స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
‘అథ యదిదమస్మిన్ బ్రహ్మపురే దహరం పుండరీకం వేశ్మ’ (్ఛం.8-1-1) ‘‘ఈ బ్రహ్మపురమనే వేశ్మ= గృహంలో కమలాన్ని పోలిన పుండరీకమనే చోటుంది’’అనే వాక్యం స్పష్టంగా పుండరీక శబ్దానికి విశేషణంగా గృహవాచకమైన ‘వేశ్మ’ శబ్దం జతచేసి చెప్పింది. ఈ పుండరీకం ఎలా ఉంది? ‘నవద్వారం’ తొమ్మిది ద్వారాలు కలిగి ఉంది? త్రిభిర్గుణై రావృతమ్ సత్వ, రజ, స్తమో గుణాలనే మూడింటి చేత ఆవరింపబడింది. మరి ఆ నవద్వార గృహంలో ఎవరున్నారు? ‘తస్మిన్యధ్యక్షమాత్మన్వత్’ ‘‘జీవాత్మతో జతగూడిన పరమాత్మ కొలువై యున్నాడట. ఆయనను జీవుడు తప్పక అనే్వషించమని ‘తస్మిన్యదంత స్తదనే్వష్టవ్యం తద్వావ విజిజ్ఞాసితవ్యమ్’ (ఛందోగ్యం 8-1-1) ఛాందోగ్యోపనిషత్తు నిర్దేశించింది. సరే అతడిని గుర్తించడమెలా? అన్న విచికిత్సకు జవాబుగా అతడు పరమాత్మ ‘ఆత్మన్వత్ యక్ష.’ జీవాత్మతో కలిసి ఉంటాడని ప్రస్తుత మంత్రమూ ‘గుహాం ప్రవిష్టౌ’ (ముండకోపనిషత్తు 1-3-1) ‘హృదయ గుహలో జీవాత్మ, పరమాత్మ ఇద్దరూ ప్రవేశించారు అని ముండకోపనిషత్తూ వివరించాయి. ఈ విషయమే అథర్వణవేదం మరో సందర్భంలో ఇలా వివరించింది. ‘‘దేవతలకు కూడా అజేయమైన ఎనిమిది చక్రాల, నవద్వారాల నగరముంది. దానిలో బ్రహ్మానంద స్థానానికి చేర్చే ప్రకాశమయమైన సువర్ణమయ కోశమొకటుంది. అందలి మూడు అంతరాలలో మూడింటి (సత్వ రజ స్తమో గుణాలు) సహకారంతో ఉండే ఆత్మ సహితుడై పరమాత్మ యక్ష నామాత్మకుడై ఉంటాడు. బ్రహ్మవేత్తలు ఆయననే అనే్వషించి చేరుకొంటారు.’’ మూలాధారంనుండి బ్రహ్మరంధ్రంవరకు ఎనిమిది చక్రాలున్నాయి. మూలాధారం నుండి కుండలినీ శక్తి లేచి వీని మధ్యనుండి ప్రయాణించే సమయంలో అప్పుడప్పుడు వీనిమధ్య ఆగుతుంది.

- ఇంకావుంది...