స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం--35

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు

ఈ సద్గుణాల చేత యజ్ఞకర్తలు ‘నృషాచ’ జనసామాన్యంతో మమేకమై ప్రవర్తించగలరు. ఆ విధంగా వారు సర్వజనుల సహాయ సహకారాలను పొందుతూ లోకోపకారులగుదురు. ఈ విధంగా యజ్ఞం లోకోపకారమూ- సర్వజన సంరక్షకమూ- సర్వధన రక్షకమై ఖ్యాతి వహించింది. ఇట్టి యజ్ఞాన్ని ఆచరించి భగవదర్చన చేసిన మనుజుడెవ్వడు బాధలు- కష్టాలవలన ఎన్నడూ చెడిపోడు. ఇదే ఈ వేదమంత్ర మహోపదేశం.
**
25. ఈ లోకమంతా కర్మబంధనమే
మంత్రమఖర్వం సుధితం సుపేశసం దధాత యజ్ఞియేష్వా
పూర్వీశ్చన ప్రసితయస్తరంతి తం య ఇంద్రే కర్మణా భువత్‌॥ ఋ.7-32-13.
ప్రతిపదార్థం:- యః= ఎవరు; ఇంద్రే= భగవంతునకు ప్రీతికరంగా, కర్మణా= కర్మలను చేసే విధానంలో; భువత్= సమర్థులై యుంటారో; తాదృశేషు= అటువంటి (అధ్యాహార్యం); యజ్ఞియేషు= యజ్ఞకర్మాధికారులయందు; అఖర్వమ్= హీనంకాని; సుధితమ్= బాగా విచారణ చేసిన; సుపేశసమ్= ప్రయోజనకరమైన; మంత్రమ్= సదాలోచనను; ఆ= పరిపూర్ణంగా; దధాత= ఉంచుము; తథా కృత్వా= ఆ విధంగా చేయడం వలన; పూర్వీః+చన= పూర్వీశ్చన= పూర్వజన్మ సంప్రాప్తమైన; ప్రసితయః= కర్మబంధనాలు; తమ్= వాని నుండి; తరంతి= దూరమైపోతాయి.
భావం:- భగవంతుడికి ప్రీతికరంగా అనగా వేదోక్త కర్మలను బాగా విచారణచేసి సత్కర్మల నాచరించే యాజ్ఞికుల యందు అమోఘమైన ప్రయోజనకరమైన ఆలోచనలనుంచుము. దానివలన వారి పూర్వజన్మకృత పాపకర్మ బంధనాలన్నీ విచ్చుకుపోతాయి.
వివరణ:- పాపమంటె ఏమిటి? పాతకమంటె ఏమిటి? చెడు పని అంటే ఏమిటి? తెలుసా? వీనిని గురించి మనువు వివరిస్తూ నానృతాత్ పాతకం పరమ్ (మను.్ధ.శా.8-82) అసత్య భాషణం కంటె మించిన పాపం లేదు అని ఒక్క మాటలో చెప్పాడు. పాతకమని ముపు తన మాటలో పేర్కొనకపోయినా పాతకం- పాపం రెండూ ఒకటే. పాపకార్యం రెండవ వ్యక్తి లేకుండా జరుగదు. ఉదాహరణకు హింసింపబడే జీవి యున్నప్పడే వ్యక్తి హింస చేయగలడు. మాటాడాలంటె వినేవాడుండాలి. అబద్ధమాడాలంటె నమ్మే మరొక వ్యక్తికావాలి. వస్తువులున్నప్పుడే దొంగతనం జరుగుతుంది. ఆకర్షించే స్ర్తి ఎదురుగా ఉన్నప్పుడే ఆకర్షణ, కామవాసనలు కలుగుతాయి. కాబట్టి లోకంలో రెండవ వ్యక్తిలేకుండా పాపకార్యం జరుగదు. అసలు పాపకార్యాలకు ఆరంభమేది? మదిలో మెదిలే పాపాలోచన. దానికి ఇతరులతో పనిలేదు. వ్యక్తి మనసులోనే అది పుడుతుంది. దానినతడు తన నోటితో ఇతరులకు చెబుతాడు. అలా చేయడంవలన విన్నవాడు కూడ పాపబుద్ది కలవాడవుతాడు. కాబట్టి వేదం అట్టి పాపాలోచనలను ఇతరులకు చెప్పవద్దని హెచ్చరిస్తూంది. మరి చెబితే ఎట్టి మాటలను (ఆలోచనలను) చెప్పాలో ఈ మంత్రంలో వేదర్షి నిర్దేశించాడు.
1. అఖర్వం. 2. సుధితం 3. సుపేశసం.
అఖర్వమ్:- అంటె హీనం కానిదని అర్థం. హీనవచన ప్రబోధం వలన సమాజంలో దుర్భావనలు మొలకెత్తుతాయి. దానివలన సమాజం నాశనమైపోతుంది. కాబట్టి ఉదారశయ పూర్ణమైన ఆలోచనలనే తెలపాలి. తద్వారా సమాజ కల్యాణం సిద్ధిస్తుంది.

--ఇంకావుంది...