స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-208

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దానివలన నాయకుని ఐక్యసంఘటనా లక్ష్యమే దెబ్బతింటుంది. అందుచేత నాయకుని ప్రతి పని మంద్రంగా అల్పస్థాయిలో అంటే తోడుగావచ్చి వారి మనసు, మాట, చేష్టలకు బాధ కలిగింపక చాల మృదువైనదిగా ఉండాలని వేదం ఈ వాక్యం ద్వారా ఆదేశిస్తూంది. ఇది ఏ కాలానికైనా సర్వసత్యమైన సూత్రమే. ఈ సూత్రాన్ని పాటించని నాయకుడు నడిపే ఉద్యమాలు మధ్యలోనే విఫలంకావడం ఈ కాలంలో మనమంతా ఎనె్నన్ని చూడటం లేదు. ఈ మాటను ఒక్క ఋగ్వేదమేకాదు యజుర్వేదం కూడ ఇలా ఘోషిస్తూంది.
అక్రన్ కర్మ కర్మకృతః సహ వాచా మయోభువాః యజు.వే.3-47॥
‘‘కర్మ నిపుణశీలురైనవారు సుఖదాయకమైన అంటే మధురమైన మాటలతో కర్మలను నిర్వహిస్తారు’’ ఇక్కడ శు.య.వేదం ఒక్క మాటనే ప్రస్తావించినా అది మనసుకు, చేష్టకు ఉపలక్షకంగా గ్రహించాలి. అంటే చేసే పని సంఘటనా తత్పరుల మనస్సులను గాయపరచరాదు. వారి మాటలను అగౌరవ పరచరాదు. వారు చేసే పనులకు విరుద్ధంగా ఉండరాదు. ఆ విధంగా మృదువుగా నాయకుడు వ్యవహరించాలి అని వేద సందేశం.
2. ధియ ఆ తనుధ్వమ్:- బుద్ధిని విస్తరింపచేసి కర్మచేయుమని దీని శాబ్దికార్థం. కర్మచేయడంలో తాత్కాలికమైన భావావేశానికి లోనయి ప్రవర్తించవలదని పరోక్షంగా వేదమంత్రోపదేశం. సాధారణంగా ఎదురయ్యే భావావేశ సందర్భాలలో సంయమనం పాటించి బుద్ధి అన్ని కోణాలలో వినియోగించి కుశలతతో కార్యనిర్వహణ చేయుమని వేద ప్రధానోద్దేశ్యం.
మనీషిణః ప్ర భరధ్వం మనీషామ్‌ (ఋ.10-111-1)
‘‘ఓ బుద్ధిమంతులారా! బుద్భిని బాగా వికసింపచేసుకొని వినియోగించండి’’అని గట్టిగా ప్రతిపాదించింది. సాధారణంగా బుద్ధి నావహించే జాడ్యాన్ని తొలగించి సత్కర్మలకు ప్రేరణ యిమ్మని-
ధియో యో న. ప్రచోదయాత్ (శు.య.వే.36-3)
‘‘శుభకర్మలకు ప్రేరణ యిమ్ము’’అన్న గాయత్రీ మంత్రం ద్వారా దైవాన్ని ప్రార్థించేది. బుద్దిజాఢ్యాన్ని వదిలించమనియే. వేద ప్రతిపాదికమైన బుద్ధి వికసనా ప్రాముఖ్యాన్ని నీతికారులు కూడ-
బుద్ధిర్యస్య బలం తస్య నిర్బుద్ధేస్తు కుతో బలమ్‌
‘బుద్ధిగలవాడే శక్తివంతుడు బుద్ధిలేనివాడికి శక్తి ఎక్కడ?’’అని వివరించారు. కాబట్టి నాయకుడు మానవ సమాజ సమైక్య సంఘటనా యజ్ఞనిర్వహణలో బుద్ధిని వివిధ కోణాలలో వినియోగించి వ్యవహరించవలసి యుంది.
3. నావమరిత్రపరణీమ్ కృణుధ్వమ్:- ‘పడవను తెడ్డులతో సంరక్షిస్తూ నడుపుము అని ఈ వాక్యానికి శాబ్దికార్థం. ఇక్కడ పడవ అంటే మానవ సమాజమే. పడవను తెడ్డులువేసి సంరక్షిస్తూ నావికులు ముందుకు నడిపినట్లుగా ఐక్యసంఘటనా యజ్ఞంలో పాల్గొని మానవ సమాజాన్ని అలా సంరక్షిస్తూ ఏకత్రాటి మీద నడిపించమని వేదోపదేశం. మరి ఇక్కడ చెప్పిన తెడ్డులంటే ఏమిటి? ఈ అంశాన్నికూడ క్రింద వాక్యంలో వేదం వివరించింది.
4. ప్రాంచం యజ్ఞం ప్ర ణయతా సఖాయః:- ‘‘మీ అందరు ఒకే ఆలోచనాక్రమాన్ని వహించి సర్వమానవ సమాజైక్య సంఘటనా యజ్ఞాన్ని నిర్వహించండని ఈ వాక్యానికర్థం. ఈ ఒకే ఆలోచనాక్రమాన్ని గురించి ఋగ్వేదమే మరింత విపులంగా ఇలా వివరించింది.
ఉద్యుధ్యధ్వం సమనస. సఖాయః సమగ్నిమింధ్వం బహవః సనీళాః॥
‘‘మీరంతా ఒకేసారి మేల్కొండి. ఒకే మనోభిప్రాయాన్ని దృఢంగా వహించియుండండి. ఒకే నడవడిక (ఆచారం) కలిగి యుండండి. అందరు ఒకేచోట కలిసి యుండండి. ఒకే లక్ష్యసాధనా తత్పరులు కండి’’ సమాజ ఐక్యసంఘటనా యజ్ఞనౌకను నడిపే తెడ్లు అంటే ఇవే. ఇవన్నీ ఏకమై ఎంత వేగంగా ఏక లక్ష్యసాధనకై ప్రయత్నిస్తే అంత పటిష్ఠంగా ఐక్య సంఘటనా యజ్ఞం నిర్వహింపబడుతుంది.
5. ఆయుధం ఇష్కృణుధ్వమ్:- ‘‘ఆయుధాలను సిద్ధపరచుకో’’అని ఈ వాక్యానికర్థం. వేదం ‘అహింసా పరమోధర్మః’అని చెబుతుంది కదా. మరి ఆయుధాలను సిద్ధపరచుకోమని చెబుతూంది ఏమిటి?’’అని శంకింప పనిలేదు. ధర్మస్థాపనకోసం హింసకు పూనుకోవడం హింసకాదు. అహింసయే. మానవ సమాజైక్య సంఘటనకు విఘాతం కలిగించే ఘాతకుల సంహారం హింసకాదని అహింసయే అని దాని స్థాపనకు ఆయుధాలను సిద్ధపరచుకోమని వేదం అనుష్ఠాన ధర్మాన్ని ఈ వాక్యం ద్వారా ప్రబోధించిందని గ్రహించాలి.
6. అరం కృణుధ్వమ్:- ‘‘ఆయుధాలను నిర్మాణం చేసుకో’’అని ఈ వాక్యానికర్థం. ఈ మాటలో ఈ ఉపదేశం ‘ఆయుధాలకొఱకై ఇతరుల మీద ఆధారపడవ’ద్దని గట్టి హెచ్చరిక కూడ ఇమిడియుంది. అలా ఆధారపడితే మోసపోయే ప్రమాదం పొంచి యుంటుందన్న హితోపదేశం కూడ ఉంది. ఉద్యమ సాఫల్యతకు ఈ సూచన ఎంతైనా ఎప్పటికీ ఆచరణీయమే.
ఈ రీతిగా ఒక ఉద్యమ సాఫల్యతకు వేదం సూచించిన ఈ సూత్రాలను పరిశీలిస్తే సమాజైక్య సంఘటనలో ఉద్యమస్ఫూర్తికి కొన్ని వేల ఏండ్లనాడే వేదాలెంత సార్వజనీన, సార్వకాలికమైనవో ఎవరికైనా అద్భుతమనిపించపోవచ్చు.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు