స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-210

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీని తరువాత మరో ముఖ్యమైన అంశం ‘వర్మ’ కవచాలు. వీనిని ‘సీ వ్యధ్వం బహులా పృథూని’ అనేకమైనవి నిర్మాణం చేయి అన్న మంత్రాదేశం. కవచమంటే కేవలం శరీరాన్ని రక్షించుకొనేందుకు యోధులు ధరించే లోహవస్తమ్రే కాదు. అది సమస్త యుద్ధసాధనాలకు చెప్పబడిన సంకేతం. ఆ అన్నింటిలో ఆ కవచం కూడ ఒకటి. వేదం సంకేతించిన యుద్ధసాధనాలు రెండు విధాలు.
మొదటి దానిని ప్రస్తావిస్తూ ‘పురఃకృణుధ్వమాయసీరధృష్టా.’ ‘‘నగరాలను- దుర్గాలను దుర్భేద్యంగా చేయుము’’ అని పేర్కొంది. అలాగాక అశ్రద్ధ వహిస్తే ఏమి జరుగుతుందో ఊహించడం కష్టమేమీ కాదు. రాజ్యం శత్రువుల దాడికి సులభంగా గురిఅయి పరతంత్రమైపోతుంది.
ఇక రెండవ అంశాన్ని ప్రస్తావిస్తూ ‘మా వః సుప్రోచ్చమసో దృంహతా తమ్’ ‘‘నీ భోజన పాత్రలు రంధ్రాలు పడి జారిపోరాదు. వానిని గట్టిపరచుకో’’ అని వేదం హెచ్చరించింది. అంటే ఆహార పదార్థాలకు కొరత ఏర్పడరాదని ఆ మాట కంతరార్థం. ఎందుకంటే యుద్ధ సమయాలలో సైనికుల సంఖ్య అధికంగా అవసరమై ఉంటుంది. వారికి ఆహారం కూడ అంతే అధికంగా అవసరముంటుంది. అట్టి సమయంలో భోజన పాత్రలు రంధ్రాలుపడి కారిపోరాదు అంటే సైనికావసరాలకు తగిన ఆహార సమృద్ధికి కొఱత రానీయరాదని వేదం ఈ విధంగా హెచ్చరించింది. ఈ విధంగా యుద్ధసమయాలలో యుద్ధ విజయసాధనాలను పరిపుష్టంగా పుష్కలంగా సిద్ధపరచుకోవాలని రాజును వేదం స్పష్టంగా హెచ్చరించింది.
**
మహాపురుషులకు విరోధులు కూడ హానిచేయలేరు
యథా వశంతి దేవా స్త్థేదసత్తదేషాం నకిరా మినత్‌
అరావా చన మర్త్యః॥ ఋ.8-28-4॥
భావం:- నిష్కాములైన మహాత్ములు దేనిని కోరుకొంటారో అది అదే విధంగా జరుగుతుంది. వారికి విరోధులైన వారెవరైనా కించిత్తు కూడ అపకారాన్ని చేయలేరు.
వివరణ: ఇక్కడ దేవ శబ్దానికర్థం దివ్యమైన అనగా దేవతా సంబంధమైన గుణాలు కలిగియున్నవారని అర్థం. వేద నిఘంటుకర్తయైన యాస్కాచార్యుని అభిమాతానుసారం దేవో దానాద్‌వా ద్యోతనాద్దీపనాద్ వా- దానపరాయణుడు మరియు తాను స్వయంగా ప్రకాశిస్తూ ఇతరులను ప్రకాశింపజేసేవాడే దేవ శబ్దవాచ్యుడు. స్వయంగా ప్రకాశిస్తూ జగత్తునంతా ప్రకాశింపజేస్తూ సర్వజీవులకు జీవన భాగ్యాన్ని దానం చేస్తున్న సూర్యుడు దేవుడు. జ్ఞానప్రకాశం చేత ప్రకాశిస్తూ సమస్త మానవులకు జ్ఞానదానంచేస్తూ ఉండిన మహాపురుషుడు కూడా దేవశబ్దవాచ్యుడే. ఈ మంత్రంలో దేవశబ్దం చేత నిర్దేశింపబడినది మానవులే అన్న విషయం ‘యథావశంతి దేవాః’ - ‘దేవశబ్దవాచ్యులు కోరుకొన్నదే జరుగుతుంది’ అన్న వాక్యం చేత సూచింపబడింది. కోరుకోవడం మానవులకు మాత్రమే సంకేతింపబడిన విషయం కదా. శతపథ బ్రాహ్మణంలో ‘విద్వాంసో హి దేవాః’ - ‘విద్వాంసులే దేవశబ్దవాచ్యులు’ అన్న వచనం కూడా దీనికి తార్కాణమే. ఆ విధంగా దివ్యగుణ కర్మశీలురైన విద్వాంసులు ‘యథా వశంతి దేవా స్త్థేదసత్’ ఎలా కోరుకొంటే అలాగే జరుగుతుంది అన్న వేదవచనంలో ఆశ్చర్యమేముంటుంది?
దేవ శబ్దవాచ్యులయిన ఆ విద్వాంసుల కా సంకల్పసిద్ధి, శక్తి లభించిన కారణం చేత వారు ఋతం = సత్యాన్ని- సృష్టి ధర్మాలను యథాతథంగా ఆచరిస్తున్నారు. యోగదర్శనం కూడా ‘అమోఘాస్య వాగ్ భవతి’ -‘వారి మాట నిష్ఫలం కాదు’ అని ఈ విషయానే్న సమర్థించింది. వేదం ఇంతమాత్రమే కాదు, అంతకంటే ఎక్కువగానే ‘తదేషాం నకిరా మినత్ అరావా చన మర్త్యః’ - ‘వారికి శత్రువులు సహితం అపకారం చేయజాలరు’ అని విశేష శక్తివంతులుగా వారిని అభివర్ణించింది. వేదాలలో ఈ విషయమనేక సందర్భాలలో నిరూపింపబడింది. కాబట్టి సత్యశీలురై అందరూ అమోఘ వచస్కులుగా గణుతికెక్కుదురుగాగ!
మేలు కోరేవాడు చేతలతోనే మాట్లాడతాడు
పరి చిన్మర్తో ద్రవిణం మమన్యాదృతస్య పథా నమసా వివాసేత్
ఉత స్వేన క్రుతనా సం వదేత శ్రేయాంసం దక్షం మనసా జగృభ్యాత్
భావం: మానవుడు అన్నివైపులనుండి ధనాన్ని పొందాలి. అది కూడా ఋతం అనగా సృష్టి ధర్మాలు మరియు నియమాలను ఆచరిస్తూ సన్మార్గంలోనే సుఖాన్ని పొందాలి. మనిషి నోటితో మాటలు చెప్పడం కాకుండా తన సత్కర్యాచరణ ద్వారానే మాట్లాడాలి.
వివరణ: ధనాన్ని పొందాలని తలంచే మానవుడు ఆచరింపదగిన ముఖ్య నియమాలు ఈ మంత్రంలో వర్ణింపబడ్డాయి.
1.పరి చిన్మర్తో ద్రవిణం మమన్యాత్: ‘‘మానవుడు అన్నివైపులనుండి ధనాన్ని పొందాలి’’ అని ఈ మంత్రార్థం. సాధారణంగా ధనమంటే ప్రభుత్వం ముద్రించే కరెన్సీ నోట్లు, బంగారం, భూములు ఇవే అని అందరూ భావిస్తారు. అది ఒక పాక్షికమైన ధనం మాత్రమే. కాని సృష్టిలో ధనం సర్వత్ర ఉంది. మట్టి, నీరు, నిప్పు, గాలి, భూమి, భూగర్భం, అంతరిక్షం ఇలా ఎన్నింటిలోనో దైవం ధనాన్ని నింపి ఉంచింది. ఇలా వేదం ధన విస్తారతను ప్రథమ వాక్యంలో వివరించి దానిని పొందగలిగే సూత్రాలను వివరిస్తూంది.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు