స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
విశేషమేమంటే దేశసేవను భగవత్సేవతో పోల్చిచెప్పడం వలన భగవత్సేవకు ఆధ్యాత్మిక జ్ఞాన సంపద, నిష్కామ రూపమైన భగవత్సేవాసక్తి ఎంత ముఖ్యమో దేశసేవకు ఆధ్యాత్మిక జ్ఞాన సంపద, నిష్కామ రూపమైన భగవత్సేవాసక్తి ఎంత ముఖ్యమో దేశసేవకు కూడా ఆ భావనాసంపదయే అంత ముఖ్యమని వేదం ధ్వన్యాత్మకంగా కావ్య పరిభాషలో చెప్పడమే వేద భాషా మర్మం. ఈ వేద భాషామర్మజ్ఞులే అచ్చమైన దేశసేవకులు. దేశభక్తులు. దేశప్రతిష్టా నిర్మాణ దక్షులు. వారికి దేశసేవ భగవత్సేవయే. అదే వారి ఆధ్యాత్మిక సంపద. అదే వారి జ్ఞాన సంపద.
**
ఇహపర సౌఖ్యానందా లెవరికి?
యే రాత్రి మనుతిష్ఠంతి యే చ భూతేషు జాగ్రతి
ప్రశూనే్య సర్వాన్రక్షంతి తే న ఆత్మసు జాగ్రతి తే నఃపశుషు జాగ్రతి॥

భావం:- సుఖసాధనాలను నిర్మాణం చేసుకొనేవాడు, సుఖించే విధంగా రాత్రి భగవదనుష్ఠానం చేసేవాడు ఆనందించగలడు. సృష్టిలోని సమస్త పదార్థాలలోని గుణ, ధర్మాల విజ్ఞానం కలిగినవాడు వానివలన ప్రయోజనం పొందిన రీతిగా సృష్టిలోని జీవులలో పరివ్యాప్తమైన ఏకత్వ గుణాన్ని చూడగల్గినవాడు ఆనందమనుభవించగలడు.
అట్లే సమస్త పశుజాతులను రక్షణచేసేవాడు సుఖంగా జీవించ గలిగినట్లుగా సమస్త పశువులను అంటే చరాచర జీవులను రక్షించేవాడు మా ఆత్మలలో నిత్యమూ జాగృతులై యుంటారు.
వివరణ:- ఈ మంత్రంలో సమస్తజనుల హృదయాలలో ఎవరు నిరంతరంగా జాగృతులైయుంటారో వారిని శే్లషాలంకారంలో అభివర్ణిస్తూంది. యే రాత్రి మనుతిష్ఠంతి:- ఎవరు రాత్రిని కల్పిస్తారో మరియు ఎవరు రాత్రి అనుష్ఠానం చేస్తారో అని ఈ వాక్యానికర్థం.
ఇక్కడ రాత్రి శబ్దానికి రెండర్థాలు. 1. జీవన సుఖమయ సాధన సామగ్రి 2. రాత్రి. ఈ అర్థాలననుసరించి జీవన సుఖమయ సాధన సామగ్రిని తయారుచేసుకొనెడు మరియు రాత్రి అనుష్ఠానం చేసేవాడు అని రెండు వాక్యార్థాలు ఏర్పడతాయి. వీనిమధ్య ఔపమ్యాన్ని భావిస్తే జీవన సుఖమయ సాధన సామగ్రిని నిర్మాణం చేసేవాడు జీవితంలో సుఖపడుతున్నాడని, రాత్రి అనగా ఏకాంత సమయంలో భగవదనుష్ఠానం చేసేవాడు ఆనందం పొందుతున్నాడని వాక్యార్థం సిద్ధిస్తుంది.
2. యే చ భూతేషు జాగ్రతి:- ఇచటగల భూత శబ్దంపై రాత్రి శబ్దంవలె శే్లషార్థకం. భూతశబ్దానికి సృష్టిలోని సమస్త వస్తుజాలమని సమస్త జీవులని రెండర్థాలు. మొదటి అర్థాన్ని అనుసరించి సృష్టిలోని సమస్త వస్తు, ద్రవ్యాలలోగల గుణాల మరియు ధర్మాల విజ్ఞానం కలిగియుండటమని వాక్యార్థం.
అట్టి జ్ఞానంకలవాడు సుఖాన్ని పొందుతాడు. అట్లే సమస్తజీవులలో తాను జాగృతుడు= చైతన్యవంతుడై యుండేవానిగా భావించేవాడు కూడ సుఖపడతాడని రెండవ వాక్యార్థం. ఈ రెండు వాక్యార్థాలను సమన్వయిస్తే సృష్టిలోని పదార్థ మరియు ద్రవ్యాలలోని గుణ, ధర్మాలను గ్రహించినవాడు భౌతికంగా సుఖపడినట్లుగా సమస్తజీవులు తనవంటి వారేనని అభేద జ్ఞానాన్ని పొందినవాడు ఆధ్యాత్మికంగా ఉన్నతిని పొంది ఆనందమనుభవిస్తాడని వాక్యార్థం.

- ఇంకావుంది...