స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందలి మొదటిది దేహం పృథివి. దీనినే ఆరంభంలో సాధకుడు సర్వస్వంగా భావిస్తాడు. దైవకృపవలన జ్ఞానుల సాంగత్యంలో భగవత్క్థాశ్రవణంవలన కలిగిన జ్ఞాన ప్రబోధం వలన పృథివీ తత్వమైన దేహంకంటే ఉన్నతమైనదొకటి ఉందని సాధకుడికి ఎరుకలోనికి వస్తుంది. అది మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాల సమాహారం. వేదాంతులు ఈ సమాహారానే్న సూక్ష్మ శరీరమంటారు. ఇది మొదటి దేహం (పృథివి)కంటే మరింత సూక్ష్మమైనది మరియు ఉన్నతమైనది. ఈ దశయే అంతరిక్ష దశ. (ఇందు పృథివి మరియు సూక్ష్మశరీరాలు కలగలుపుగా ఉంటాయి.)
ఈ దశలో సాధకుని సాధన సఫలీకృతమై ఆత్మసందర్శన దశకు చేరుకొంటాడు. ఈ దశనే మంత్రం ద్యులోకదశ అని చెబుతూంది. ఈ దశలోని ఆత్మకు సహజమైన ఆత్మ(జ్ఞాన) ప్రకాశంతోబాటుగా వెనుకటి దశలలోనుండి ఇంకా పూర్తిగావిడిపోక సంక్రమించియున్న సుఖలాలస కూడ ఉంటుంది. ఈ సుఖలాలస దశే వేదం ‘నాక’దశ అని వ్యవహరించింది. ద్వివిధమైన ఈ ‘ఆత్మ’దశనే వేదాంతులు ‘నాక ద్యౌ’దశగా చెబుతారు. ఈ దశలోనే సాధకుడు చిరకాలముండడు. నిరంతర సాధనాపటిమతో క్రమంగా సుఖలాలస స్వభావాన్ని సాధకుడు విడిచి కేవలం ఆత్మకు సహజమైన జ్ఞానప్రకాశంతో తన్మయుడవుతాడు. ఫలితంగా సాధకుడు భగవద్దర్శన సాఫల్యాన్ని పొందుతాడు. ఈ దశనే మంత్రం ‘స్వర్జ్యోతి’ దశ అని నామకరణం చేసింది. ఈ స్థితిలో ఆత్మకు ఒక్క భగవదనుభవం తప్ప పొందదగినదేదీ ఉండదు. సాధకుడు చేరిన ఈ స్థితినే సర్వవేదాంతులు ‘ముక్తి’అని ముక్తకంఠంతో సిద్ధాంతీకరించారు.
ఈ ముక్తిదశ మూడవదియైన ద్యులోక దశనుండి ఆరంభమవుతుంది. ఈ విషయాన్ని అథర్వణవేదమే ‘దివస్పృష్టం స్వర్గత్వా మిశ్రా దేవేభిరాధ్వమ్’ (అథ.4-14-2) ‘‘ద్యులోక (3వ దశ) పాలన చేసిన వాడా! ‘స్వః’ ఆనందాన్ని దివ్యులతో ముక్తపురుషులతో కూడి అనుభవించ’’మని నిర్ధారించింది. ముక్తిదశ పొందాలంటే ముందుగా దివ్యుల సాంగత్య భాగ్యం పొందవలసి యుంది. ‘స్వః’ ఆనందం పొందేమార్గం సులభమయినదే.
స్వర్వంతో నాపేక్షంత అ ద్వాం రోహంతి రోదసీ
యజ్ఞం యే విశ్వతోధారం సువిద్వాంసో వితేనిరే॥ (అథ.వే.4-14-4)
‘‘విశ్వతోధార’’ అనే యజ్ఞాన్ని విస్తారంగాచేసిన జ్ఞాని ‘స్వః’ ఆనందాన్ని పొందేందుకు అన్యమైన సాధనాన్ని ఆపేక్షించడు’’అని అథర్వణవేదం సూచిస్తూంది. ఇక్కడ ‘విశ్వతోధార’యజ్ఞమంటే వెనుక చెప్పబడిన పృథివి, అంతరిక్షం మరియు ద్యులోక దశవరకుగల మూడు దశలుగా సాధకుడుచేసే సాధనయే. ఈ సాధన పరిపుష్టమై క్రమంగా ‘నాక’దశ నధిగమించిన ఆధ్యాత్మిక సాధకుడా ఐదవది అయిన ముక్తిదశకు చేరి బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు.

- ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు