స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇలా ఎన్నో అర్థాల నిమిడించుకొన్న కార్యాచరణ రూపమే యజ్ఞం. యజుర్వేదంలోని 18వ అధ్యాయంలోని మొదటి ముప్పది ఎనిమిది మంత్రాలలో యజ్ఞార్థంగా జీవనోపయోగియైన సమస్త పదార్థాలను చెప్పి ఒక ప్రత్యేక మంత్రంలో ‘యజ్ఞేన కల్పంతామ్’ ‘‘ఈ పదార్థాలన్ని యజ్ఞార్థాలు కావాలి’’ అని ఆదేశం కనబడుతుంది. కాబట్టి సర్వభూత రహితమైన సమస్త కార్యాలు యజ్ఞార్థకాలే. ఈ మాట ననుసరించి దానం, సత్సంగం, సత్పురుషుల పూజ ఇలా ఎన్నింటినో ఈ యజ్ఞార్థాలుగా స్వీకరించవచ్చు. ఈ అంశాలన్ని వైయక్తికంగానే గాక సామాజికపరంగా దేశ సంరక్షణార్థమై మహాయజ్ఞ స్వరూపవౌతాయి. ఉదాహరణకు సత్సంగం తీసుకోండి. సత్సంగం వ్యక్తిని ఉన్నతుణ్ణిచేస్తుంది. అలాగే దేశ సంరక్షకులు మరో దేశ సంరక్షకులతో సత్సంగంచేస్తే వారిలో నూతన భావాలుదయించి దేశ సంరక్షణ విషయంలో ద్విగుణీకృతమైన ఉత్సాహం కనిస్తుంది. అలాగే సత్పురుషుల ఆరాధన. సమాజపరంగా అది జరగకుంటే వారు నిరాదరణ వేదనాభరితులై దేశానికి అవసరమైన స్థాయిలో తమ సేవలనందించలేకపోతారు. ఈ గుణాలు ఏనాటికైనా సార్వజనీనమైనవి. సార్వకాలికమైనవి.

నా నేల తల్లియే నా గౌరవ చిహ్నం

సత్యం బృహదృతముగ్రం దీక్షా తపో బ్రహ్మ యజ్ఞః పృథివీం ధారయంతి
సా నో భూతస్య భవ్యస్య పత్న్యురుం లోకం పృథివీ నః కృణోతు॥

భావం:- సృష్టిలోని అన్నిటికన్న మిన్నగా కోరదగినది, సర్వశ్రేష్ఠమైనది సత్యధర్మమే. అదే ఋతాన్ని, మహాబలసంపన్నతను దీక్షావిధిని, తపస్సును, బ్రహ్మజ్ఞానాన్ని, బ్రహ్మచర్యాన్ని, యజ్ఞాన్ని, భూమిని వహిస్తున్నది. ఆ సత్యమే గడిచిన, రాబోయే కాలాలకు సంరక్షురాలైన ఈ భూమండలాన్ని మాకు విస్తారమైన గౌరవ చిహ్నంగా చేయునుగాక!
వివరణ:- మాతృభూమి స్వాతంత్య్ర పరిరక్షణకై దేశ పౌరులు ఎట్టి గుణాలు కలిగియుండాలో ఈ మంత్రం వివరిస్తూంది.
సత్యమ్:- శాశ్వత ధర్మం. దేశభక్తులయిన పౌరులు ఈ సత్యధర్మంపైన బహుశ్రద్దాళువులై యుండాలి. ఈ సత్యధర్మ విరహితులు దేశాన్ని ఎంతటి అధోగతికైనా దిగజార్చుతారు. సత్యమహిమను వర్ణిస్తూ ‘సత్యేనోత్త్భితా భూమిః’ (అథర్వణవేదం. 14-1-1) ‘‘సత్యధర్మం మీదనే భూమి నిలిచియుంది’’అని అథర్వణవేదం హెచ్చరించింది. మనుస్మృతి కూడ ‘నాస్తి సత్యాతృపరో ధర్మః’ ‘‘సత్యాన్ని మించిన ధర్మంలేదు’’ అని వేద సందేశానే్న నిర్దేశించింది.
బృహత్:- అన్నింటికన్న మిన్న అని ఈ పదానికర్థం. అంటే దేశ పౌరులకు అన్నింటకన్న మిన్నగా కోరదగినది ఆ సత్యధర్మమే కావాలి. ఈ భావన లేని పౌరుల వలన దేశం పారతంత్య్రం కావడానికి ఎంతో సమయం పట్టదు.
ఋతమ్:- ధర్మప్రవర్తన, నియమపాలన ఋత శబ్దానికర్థం. ఈ ఋతం వైయక్తిక జీవితానికెంత ముఖ్యమో సామాజికపరంగా సర్వజనాభివృద్ధి, దేశ స్వతంత్ర సంరక్షణకు కూడ పౌరులయందీగుణం అంతే అవసరం. అందుకే ఋగ్వేదం ఈ ఋత ప్రాముఖ్యాన్ని ‘ఋతస్య దేవా అను వ్రతా గుః’ (ఋ.1-65-2) ‘‘దేవతాభక్తులు సహకరించేది ఋతానుకూలశీలురకు మాత్రమే’’అని నిర్దేశించింది. ఒక గ్రామమో, దేశమో కాదు సమస్తమైన ద్యావాపృథువులన్నీ ఈ ఋతధర్మం మీదనే ఆధారపడి మనుగడ సాగిస్తూ ఉన్నాయని ‘ఋతాయ పృథివీ బహులే గభీరే’ (ఋ.4-32-10) ఋగ్వేదం ఒకసారి చెప్పిన విషయానే్న ప్రాధాన్యదృష్ట్యా మరోసారి చెప్పింది.
- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు