స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
ముందుగా తనలోని కుటిలతను వీడి ఇతరులను తనతో సమానమైన వారనే దృఢభావనగలవారే సమాజంలో ‘సమత’ను సాధింపగలరని అథర్వవేద నిశ్చితాభిప్రాయం. మరి కుటిలత ఎలా తొలగిపోతుంది? అంటే జ్ఞానంచేత మనస్సు, హృదయాలు సంస్కారం పొందినప్పుడు కుటిలత తొలగిపోతుంది.
అందుకొఱకై మనస్సును హృదయాన్ని సమానంగా జ్ఞానంచేత సంస్కరింపవలసియుంది. అలాకాక హృదయంకంటే మనస్సు అధిక సంస్కారాన్ని పొందితే అతడి హృదయం సూక్ష్మమూ మరియు లలిత భావాల వికాసాన్నీ పొందలేదు. అట్లే మనసుకంటే హృదయమే జ్ఞాన సంస్కారాన్ని అధికంగా పొందితే ఆతడి మనస్సు సూక్ష్మతత్త్వాల వివేచన సమర్థవంతంగా చేయజాలదు. కాబట్టి మనస్సు, హృదయాలు జ్ఞానం చేత సమానంగా సంస్కరింపబడవలసి యుంది. దానిద్వారా శరీరం కూడ సంస్కరింపబడి సమాజంలో సమతను సుస్థాపితం చేసేందుకు మనసు, హృదయాలు సహాయకారులు కాగలవు. తద్ద్వారా సమాజంలో వేదమాదేశించిన సంమనస్యభావం (ఏకతాభావన) సుసంపన్నమవుతుంది. దీనివలన సమసమాజ స్థాపనకు చేసే పరిశ్రమ అందరియందు సమవిభక్తమై ఏకోన్ముఖంగా సాగి ధన ధాన్య సమృద్ధమై సమాజం అభ్యుదయ పథాన పరుగులు తీయగలదు.