స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-209

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుఱ్ఱాలను సంతోషంగా ఉంచి యుద్ధ విజేతవు కమ్ము
ప్రీణీతాశ్వాన్హితం జయాథ స్వస్తివాహం రథమిత్కృణుధ్వమ్‌
ద్రోణాహావమవతమశ్మచక్రమంసత్రకోశం సించతా నృపాణమ్‌॥
భావం:- గుఱ్ఱాలను సంతోషపరచి విజయాన్ని సాధంచు. రథాలను శుభప్రదంగా సుఖదాయకంగా నిర్మించు. దేశసంరక్షణలో ప్రధాన పాత్రధారులైన ప్రజలను ఎల్లప్పుడు ఉత్తేజితులనుగా చేయి. ఆగ్నేయాది అస్త్రాలను, అనేక కవచాలను, జన రక్షక సాధనాలను ఎప్పటికప్పుడు శక్తివంతంగా సిద్ధపరచు.
వివరణ:- యుద్ధ విజయ సాధనాలను గురించి ఈ మంత్రం సంక్షిప్తంగా చెప్పినా చాలా శక్తివంతంగా చెప్పింది. విజయాన్ని కోరుకొనేవాడు ముందుగా ‘ప్రీణీతాశ్వాన్’ ‘‘గుఱ్ఱాలను ప్రసన్నం చేసుకో’’మంటున్నది వేదం. ఇక్కడ గుఱ్ఱమంటే ఏదో ఒక గుఱ్ఱం కాదు అది ‘అశ్నుతే అధ్వానమ్’అన్న నిర్వచనానుసారం లక్ష్యాన్ని చేర్చేదిగా ఉంచాలి. ఇక్కడ ‘అశ్వ’మని ఒక్కటే చెప్పబడినా విజయ లక్ష్యాన్ని సాధింపచేసే విద్యుత్, అగ్ని, రథం, సైనికులు, ప్రజలు ఈ అందరికి ఉపలక్షకమే. అంటే వేద పరిభాషనుసారంగా ఇవన్నీ అశ్వాలే. ఈ అన్నింటిని విజిగీషువు ముందుగా ప్రసన్నంగా ఉంచుకోవాలంది వేదం. ఎందుకంటే ఒక్క అశ్వానే్న చూడండి. ఆకలిగొన్న అశ్వం అశ్వికుడికిగాని రథానికి గాని నిరుపయోగమే కదా! రథాలు కూడ గుఱ్ఱాలు లేకుండ ఎందుకుపయోగపడతాయి? గుఱ్ఱాలున్నా అవి ఉత్సాహవంతంగా శక్తివంతంగా ఉన్నప్పుడేకదా అవి మంచి యుద్ధోపకరణాలవుతాయి. అందుకే వేదం ‘‘ప్రీణీతాశ్వాన్’’అని మంత్రం చెప్పి ఊరుకోక ‘హితం జయాథ’ హితం= ‘‘మేలుకొఱకు’’ అంటే యుద్ధ విజయంకోసం అశ్వాదులను జయాథ= ‘సంపాదించు’ అని కారణాన్ని పేర్కొంది. అశ్వమంటే రథాదులకు కూడ వాచకమేనని పైన చెప్పుకొన్నాం గదా. వానినికూడ ‘స్వస్తి వాహం రథమిత్కృణుధ్వమ్’
‘‘సౌకర్యవంతంగా నడిచేవిగా సిద్ధపరచుకో’’ అని వివరణాత్మకంగా వేదం పేర్కొంది.
రాజ్య సుస్థిరతకు గాని, రాజ్యశక్తికి గాని మూలం అవత= ప్రజలే. రాజ్యంలో శాంతిభద్రతలకు మూలం కూడ వారే. ఈ అన్నింటిని రాజ్యానికి ఎప్పటికప్పుడు ధననిధిగాని, జనోత్పాదననిధి గాని ప్రజలే. ప్రీణీతాశ్వాన్ అని వేదం చెప్పిన వారిలో వీరు చేరతారు. కాబట్టి విజయాభిలాషి అయిన రాజు ప్రజలనెల్లప్పుడు ఉత్సాహవంతులుగా, శక్తివంతులుగా సంసిద్ధులై యుండే విధంగా చేయాలి. అప్పుడే రాజ్యసుస్థిరతకు ధనబలం, యుద్ధ విజయాలకు ప్రజా (సైనిక) శక్తి వారి నుండి నిరంతరంగా సమకూరుతుంది. అందుచేత రాజు వారిని సుఖసంతోషాలతో ఉండే విధంగా తీవ్రంగా ప్రయత్నించాలి. అందుకొఱకై రాజు ఎటువంటి ప్రయత్న లోపం చేయరాదు.
ఆయుధాలలో విద్యుత్తుతో పనిచేసేవి కూడ ఉన్నాయి. వాటిని వేదం ‘అశ్మ’ అని వ్యవహరిస్తుంది. (బహుశః వేదకాలంలో విద్యుత్తు ఉండి ఉండవచ్చు). వాటిని రాజు ప్రయోగానికి సిద్ధంగా శక్తివంతం చేసి ఉంచాలి. వానితోబాటు ‘నృపాణ’ కవచాదులను కూడ అత్యధికంగా వినియోగానికి అనుకూలంగా నిర్మాణం చేసి ఉంచాలి.
యుద్ధ విజయ సాధనాలను పరిపుష్టం చేయి
వ్రజం కృణుధ్వం స హి వో నృపాణో వర్మ సీవ్యధ్వం
బహులా పృథూని పురఃకృణుధ్వమాయసీరధృష్టా మా వః
సుస్రోచ్చమసో దృంహతా తమ్‌॥
భావం:- ప్రజాభిప్రాయాన్ని, జనశిబిరాలను ఏర్పాటుచేయి. నీ జనరక్షణ సాధనాలయిన కవచాదులను విస్తారంగా కుట్టించు. దుర్బేద్యమైన రీతిగా నీ నగరాలను తీర్చిదిద్దు. నీ భోజన పాత్రల నుండి పదార్థాలు జారిపోకుండ వానిని గట్టిపరచు.
వివరణ:- పూర్వ మంత్రంలో ‘సించతా నృపాణమ్’ ‘‘జనరక్షక సాధనాలను ఉత్సాహవంతంగా సిద్ధపరచుము’’అని ఆదేశింపబడింది. ఈ మంత్రంలో ఆ నృపాణ శబ్దానికి మరింత వివరణ చేయబడుతూ ఉంది. ఆ ‘నృపాణాన్ని’ ఈ మంత్రం ‘వ్రజ’మని వ్యవహరించి ‘వ్రజం కృణుధ్వం స హి వో నృపాణః’ ‘‘జనరక్షా సాధనాలను స్థాపించు. పశువులశాలలను నిర్మించు. సైనిక శిబిరాలను ఏర్పరచు. అదే నీ నృపాణం’’అని విపులీకరించింది. వ్రజ శబ్దానికి జనాభిప్రాయం అని మరో అర్థం కూడ ఉంది. అంటే అన్ని విషయాలకంటే ముందుగా జనాభిప్రాయాన్ని నీ పక్షమై ఉండే విధంగా చూచుకోమని అర్థం. నిజమైన ‘నృపాణం’ ఇదే. తక్కినవన్ని దానికి ఉపకరణాలే.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు