స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-33

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
యజ్ఞకర్త చెడిపోడు
నూ చిత్స భ్రేషతే జనో న రేషన్మనో యో అస్య ఘోరమావివాసాత్!
యజ్ఞైర్య ఇంద్రే దధతే దువాంసి క్షతస్స రాయ ఋతపా ఋతేజాః॥
ఋ.7-20-6.
ప్రతి పదార్థం:- రేషత్= కష్టాలననుభవిస్తూ; ఘోర= భయంకరమైన బాధల ననుభవిస్తూ కూడ; యః= ఎవడు; యజ్ఞైః= యజ్ఞయాగాది క్రతువులను చేయడం ద్వారా, ఇంద్రే= పరమాత్మను; దువాంసి= పూజావిధులతో; దధతే= శ్రద్ధతో అర్చిస్తాడో, మా చిత్= ఎప్పుడైనా ఎవడైనా; భ్రషతే= చెడిపోయాడా?; న= లేదని; అస్య మనః= అట్టి స్థిరమనస్సు కలిగి యుంటాడో; సః= అతడు; ఋతపాః= ధర్మసంరక్షకుడై; ఋతేజాః= ధర్మపుత్రులై; రాయః- ధనానికి, మోక్ష ధనానికి; క్షయత్= ఆశ్రయులై యుంటారు.
భావం:- ఘోరమైన కష్టాలను- బాధలను అనుభవిస్తూకూడ యజ్ఞయాగాది క్రతువులను శ్రద్ధతో నిర్వహిస్తూ పరమాత్మను అర్చిస్తూ ఉంటాడో అట్టి వాడెక్కడయినా ఎప్పుడయినా చెడిపోయాడా? అన్న స్థిరచిత్తం కలిగి యుంటాడో అట్టివాడు ధర్మపుత్రుడై- ధర్మసంరక్షకుడై లౌకిక ధనానికి- మోక్ష ధనానికి కూడ ఆశ్రయుడై యుంటాడు.
వివరణ:- భగవన్మార్గంలో నడిచే జనులను చూచి సామాన్య జనులు ‘బాగా తిను, త్రాగు, సుఖాలననుభవించు. కనిపించే సుఖాలను విడిచి కానరాని సుఖాల వెంట పరుగులు తీస్తావెందుకు? జీవితాన్ని పాడుచేసుకొంటావెందుకు? లౌకిక సుఖ భోగాల ననుభవించనంత మాత్రాన వనం శాశ్వతంగా ఉంటందా?’అని హిత వచనాల వంటి దుర్వచనాలను బోధిస్తూ ఉంటారు.
మరొక విషయం- మనసు ఆనందంతో ఉయ్యాలలూగించి ముందు సుఖాన్ని పరిణామంలో దుఃఖాన్ని కలిగించే భయంకర విషయ బాహుళ్యాన్ని నిరంతరమూ అనుభవిస్తూ ఉంటుంది. నిజానికి విషయాలు విషమే. విష సర్పాలే. వాటి కాటుపడితే ఎవరూ రక్షింపలేరు. ధనం-గౌరవం చివరకు స్వజనులు విడిచిపోయినా విషయాసక్తుడికి లక్ష్యమే ఉండదు. ఈ సత్యానే్న ఋగ్వేదం ‘‘పితా మాతా భ్రాతర ఏనమాహు ర్న జానీమో నయతా బద్ధమేతమ్’’ (.10-34-4) తల్లి-తండ్రి- సోదరులు సహితం ఈతడు (విషయాసక్తుడు) ఎవరో మాకు తెలియదు. ఇతణ్ణి బంధించి తీసుకుపొండి అని రాజభటులతో అంటారని వ్యాఖ్యానించింది. అంటే విషయ లోలుణ్ణి ఆత్మీయబంధువులు సహితం పరాయివాడుగా చూస్తారు. ఒక్కడు కూడ తనవాడిగా తలంపరు అని అంతరార్థం.
ఋణానా బిభత్సద్ధనమిచ్ఛమానో- నే్యషామస్తముపనక్తమేతి॥ ఋ.10-34-10॥
మా నో ఓరేణ చరతాభి ధృష్ణు॥ ఋ.10-34-14॥
లోకంలో విషయాసక్తుడు కానివాడెవడు? అతడు దుర్వ్యసనపరుడు కావడం కూడ ఎంతో సహజం. అట్టివాడు మొదట చేసేది అధిక దుర్వ్యయం. దానివల్ల ధనహీనుడై పరమ దారిద్య్రాన్ని అతడు అనుభవించక తప్పదు. ఆ దారిద్య్రం వలన మనిషి మొదటగా పాల్పడేది ధర్మభ్రష్టతకే. ఈ విధంగా మనిషి ధర్మభ్రష్టుడే కాకుండా తద్వారా పాపకర్ముడై అధోజన్మలను పొందకుండ ఉండడానికి కారుణ్యంతో వేదర్షి యిలా పరమోపాయాన్ని తెలుపుతున్నాడు.
యజ్ఞైర్య ఇంద్రే దధతే దువాంసి క్షయత్స రాయ ఋతపా ఋతేజాః॥ ఋ.7-20-6॥
భావం:- యజ్ఞయాగాది క్రతువుల ద్వారా పరమాత్మనెవడు భక్తిశ్రద్ధలతో పూజిస్తాడో అతడు ధర్మపరాయణుడై ధర్మదేవతకు ప్రియపుత్రుడై ఇహలోక ధనానికి పరలోక మోక్ష ధనానికి కూడ ఆశ్రయణీయుడు కాగలడు.