స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఋతమృతాయ పవతే సుమేధాః’ (ఋ.9-97-23) ‘‘బుద్ధిమంతులు మరియు విద్వాంసులు కేవలం ఋతంకోసమే ఋతాన్ని పవిత్రం చేస్తారు’’అని ఋత పరాయణుల స్వభావాన్ని స్పష్టపరచింది. వారలా ఎందుకు చేస్తారు? అంటే ఋత స్మరణ- ఆచరణచేయకుంటే ప్రాప్తించేది అనర్థమే కాబట్టి. ఆవిధంగా ఆచరింపనివాడు ‘ఋతస్య పంథాం న తరంతి దుష్కృతః’ (ఋ.9-73-6) దురాచారియే. అతడే ఋతమార్గాన్ని అనుసరించడు. మరి ఎటువంటివాడు ఋత ధర్మాన్ని ఆచరించగలడు? ‘సత్యధర్మాణః’ ‘‘సత్యమే స్వధర్మంగా భావించి ప్రవర్తించేవాడే ఆచరింపగల’’డని వేదం నిర్దేశించింది. అట్టి భావన అతడికి ఎలా కలుగుతుందో పేర్కొంటూ ఋగ్వేదం ‘ఋతస్య ధీతిర్వృజినాని హంతి’ (ఋ.4-23-8) ‘‘ఋతాచరణంవలన పాపాలు నశిస్తాయి’’అని ఋతాచరణ సామర్థ్యాన్ని ప్రకటించింది. అదెప్పుడు సాధ్యం? అంటే ఋతాన్ని అగ్నితో అంటే జ్ఞాన సమృద్ధితో ఆచరించినప్పుడే. అది చాలా మధురమైనది. తప్పక ఆస్వాదించుమని ‘ఋతస్య జిహ్వా పవతే మధుప్రియమ్’ (ఋ.9-75-2) ‘‘ఋతాచరణ చేసేవాని జిహ్వ అభీష్టమైన ప్రీతిని కల్గిస్తుంది’’అని ఋగ్వేదం ఋతాచరణకు ప్రచోదన కల్గిస్తూంది.
***
ఆరుమంది శత్రువులను చంపు
ఉలూకయాతుం శుశులూక యాతుం జహి శ్వయాతుముత కోకయాతుమ్‌
సుపర్ణయాతుముత గృధ్రయాతుం దృషదేవ ప్ర మృణ రక్ష ఇంద్ర॥

భావం:- గుడ్లగూబ (మొహం), తోడేలు(ద్వేషం), కుక్క (మత్సరం), పిచ్చుక (కామాతురత), గరుడుడు (అహంకార వృత్తి), గ్రద్ద (లోభప్రవృత్తి). ఈ జంతువుల నడివడికను ఓ ఆత్మా! నీవు అనుసరించవద్దు. విడిచిపెట్టు. నీలో ఉన్న ఆ రాక్షస ప్రవర్తనలను రాళ్లవంటి సాధనోపాయాలతో కొట్టి చంపు.
వివరణ:- మోక్షమార్గంలో పయనించే సాధకుడిని పట్టి బాధించే శత్రువు లారుగురుంటారు. వారు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. వారిని రాళ్లతోకొట్టి చంపమని అంటే రాళ్లవంటి కఠిన సాధనోపాయాలతో కొట్టి చంపుమని ఈ మంత్రం ముముక్షు సాధకులకు హితోపదేశం చేస్తూంది. ఈ మాట నేరుగా చెప్పక ఆ నడవడికలున్న పశుపక్ష్యాదుల్ని ప్రతీకలుగా చేసి ఈ మంత్రం ఆలంకారికంగా ప్రబోధిస్తూంది.
ఉలూకయాతుమ్= గుడ్లగూబ ప్రవర్తన:- గుడ్లగూబ చీకటిని ఇష్టపడే పక్షి. చీకటి మోహానికి ప్రతీక. ఇదే అన్ని పాపాలకు మూలం. ‘మోహః పాపీయాన్’అని వాత్స్యాయన మహర్షి ఎప్పుడో ప్రకటించాడు. కాబట్టి మోక్షసాధకుడు ఈ మోహాన్ని విడనాడాలని వేదోపదేశం.
శుశులూక యాతుమ్:- శుశులూకమంటే తోడేలు. ఇది క్రూర జంతువు. ద్వేషంవలన క్రూరత్వం జనిస్తుంది. కాబట్టి శుశులూకం ద్వేషానికి ప్రతీక. ద్వేషానికి తల్లి క్రోధం. కాబట్టి తోడేలును దరిచేరనీయని విధంగా క్రోధాన్ని దాని పుత్రుడైన ద్వేషాన్ని దరిచేరనీయరాదని, దూరంగా ఉంచమని సాధకుడికి వేదాదేశం.
శ్వయాతుమ్:- కుక్క ప్రవర్తన. కుక్కకు ప్రధాన దుర్గుణం స్వజాతి ద్రోహం. మాత్సర్యగుణం దీనికి తండ్రి. ఇతరుల ఉన్నతిని సహింపలేకపోవడం ఈ మాత్సర్య ప్రధాన లక్షణం.

- ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు