స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎందుకంటే ఆత్మశక్తికి మూలాధారం దైవమే కదా. జ్ఞానులు దానిని విస్మరింపకపోవడం చేతనే వారిలో ఆత్మశక్తి ప్రబుద్ధమై, ప్రవృద్ధమై వారిని లోకంలో లోకోత్తర శక్తిసంపన్నులుగా విఖ్యాతపరుస్తుంది.
***
ఒంటరిగానే నీవు ప్రయాణించాలి
యమస్య లోకాదధ్యా బభూవిథ ప్రమదా మర్త్యాన్ ప్ర యునక్షి ధీరః
ఏకాకినా సరథం యాసి విద్వాన్‌త్స్వప్నం మిమానో అసురస్య యోనౌ॥

భావం:- ఓ జ్ఞానీ! నీవు భగవానుడైన యమలోకంనుండి వచ్చి ఈ భూలోకంలో జన్మించావు. తోడి మానవులకు ధీరుడవై సంతోషాన్ని కలిగిస్తున్నావు. చిత్రమేమిటంటే జ్ఞానులు సహితం ప్రాణరక్షకులుగా జన్మించేందుకు అవసరమైన కర్మవాసనలను వెంటబెట్టుకొని ఒంటరిగా పరలోక యాత్ర సాగిస్తున్నారు.
వివరణ:- ఈ మంత్రం ఒకే అంశాన్నిగాక మూడు విభిన్నాంశాలను వివరించింది. 1. నీవెక్కడ నుండి ఈ లోకంలోనికి వచ్చావు? 2. నీవు ధైర్యంగల వాడవయితే ఇతరులకు ఆనందం కలిగించు. 3. మానవుని జీవితమే ఒక సుదీర్ఘ స్వప్నం.
1. నీవెక్కడ నుండి ఈ భూలోకంలోనికి వచ్చావు? అన్న ప్రశ్నకు సమాధానంగా ‘యమస్య లోకాదధ్యా బభూవిథ’ ‘‘్ధర్మాధ్యక్షుడు మరియు న్యాయశీలి అయిన భగవానుని లోకంనుండి వచ్చావు’’అని వేదం చెప్పింది. అంటే భూలోకంలోని జన్మ, మరణచక్రానికి ముందు జీవుడు పరతత్త్వమైన బ్రహ్మలోకంలో ఉండేవాడని వేదాభిప్రాయం.
2. ‘మానవుని ప్రథమకర్తవ్యం ఇతరులకు సుఖసంతోషాలు కలిగించడమే, నని వేద నిర్దేశం. దీనినే ‘ప్రమదా మర్త్యాన్ ప్రయునక్షి ధీరః’ ‘‘నీకు ధైర్యమే ఉంటే ఇతరులకానందం కలిగించగలవు’’అని వేదం సూటిగా ఆదేశించింది. వేదమీవచనంలో ‘్ధరః’ అన్నమాట ప్రయోగించడంలో ఒక పరమార్థముంది. ఇతరులకు ఆనందం కలిగించాలంటే ఏ వ్యక్తిఅయినా స్వార్థాన్ని ముందుగా వీడి త్యాగం చేయగలగాలి. నిజానికి ‘త్యాగం’ ఒక తపస్సు. దానికి ఎంతో ధైర్యమున్నవాడే తప్ప సామాన్యుడు పూనుకోలేడు. కాబట్టి త్యాగశీలతతో ధైర్యంగా పరులకానందం కలిగించే కల్యాణ కార్యాలు చేయమని అతడే అమృతత్వాన్ని పొందగలడు ‘త్యాగే నైకే అమృతత్వ మానశుః’అనే గంభీరాశయంతో ధైర్యముంటే అన్న విధి వాక్యాన్ని వేదం పేర్కొంది.
3. మనుష్య జీవితమే ఒక మహా సుదీర్ఘ స్వప్నం. నిరంతరం స్వప్నం సాగుతూనే ఉంటుంది. మనిషి కలను కని కని ఎనె్నన్నో కల్పనలుచేస్తూ పోతాడు. చివరకు స్వప్నాలు కనికని అలసిపోతాడు. స్వప్నమాగిపోతుంది. స్వప్న వస్తువేదీ కూడ కంటికి కనబడదు.
అలాగే జీవిత స్వప్నంలో కన్న వస్తువులూ అంతే. జీవితమూ అంతే. స్వప్నం మిథ్య అయినట్లుగా జీవితమూ మిథ్యే. స్వప్న జగత్తులోని సమస్త వస్తుజాలాన్ని విడిచి ఒక్కడవే మిగిలినట్లు జీవిత స్వప్నంలోని సమస్తాన్ని విడిచి నీవొక్కడవే ప్రయాణం సాగిస్తావు. చిత్రమేమంటే స్వప్న అనుభూతులు జాగ్రదవస్థలో నిన్ను వెంటాడినట్లుగా జీవిత స్వప్నంలో నీవు కల్పించుకొన్న సంసారానుభూతులు వాసనలుగా జీవిత స్వప్నానంతరం ఒంటరిగా ప్రయాణించే నీ వెంట వస్తాయి.

- ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు