స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందరున్నచోటనే కూర్చుండి, మరికొందరు స్వయంగా తామే అన్నిచోట్లకు వెళ్లి, అన్నిచోట్లా నిత్యమూ పాపకార్యాలను, మోసాలనుచేస్తూ ఉంటారు. ఈ రీతిగా ఒక్కరేగాక మరికొందరిని కూడ తమతో కలుపుకొని రహస్యంగా దురాలోచనలుచేసి పాపకార్యాలను చేస్తూ ఉంటారు. వారంతా తామే చేసే పాపకృత్యాలను ఎవడూ గుర్తించలేదని భావిస్తూ ఉంటారు. అట్టివారిని ఉద్దేశించి వేదం ‘రాజా తద్వేద వరుణ స్తృతీయః’ ‘‘వరుణ రూపుడైన భగవానుడు వారిమధ్య మూడవవానిగాచేరి వారి పాపకర్మలను గ్రహిస్తూ ఉంటాడు’’అని హెచ్చరిస్తూ ఉంది. ఉత యో ద్యామతి సర్పాత్ పరస్తాన్న స ముచ్యాతై వరుణస్య రాజ్ఞః॥॥
‘‘ఆకాశ పరిధినిదాటి పాపకార్యాలను చేసినావారు వరుణ భగవానుని దృష్టినుండి తప్పించుకోలేరు’’ ఎందుకంటే-
సర్వం తద్రాజా వరుణో వి చష్టే యదంతరా రోదసీ యత్పరస్తాత్‌
సంఖ్యాతా అస్య నిమిషో జనానామ్....॥ (అథ.వే.4-16-5)
‘‘ముల్లోకాలలో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో ఆ అన్ని విషయాలను వరుణదేవుడు చూస్తాడు. జనుల రెప్పపాటులను కూడ ఆయన లెక్కిస్తాడు.’’
ఈ విశ్వంలో అంతర్యామి దృష్టిపథంనుండి తప్పించుకొని గుప్తంగాఉండే ద్రవ్యంగాని, వస్తువుగాని, మనిషి గాని, మరే ప్రాణిగాని ఉండదు. సృష్టిలో జీవరాశులు మహాభూరి సంఖ్యను (ఒకటి ప్రక్కన 35 సున్నలు) మించిన మహా సంఖ్యాతకం కావచ్చు. ఇంకా ఎక్కువే కావచ్చునేమో. ఎవరు గణింపగలరు? ఆ జీవరాశులన్నింటిని ‘‘బృహనే్నషామధిష్ఠాతా అంతాకాదివ పశ్యతి’’ (అథ.వే.4-16-1) ‘‘సర్వజీవ అధిష్ఠాత (అంతర్యామి)అయిన సర్వేశ్వరుడు సమీపంనుండే దర్శించగలడు. అట్టి సర్వజీవాంతరాత్ముని దృష్టినుండి దాగియుండుట మెవరికి సాధ్యం? కాబట్టి ఏ విధంగా పాపకార్యాలను చేసినా అవి ఆ సర్వభూతాంతరాత్ముని దృష్టిపథానికి వస్తాయన్న ఎరుకతో మానవులు సావధానులై సత్ప్రవర్తునులు కావడం వారికే శ్రేయస్కరం.
**
ఆధ్యాత్మికోన్నతికి సోపానాలు
పృష్ఠా త్పృథివ్యా అహమంతరిక్షమారుహమంత రిక్షాద్దివమారుహమ్‌
దివో నాకస్య పృష్ఠాత్స్వ ర్జ్వోతిరగామహమ్‌॥ అథ.వే.4-14-3॥
భావం:- నేను భూమినుండి అంతరిక్షానికి, అంతరిక్షంనుండి ద్యులోకానికి, ఆ ద్యులోకంనుండి ఆనందమయ ప్రకాశమయ స్వర్జ్యోతి లోకానికి అధిరోహించాను. ఈ మంత్రంలో సాధకుని ఆధ్యాత్మికోన్నతి వివరించబడింది. ఇక్కడ ఆధ్యాత్మిక దశలు 1.పృథివి 2.అంతరిక్షం 3.ద్యులోకం 4. నాకం 5.స్వర్జోృతి అని ఐదుగా చెప్పబడ్డవి. ఇవి క్రమంగా ఒకదానికంటే మరొకటి ఉన్నతమైనవి. ఇవి గూఢార్థకమైనవి కూడ.
- ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు