స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
శుక్ల యజుర్వేద మీ మంత్రార్థానే్న-
యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మైవాభూద్విజానతః
తత్ర కో మోహ. కః శోక ఏకత్వమనుపశ్యతః శు.య.వే. 40-7
‘‘సమస్తజీవులు ఆత్మతో(తనతో) సమానమని భావించిన క్షణంలో ఆ జ్ఞానికి శోకమేమిటి? మోహమేమిటి? అని అనువదించింది.
పశూన్ సర్వాన్ యే రక్షంతి:- సమస్త పశువులను రక్షించేవాడని ఈ వాక్యార్థం. ఇక్కడ పై భూత శబ్దంవలె పశుశబ్దానికి శబ్దగత శే్లషగాక అర్థగత శే్లష మాత్రమే కనబడుతుంది. భౌతికంగా పశువులను రక్షించేవాడు సుఖపడగలడని మొదటి అర్థం. జీవిత లక్ష్యంకూడ పశుహింస చేయకుండ జీవితం నడుపుకోవడమే ప్రధానం కావాలని ‘రాత్రింరాత్రి మరిష్యంత- స్తరేమ తన్వా వయమ్’ (అథ.19-50-3) ‘‘పశుహింసతో ఏ రాత్రియు గడపకుండ శరీరత్యాగం చేసెదముగాక’’అని అహింసాపరుని ప్రార్థనగా అథర్వణవేదం మానవ సమాజాన్ని ఆదేశించింది. చిత్రమేమంటే యజ్ఞ ప్రబోధకమైన యజుర్వేదంలోని మొదటి మంత్రంలో ‘యజమానస్య పశూన్ పాహి’ ‘‘యజమానుని పశువులను రక్షించు’’అని చెప్పబడింది. అంటే యజమానునికంటే వేరయినవారి పశువులను రక్షింప నవసరం లేదా? అని శంకింపవచ్చు.
ఆ సంశయాన్ని కూడ నివారిస్తూ ‘ప్రియః పశూనాం భూయాసమ్’ (అథ.171-4) ‘‘నేను పశుప్రేమికుడను కావాలి’’అని ప్రతి వ్యక్తి భావించి ఆచరించాలని అథర్వవేదం ఆదేశించింది. కాబట్టి పశుహింసకుడుకాక పశుప్రేమికుడే జీవితంలో ఆనందాన్ని అనుభవించగలడు.
ఈ పై మూడు లక్షణాలుగల వ్యక్తి ఐహిక, ఆధ్యాత్మిక సుఖ సంతోషాలతోబాటు పారలౌకిక ఆనందాన్ని కూడ అనుభవింపగలడని వేదమభయప్రదానం చేస్తూ ఉంది.
***
ఆత్మ శక్తి సంపన్నత
అయుతో- హమయుతో మ ఆత్మాయుతం మే
చక్షురయుతం మే శ్రోత్రమయుతో మే ప్రాణో- యుతో
మే- పానో- యుతో మే వ్యానో- హం సర్వః 1॥
దేవస్య త్వా సవితుః ప్రసవే- శ్వినోర్బాహుభ్యాం
పూష్ణో హస్త్భ్యాం ప్రసూత ఆ రభే॥ అథ.19-51-2॥
భావం:- నేను (పది)వేల కొలది శక్తులచేత బలవంతుడను. నా ఆథ్మ కూడ అట్లే బలసంపన్నమైనది. నా కళ్లు, చెవులు, ప్రాణాలు, అపానం, వ్యానం అన్నీ వేలకొలది శక్తియుతమైనవి. నేను సర్వ శక్తిసంపన్నుడను. వేలకొలది శక్తియుతుడవై ప్రభుడవగు నీ ప్రేరణలో ప్రాణ, అపాన రూపమైన అశ్వినులనే పోషక, సంహార శక్తులను బాహువులతో, పోషక తత్త్వాలైన పుష్టి మరియు ధృతి అనే హస్తాలతో ప్రేరితుడవై కార్యారంభం చేస్తాను.
వివరణ:- ఈ మంత్రంలో మానవుని ఆత్మ శక్తి ఘనత ఏమిటో విపులంగా వివరించబడింది. దీనిని తెలుసుకొనే ముందుగా సృష్టిలోని ప్రాకృతిక శక్తుల మహాశక్తి ఎట్టిదో పరిశీలిద్దాం. తొమ్మిదిన్నర కోట్ల మైళ్ల దూరంలోఉన్న సూర్యుడు భూమినెంత వేడెక్కిస్తున్నాడు! అడవులల్లో చెలరేగే కార్చిచ్చును వర్షధారలు క్షణంలో అర్పివేయగలుగుతున్నాయి. వాయుశక్తి ఎంత ఘోరమైనది. రెప్పపాటు కాలంలో ఎంత అనర్థాన్ని సృష్టించగలదు! విద్యుత్తును గమనించారా? అది ఎంత వెలుగులను చిమ్ముతుందో అంత ఘోర వినాశనాన్ని సృష్టించగలదు. ఇలా ప్రాకృతిక శక్తుల మహిమను ఎంతని చెప్పగలం?
- ఇంకావుంది...