స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎందుకంటే కారణాలేవయినా నాటివారి కంటే నేటి కాల దంపతులే విడివిడిగా జీవించే దౌర్భాగ్యస్థితిలో ఉన్నారు. అందుకే ‘ఇహైవ స్తం మా వి ష్టవ్’ ‘‘మీరిక్కడే విడివిడిగాగాక కలిసియే ఉండండి’’అని వేదం దంపతులకు సార్వకాలికమైన, సార్వజనీనమైన సందేశాన్ని విన్పించింది.
వివాహ ప్రథమోద్దేశ్యం సంతానప్రాప్తియే కదా. అది ఎక్కడున్నా, ఎలాగున్నా కలుగుతుంది కదా? జీవితమంతా కలిసి లేకున్నా నష్టమేమి? అని ఆధునికులు ప్రశ్నింపవచ్చు. దీనికి సమాధానాన్ని మనువు తన మనుస్మృతిలో సతార్కికమైన సమాధానాన్ని యిలా చెప్పాడు.
సంతుష్టో భార్యయా భర్తా భర్ర్తా భార్యా తథైవ చ
యస్మినే్నవ కులే నిత్యం కల్యాణం తత్ర వై ధ్రువమ్‌॥
యని హి స్ర్తిన రోచేత పుమాంసం న ప్రమోదయేత్‌
అప్రమోదాత్పునః పుంసః ప్రజనం న ప్రవర్తతే॥ (మను.3-60,61)
భావం:- ‘‘్భర్య ఎడల భర్త, భర్త ఎడల పరిపూర్ణ సంతుష్టిగల దంపతుల యింటనే సౌభాగ్యం, ఐశ్వర్యం తాండవిస్తుంది. ఒకవేళ భార్య భర్త ఎడల ప్రీతి లేనిదయితే ఆమెవలన ఆ పురుషుడికి సంతాన భాగ్యం కలుగదు’’ అందుకే అథర్వణవేదం ‘చక్రవాకేవ దంపతీ’(అథ.14-2-64) ‘‘చక్రవాక పక్షుల జంటవలె దంపతులు పరస్పరం ప్రీతి కలిగి యుండాల’’ని ప్రబోధించింది. అప్పుడే పెండ్లినాడు వధూవరులుగా ‘ప్రజామా జనయావహై’ ‘‘రా! మనమిద్దరం సంతానాన్ని కందాం’’ అని చేసిన ప్రమాణం వారి దాంపత్యంలో సార్థకమవుతుంది. అప్పుడే వారు పుత్ర పౌత్రాదులతో నూరేండ్ల జీవితాన్ని ఆనంద, ఐశ్వర్యాలతో అనుభవిస్తారు.
**
దేశ సేవయే భగవత్సేవ
యేన దేవం సవితారం పరిదేవా ఆధారయన్‌
తేనేమం బ్రహ్మణస్పతే పరి రాష్ట్రాయ ధత్తన॥ అథర్వ.19-24-1॥
భావం:- ఓ మహాజ్ఞానీ! నిష్కాములైన మహాత్ములు దేని ద్వారా సర్వోత్పాదకుడైన భగవంతుని అన్నివిధాలుగా సేవిస్తున్నారో ఆ ప్రకారంగా జనులు ఈ దేశాన్ని అన్నివిధాలుగా సేవించాలి.
వివరణ:- వేదాలలో దేశాభివృద్ధికి ప్రణాళిక లేమయినా ఉన్నాయా? అన్న సందేహం ఇతరులకు కలుగుతూ ఉంటుంది. వేదాలను అధ్యయనం చేసినవారలా భావించరు. వేదాలలో దేశాభివృద్ధి వ్యూహాలు ఎన్నో ఉన్నాయి. యజుర్వేదంలోని 10వ అధ్యాయంలోని మొదటి నాలుగు మంత్రాలలో దేశాభివృద్ధిని గూర్చి విపులమైన వివరణలున్నాయి. అట్లే యజుర్వేదంలోని 22వ అధ్యాయంలో దేశంలో ఏమేమి ఉండాలో దానికి సంబంధించిన సంక్షిప్తమైన వివరణాత్మకమైన వర్ణనలు కనబడుతూ ఉన్నాయి. అథర్వ వేదంలోని 12వ కాండ మొదటి సూక్తమంతా మాతృభూమి విషయాత్మకమే. వేదం స్వభావతః ఉత్తమ దేశనిర్మాణ భావనా ప్రచారకమే. ఉదాహరణకు ఈ మంత్రాన్ని చూడండి. ‘సా నో భూమి స్విషిం బలం రాష్ట్రే దధాతూత్తమే’ (అథర్వణ వేదం. 12-1-8) ‘‘ఈ నా మాతృభూమి ఉత్తమ రాష్ట్రంగా నిలిచేందుకు విజ్ఞానాన్ని (కాంతి) మరియు శక్తిని వహించి యుండుగాక!’’ ఇక్కడ మాతృభూమి అంటే మాతృదేశంలోని జనులనియే అర్థం. దేశమంటే మనుషులే కదా. ఆ మనుషులు విజ్ఞానవంతులై, శక్తివంతులై మాతృభూమి ప్రతిష్ఠను ప్రతిష్ఠింపచేయాలని వేద మనోగతం.
దేశానికి సేవ చేయడం సామాన్యమైన విషయం కాదు. నోటితో తాము దేశ సేవకులమని అంటారు. కాని ఆ దేశసేవ ఎవరో నిష్కాములైన మహాపురుషులకు మాత్రమే సాధ్యం. అది ఎంత పవిత్రమైనదో, ఎంత నిష్కామ జన్యమైనదో. ఎంత త్యాగపూర్ణమైనదో వివరిస్తూ మంత్రం పూర్వార్థవాక్యంలో ‘యేన దేవం సవితారం పరి దేవా అధారయన్’ ‘‘నిష్కాములైన మహాపురుషులు సవితారం= భగవానుని; యేన అధారయన్= దేనితో సేవిస్తారో మహాపురుషులు ‘తేనేమం పరిరాష్ట్రాయ ధత్తన’ వానితో దేశంకోసం అన్నివిధాలుగా సేవచేస్తారని సోదాహరణంగా ప్రబోధించింది. దీనినిబట్టి దేశసేవ భగవత్సేవ అంతటి పవిత్రమైనదని వేదం భావిస్తున్నట్లు స్పష్టపడుతుంది.
- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు