స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దానమిప్పించండి
వాజస్య ను ప్రసవే సం బభూవిమేమా చ విశ్వా భువనాన్యంతః
ఉతాదిత్సంతం దాపయతు ప్రజానన్య్రిం చ న. సర్వవీరం ని యచ్ఛ॥

భావం:- అన్నం, ధనం, మరియు జ్ఞానాలను వృద్ధిచేసే కర్మలో మేము సంఘటితులమై ఉన్నాం. మాతోబాటు ఈ పదునాల్గులోకాలు కూడ ఈ కర్మలో సంఘటితమై ఉన్నాయి. ఓ జ్ఞానీ! దానమీయని లుబ్ధులచేత కూడ మాకు దానమిప్పింతువుగాక! మాకు దానవీరులచేత ధనాన్ని అనుగ్రహించండి.
వివరణ:- మేము ఈ సర్వభువనాలు ‘వాజస్య ను ప్రసవే సం బభూవిమ’ ‘‘వాజ= ధనం, అన్నం మరియు జ్ఞానాలను ఉత్పత్తిచేసే కర్మలలో సంఘటితమై యున్నాం’’. అంటే ధనం మరియు అన్నం ఇహలోక సౌఖ్యార్థమయితే జ్ఞానం పరలోక బ్రహ్మానందంకోసం సంఘటితమై ఉన్నాయని భావం. ధనం మరియు అన్నం లేకుంటే ఇహలోక జీవనం సుఖంగా నడవదు. వీని నార్జించాలంటే తప్పక జ్ఞానం ఎంతో అవసరం. పరలోకానికి కాదు ఇహలోక జీవనానికి కూడ చాల ముఖ్యమైనది జ్ఞానం. అది పరలోక సౌఖ్యప్రాప్తికి హేతువయిన ఆధ్యాత్మిక విద్యద్వారానే లభిస్తుంది. కాబట్టి విద్యద్వారా ఇహలోక జీవన సుఖకరమయిన ధనం మరియు అన్నం తదుపరి విద్యద్వారా సిద్ధించిన జ్ఞానంచేత పరలోక సౌఖ్యం చేకూరుతుంది.
భౌతిక జీవితంలో అన్నం మరియు ధనం చాలా ముఖ్యమైనవి. కాబట్టి వానికొఱకై విధిగా మనిషి ప్రయత్నించవలసియుంది. ఆ ప్రయత్న మెట్టిదైయుండాలి? అంటే ప్రతిభాసహితమై ఉండాలి. మరి ప్రతిభ ఉండినా దానిని గుర్తించి ప్రతిభోచితమైన అన్న, ధనాలను దానంచేసే దాత ఉండాలి కదా. మరి ఆ దాతకు దానంచేసే సద్బుద్ధికూడా ఉండాలికదా. మరి అట్టి సద్బుద్ధినిచ్చి ‘ఉతాదిత్సంతం దాపయతు ప్రజానన్’ ‘‘ఓ దేవా! దానమీయని లుబ్ధునకు కూడ దానంచేసే ప్రేరణ కల్గించు’’మన్న ఒక ధనార్థి చేసిన ప్రార్థన అథర్వణ వేదంలో కనబడుతుంది.
చిత్రమేమంటే ధనం లేనివాడు దాతలనర్థిస్తాడు. మంచిదే. కాని ఏదో విధంగా ధనం సమకూరితే అది లోభత్వాన్ని పెంచుతుంది. ఇది సామాన్యుల స్వభావం. మరి జ్ఞానియో!! అతడికి చేకూరిన ధనమెక్కడ లుబ్ధత్వాన్ని కల్పిస్తుందో అన్న భయం వెంటాడుతుంది. అందుకే-
‘త్వం నో దేవ దాతవే రయిం దానాయ చోదయ’ (అథర్వణవేదం 3-20-5) ‘‘ఓ దేవా! మా ధనాన్ని దానార్థమై వృద్ధిచెందించు’’మన్న ఒక జ్ఞాని ప్రార్థన కూడ అథర్వణవేదంలో కనబడుతుంది. ఈ సందర్భంగా దానమేరీతిగా చేయాలో వివరించే తైత్తిరీయోపనిషత్తు వచనాల నుదాహరించడం అప్రస్తుతం కాదు.
శ్రద్ధయా దేయమ్. అశ్రుద్ధయా-దేయమ్. శ్రీయాదేయమ్
హ్రియా దేయమ్. భియా దేయమ్. సంవిదా దేయమ్. (తై.ఉ.1-11-3)
దానం శ్రద్ధగా చేయాలి. అశ్రద్ధగా చేయరాదు. ఐశ్వర్యం కొలది చేయాలి. బిడియపడుతూ చేయాలి. భయపడుతూ చేయాలి. పాత్రాపాత్రతలను విచారించి చేయాలి.

- ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు