భావించాలి.’’ దయానందులు తమ సత్యార్థప్రకాశం 4వ సముల్లాసంలో అతిథిని గూర్చి ఇలా ప్రస్తావించారు.
‘‘తిథిని పరిగణింపక గృహానికి వచ్చేవానిని అతిథి అంటారు. అంటే ధార్మికుడు, ధర్మోపదేశకుడు, సర్వజనోపకారార్థంగా సర్వదా సర్వత్ర సంచరిస్తూ హఠాత్తుగా గృహస్థుని ఇంటికి వచ్చేవాడని అర్థం.’’
అతిథులవలన ప్రయోజనాన్ని వివరిస్తూ దయానందులిలా వివరించారు. ఉత్తముడైన అతిథి లోకంలోనే లేకుంటే అభ్యున్నతి జగత్తుకు ఉంటుందా? వారు దేశ సంచారంచేస్తూ సత్యోపదేశం చేయకుంటే దేశంలో వేద విరుద్ధాచారం ప్రబలిపోతుంది. అట్టి అతిథుల వలన గృహస్థులలో సత్యస్వరూప విజ్ఞానం వ్యాపిస్తుంది. అంతేకాక మానవులలో ఒకే ధర్మబుద్ధి నెలకొంటుంది. అతిథుల సాహచర్యంలోనే గృహస్థులకు సందేహనివృత్తి కలుగుతుంది. దానివలననే ధర్మాచరణ ఎడల దృఢ నిశ్చయమేర్పడుతుంది. దానివలననే సమాజం సుఖసంతోషాలను పొందుతుంది. సత్యార్థ ప్రకాశం 4వ సముల్లాసం.
**
విద్వాంసుల సహాయం
యే స్థా మనోర్యజ్ఞియాస్తే శ్రుణోతన యద్వో దేవా ఈమహే తద్దదాతన
జైత్రం క్రతుం రయిమద్వీరవద్య శస్తద్దేవానామవో అద్యా వృణీమహే॥
భావం:- నీవు- సజ్జనులుగా మనోవైజ్ఞానికులుగా ఎవరు ప్రసిద్ధి వహించియున్నరో వారి మాటలను వినుము. విద్వాంసులారా! మీనుండి దేనిని అర్థిస్తున్నామో అది విజయశైలమై, ఐశ్వర్యప్రదాయకమై, వీరోచిత కర్మసహితమై కీర్తివహించే రీతిగా అనుగ్రహించండి. మేము ఈనాడే విద్వాంసులకు సంరక్షణ, సుఖసంతోషాలు కలగాలని కోరుకొంటున్నాం.
వివరణ:- లోకంలో విద్వాంసులందరకు రక్షణ, సుఖ-సంతోషాలు, దైవ సహాయం కలగాలనే ఆకాంక్ష ఈ మంత్రంలో ప్రధానంగా ప్రకటింపబడింది. విద్వాంసుడే అవిద్వాంసులకు సన్మార్గోపదేశాన్ని చేయగలడు. మరయితే ఆ విద్వాంసుడెట్టివాడై యుండాలి?’’ ఈ విషయానే్న ప్రస్తుత మంత్రం వివరిస్తూ ‘యే స్థా మనోర్యజియాస్తే శ్రుణోతన’
‘‘ఎవరు మనోః= నిత్యదైవ చింతనపరులో జ్ఞానవంతులో, యాజ్ఞికులో అంటే మనోవైజ్ఞానిక సంపన్నులో వారి మాటలనే విను.’’ ఎవరినుండి అయినా తమ సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకోవాలని భావిస్తే ప్రతి వ్యక్తి ఎదుట తమ మనోవ్యథనంతా వెళ్లబోసుకోవాలా? అలా ఎప్పటికి చేయరాదు. దానం చేసేవాడు దానగ్రహీత పాత్రను దానగ్రహీం దాతయోగ్యతను విరించుకొనే రీతిగా తమ మనోవ్యథను చెప్పుకొనేముందు దానిని వినేవాడికి యోగ్యత- సహృదయత ఉందా అని తప్పక విచారించుకోవాలి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొనియే ప్రస్తుత మంత్రం వినేవారు ‘మనో ర్యజ్ఞియాః’= మనస్తత్వవేత్త కావాలని సూచించింది. అంటే వారు మనుష్యుల మనస్తత్వం తెలిసి మానవత్వంగల మనుష్యులుగా చేయుటయందు, మనిషిని మనీషి (జ్ఞాని)గా చేయుటయందు సదా మనస్సులలో చింతనాపరులై తదేకదీక్షా తత్పరులై యుండాలని మంత్రసారం. లోకంలో అట్టి మహాపురుషులను గుర్తించేందుకు వారి లక్షణాలెలా ఉంటాయో ఋగ్వేదం ఇలా వివరించింది.
యే సవితుః సత్యసవస్య విశే్వ మిత్రస్య వ్రతే వరుణస్య దేవాః
‘‘సత్యానే్న యజ్ఞకర్మగా సదా ఆచరించేవారు, లోకాన్ని మంచిగా సంస్కరించేవారు; విశ్వకర్తయైన భగవంతుని ఆజ్ఞలను శ్రద్ధాసక్తులతో ఆచరించేవారు యథార్థమైన యాజ్ఞికులు. విద్వాంసులు. దేవతలు అంటే జగన్నియామకుడైన భగవంతుని ఆజ్ఞలను శిరసావహించి జీవిత పర్యంతమూ ఆచరిస్తూ తమ నడవడికను సంస్కరించుకొనే దివ్యగుణ సంపన్నతకలవారే యజ్ఞీయులు- విద్వాంసులు- దేవతలు అని భావం. అట్టి మహాపురుషులు ఏది అర్థించినా అది తప్పక సిద్ధిస్తుంది. అయితే దేనినర్థించాలి? ‘జైక్షతం క్రతుమ్’= విజయ ప్రదాయకమైన కర్మ మరియు ‘రయిమాన్ వీరవాన్ యశః’ ధనసంపన్నత- వీరుల వీరకృత్యాలతో సిద్ధించిన కీర్తి వైభవం. ఈ రెండింటిని దయతో ప్రసాదించే ‘మహదద్య మహతామా వృణీమహే- వో దేవానామ్.’ ‘‘విద్వాంసులకు గొప్ప రక్షణ, దైవ సాహాయ్యం, సుఖసంతోషాలు కలగాలని కోరుకొంటున్నాం’’అని ఒక అర్థార్థి ఆకాంక్షగా ఋగ్వేదం ప్రకటించింది. ఆ విధంగా విద్వాంసులు ప్రసాదించిన ఆ రెండింటివలన కలిగే ప్రయోజనమేమిటో ‘యథా వసువీరజాతం నశామహై’ వీరులను తయారుచేసే ధనం మాకు లభించేయి’’అన్న ప్రార్థనలో ఋగ్వేదం ప్రకటించింది. ఇది ఎంత గొప్ప ఉదాత్త ప్రార్థన. సాధారణంగా ధనంవలన సుఖసంతోషాలు కలగాలని ఎవరైనా కోరుకొంటారు. కాని ఆ ధర్మం దేశోద్ధరణ మరియు దేశరక్షణ చేసే వీరులు తయారగుటకు సహాయపడేది కావాలని కోరుకోవడంలోని వైదిక భావన ఏ కాలానికైనా చెక్కుచెదరని ఆదర్శభావనయే. వేదంలోని ఈ ప్రస్తావనకు విని విద్వాంసులే అర్థించిన వెంటనే దయతో వారు అన్ని అనుగ్రహిస్తారు. ఇక మనమేమీ చేయనవసరంలేదని నిష్క్రియగా ఉండవచ్చునని వేదం అనుమతించినట్లుగా భావించరాదు అని ఋగ్వేదమే ఈ సందర్భంలో-
తే సౌభగం వీరవద్ గోమదప్నో దధాతన ద్రవిణం చిత్రమస్మే
‘‘ఐశ్వర్యవంతమూ, వీర సమన్వితమూ, గవాది పశు సంపద యుతమూ, ధనసాధన సమేతమూ అయిన అద్భుత కర్మలలో వారు మమ్ము నియోగించురు గాక!’’ అని ఒక సదా సత్కర్మో త్సాహవంతుని అభ్యర్థన రూపంగా హెచ్చరించింది. కర్మల యందు నియోగించమన్నమాట కర్థమేమంటే ఆ కర్మలను సాధించే యుక్తిని ఎరుకలోనికి తెమ్మని మాత్రమే. ఈ మంత్ర సందర్భంలోనే కాదు వేదంలో మరెక్కడైనా కోరికలు సిద్ధింపచేయుమన్న అభ్యర్థనలోని కోరికలన్ని సాధింపచేసుకొనే కర్మకళాకౌశలాన్ని అనుగ్రహించమని కోరిన అభ్యర్థనగా భావించాలి.
ఇంకావుంది...